చిత్రం: బెజవాడ (2011)
సంగీతం: అమర్ మోహిలే
సాహిత్యం: రెహ్మాన్
గానం: హేమచంద్ర , గీతామాధురి
నటీనటులు: నాగచైతన్య , అమలా పాల్
కథ: రాంగోపాల్ వర్మ
దర్శకత్వం: వివేక్ కృష్ణ
నిర్మాతలు: రాంగోపాల్ వర్మ, కోనేరు కిరణ్ కుమార్
బ్యానర్: శ్రేయ ప్రొడక్షన్
విడుదల తేది: 01.12.2011
చుక్కలన్ని ఒక్కచోట చేరుతుంటే
చందమామ చంతకొచ్చి ఆడుతుంటే
కొంటె చూపులాపి ఉన్న సొగసెంతో చెప్పవే
కన్నెపిల్ల కంటిబాష తెలియకుంటే తప్పులే
మీరేపూట ఎట్టాగ ఉంటారో చెప్పేదెట్టా
మగువంటే అందనంత మనసిచ్చి గెలవాలంట
మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామా మాయబజారే (2)
అందినట్టే అందుతారే అంతలోనే అలుగుతారే
అందమంటు పొగుడుతారే చేరువైతే బెదురుతారే
తీగనడుమే ఎరగా వేసి మనసునే లాగేస్తారే
సరదాలు సరసాలు మా హక్కు అంటారే
మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామా మాయబజారే (2)
చెలిమి కోరే చిలిపి ప్రాయం బదులు ఏమంది
తనువు లోతే తపన నీదే మనసు
ఊగిందీ హేయ్ తెలుసుకోమంది
సిగ్గుతోటి ముగ్గులేసి ముగ్గులోకి దించుతారే
ముందుకళ్ళ బంధమేసి ముద్దులోనే ముంచుతారే
వాలుజడనే మెడకే విసిరి ఊపిరి ఆపేస్తారే
జగడాలు ఆడాళ్ళు అని నిందలే వేస్తారే
మజారే మజారే మామా మజారే
మజారే మజారే మామా మాయబజారే (2)