చిత్రం: బెండప్పారావు R.M.P (2009)
సంగీతం: కోటి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కార్తీక్ , నిత్యా సంతోషిణి
నటీనటులు: అల్లరి నరేష్ , కామ్న జఠ్మలాని, మేఘనా రాజ్
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణ
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 16.10.2009
పల్లవి:
సుకుమారి చిన్నది ఒక మాట అన్నది
సుకుమారి చిన్నది సఖి నాకు అయినది
నాలో జీవం నువ్వే నాలో భావం నువ్వే
నాలో భాగం నాలో భాగ్యం నువ్వే
అన్నీ నువ్వే నువ్వే నువ్వే
సుకుమారి చిన్నది ఒక మాట అన్నది
చరణం: 1
ఏతోడు లేనట్టి నిరు పేదని
నన్ను గుండెల్లో పెట్టావు మహారణిగా
ఏరంగు లేనట్టి ఎద కంటికి
ఏడు వర్ణాలె చూపావు జంటగా
ఏదో ఏదో పుణ్యమే మారింది నీ రూపమై
ఎంతో ఎంతో ప్రార్ధనే చేరింది నీ స్నేహమై
వరమో వలపో ఈ సిరి జడి సగమంటూ
సుకుమారి చిన్నది ఒక మాట అన్నది
చరణం: 2
రాగాలె లేనట్టి పెదవింటిలో
అనురాగాలే నింపావు ప్రియురాలిగా
మోడల్లే ఉన్నట్టి మది తోటలో
పూల వాగల్లే వచ్చావు ప్రేమగా
హో కౌగిళ్ళతో వేయనా అందాలకే వంతెన
హో కన్నీళ్ళతో చేయనా పాదాలకె అర్చన
మలుపే తిరిగే మనకథకిది మొదలంటూ
సుకుమారి చిన్నది ఒక మాట అన్నది
సుకుమారి చిన్నది సఖి నాకు అయినది
నాలో జీవం నువ్వే నాలో భావం నువ్వే
నాలో భాగం నాలో భాగ్యం నువ్వే
అన్నీ నువ్వే నువ్వే నువ్వే
లల లాల లాలలా (4)