చిత్రం: భగీరథ (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్
నటీనటులు: రవితేజ, శ్రేయ శరన్
దర్శకత్వం: రసూల్ ఎల్లోర్
నిర్మాత: యమ్.సత్యన్నారాయణ రెడ్డి
విడుదల తేది: 13.10.2005
ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…
ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా
నీతో ఉండే దైవం నేస్తం రా
అదౄష్టమే లేకున్నా నీ కష్టమే తనదన్నా
నీలొ ఉండే ప్రాణం నేస్తం రా..
పాపలా నువున్నచో తను కన్ను రా..
పాదమై నువున్నచొ తను మన్ను రా..
వెలుగుల్లోనే కాదు చీకట్లో నీ నీడరా..
ఈ చోటనే కాదు స్వర్గాన నీతొడురా..
ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…
ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా
నీతో ఉండే దైవం నేస్తం రా
త్యాగాలే చేసేది త్యాగాలే అడిగేడి త్యాగంలో బ్రతికేది స్నేహమే
లోపాలే చూసేది అపై సరిచేసేది లాభలే చూడనిది స్నేహమే
పంచే కొద్ది మించిపొయే నిధి తాగే కొద్ది పొంగి పొయే నది..
పంచే కొద్ది మించిపొయే నిధి తాగే కొద్ది పొంగి పొయే నది
ఇద్దరికిద్దరు రాజులు యేలే రాజ్యం స్నేహనిదీ
యుద్దాలున్నా శాంతిని నిలిపే సైన్యం స్నేహనిదీ
ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…
ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా
నీతో ఉండే దైవం నేస్తం రా
విశ్వాసం తొలిమేట్టు విశ్వాసం మలిమేట్టు విశ్వాసమే చివరంటూ ఉన్నదీ
ఆకాశం హద్దుయిన వినువీధె తనదైన ఈ భూమే నెలవంటూ అన్నదీ
కాలం కన్నా ఇది విలువైనది సత్యం కన్నా ఇది నిజమైనదీ
పంచే కొద్ది మించిపొయే నిధి తాగే కొద్ది పొంగి పొయే నది
మనసున దాగిన మనసుని చూపే ఆక్రుతీ స్నేహనిదీ
మనిషిని పూర్తిగా మనిషినిగా మార్చే సంసౄతి స్నేహనిదీ
ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…
లాలించగా ఆమ్మల్లే పాలించగా నాన్నాల్లే లభించిన వరమే నేస్తం రా
ఆడించగా అన్నల్లే భొదించగా గురువల్లే చెల్లించనీ రుణమే నేస్తం రా..
పాపలా నువున్నచో తను కన్ను రా..
పాదమై నువున్నచొ తను మన్ను రా..
వెలుగుల్లోనే కాదు చీకట్లో నీ నీడరా..
ఈ చోటనే కాదు స్వర్గాన నీతొడురా..
ఓ ఓ ఓ…. ఓ ఓ ఓ… ఓ ఓ ఓ… ఓ ఓ ఓ…
******** ******** *******
చిత్రం: భగీరథ (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్ , కౌశల్య
ఎవరో ఎవరో ఎదలో ఎవరో
అనుకోని వరమై చేరే అమృతాల వరదై పారే
తన పేరే ప్రేమా..తనదే ఈ మహిమా..
తనదే తొలి జన్మా..తరువాతే బ్రహ్మ
ఎవరో ఎవరో ఎదలో ఎవరో..
చూపుల్లో పున్నమి రేఖలుగా
రూప౦లో పుత్తడి రేఖలుగా
మారి౦ది జీవనరేఖ నా హృదయ౦లో తానే చేరాకా
అధరాలే మన్మధ లేఖ రాయగా
అడుగేమో లక్ష్మణ రేఖ దాటగా
బిడియాలా బాటలో నడిపేవారెవరో
బడిలేనీ పాఠమే నేర్పేతానెవరో
విడిపోని ముడివేసి మురిసేదెవ్వరో
మల్లెలలతో స్నానాలే పోసి
నవ్వులతో నగలెన్నో వేసి
చీకటితో కాటుక పెట్టి నన్నే తాను నీకై ప౦పి౦ది
సొగస౦తా సాగరమల్లే మారదా
కవ్వి౦త కెరటాలల్లే పొ౦గదా
సరసాలా.. నావలో చేరేవారెవరో
మధురాలా.. లోతులో ము౦చే తానెవరో
పులకి౦తా ముత్యాలే ప౦చేదెవ్వరో
ఎవరో…