చిత్రం: భక్త కన్నప్ప (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: కృష్ణంరాజు , వాణిశ్రీ
దర్శకత్వం: బాపు
నిర్మాత: ఉప్పలపాటి.సూర్యనారాయణ రాజు
విడుదల తేది: 1976
తకిటతకతకిట తకిట పదయుగళ
వికటశంభో ఝళిత మధుర పదయుగళా
హరిహరాంకిత పదా
జయ జయ మహాదేవ శివ శంకరా..
హర హర మహాదేవ అభయంకరా..
అని దేవతలు శివుని కొనియాడా
పరవశమ్మున శివుడు తాండవమ్మాడగా
కంపించెనింతలో కైలాసమావేళా
కనిపించెనంత అకాల ప్రళయ జ్వాలా
జగములేలినవాని సగము నివ్వెరబోయే
సగము మిగిలిన వాని మొగము నగవైపోయే
ఓం నమః శివాయ !
ఓం నమః శివాయ !!
అతడే అతడే అర్జునుడూ
పాండవ విజయ యశోధనుడూ
అనితర సాధ్యము పాశుపతాస్త్రము కోరి యుంద గిరి చేరి శివునికై
అహోరాత్రములు చేసెను తపస్సు..ఇది సౄష్థించెను దివ్య మహత్తూ !
నెలవంక తలపాగ నెమలి ఈకగ మారి
తలపైన గంగమ్మ తలపులోనికి మారి
నిప్పులున్సే కన్ను నిదురోయి బొట్టాయె
భూగి పూతకు మారు పులి తోలు వలువాయె
ఎరుక గల్గిన శివుడు ఎరుక గా మారగా
తల్లి పార్వతి మారె తాను ఎకుకత గా
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడీ కదలి వచ్చెను శివుడూ
కైలాసమును వీడీ కదలి వచ్చెను శివుడూ
శివుడు ఆనతిని శిరమున దాల్చి నూకాసురుడను రాక్షసుడూ
వరాహ రూపము ధరించి వచ్చెను ధరాతలమ్మే అదిరిపోవగా
చిచ్చర పిడుగై వచ్చిన పందిని
రెచ్చిన కోపముతో అర్జునుడూ మట్టుపెట్టగా
పట్టె బాణమూ ధనువొక చేతను అందుకొనీ
చూసిన కంటను చూడకనే గురి చూసిననంతనే..వేసినంతనే..
తలలు రెండుగా విలవిలలాడుతు
తనువు కొండగా గిర గిర తిరుగుచు
అటునిటు తగిలిన రెండు బాణముల
అసువులు వీడెను వరాహమూ…
కొట్టితి నేనని అర్జునుడూ
పడగొట్టితి నేనని శివుడూ
పట్టిన పట్టును వదలకనే తొడగొట్టిన వీరముతో హపుడూ
వేట నాది వేటు నాది వేటాడే చోటు నాది
భేటి తగవు పొమ్మనె విలు మీటి పలికె శివుడూ
చేవ నాది చేత నాది చేటెరుగని ఈటె నాది
చేవుంటే రమ్మనె కనుసైగ చేసె అర్జునుడూ
గాండీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించె అర్జునుడు
కానీ అపుడతడు దేహి చేతుల కార్తవీర్యార్జునుడూ
ఓంకార ఘనధనుష్టంకారముల తోడ శరపరంపర కురిసె హరుడు
అయినా నరుని కాతడు మనోహరుడూ
చిత్రమేమొ గురిపెట్టిన బాణమ్ములు మాయమాయే
విధివిలాసమేమో పెట్టిన గురి వట్టిదాయే
అస్త్రములే విఫలమాయె..శస్త్రములే వికలమాయె
సవ్యసాచి కుడిఎడమై సంధించుట మరచిపోయే
జగతికి సుగతిని సాధించిన తల
దింగంతాలకవతల మెలిగే తల
గంగకు నెలవై..కళకాదరువై
హరిబ్రహ్మలకు తరగని పరువై
అతి పవిత్రమై అగధ నేత్రమై
శ్రీపరమై శుభమైన శివుని తల
అదరగా..సౄష్టి చెదరగా
తాడి ఎత్తు గాండీవముతో..ముత్తాడి ఎద్దుగా ఎదిగి అర్జునుడు
చండ కోపమున కొట్టినంతనే
తల్లితండ్రుల కనుల చలువైన దేవుడూ
కోరిన వరాలిచ్చు కొండంత దేవుడూ
ఎదుట నిలిచెను శివుడు ఎదలోని దేవుడూ
పదములంటెను నరుడు భక్తితో అపుడూ
కరచరణ శ్రుతం వా
కర్మ వాక్కాయజం వా..
శ్రవణ నయనజం వా
మానసవాపరధాం
విహిత మహితం వా..
సర్వామేతక్షమస్వా..
శివ శివ కరుణాబ్దే..శ్రీ మహాదేవ శంభో..
నమస్తే..నమస్తే..నమస్తే..నమః..
******** ******** ********
చిత్రం: భక్త కన్నప్ప (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: వి.రామకృష్ణ
పల్లవి:
శివ శివ శంకర భక్తవ శంకర
శంభో హరహర నమో నమో
శివ శివ శంకర భక్తవ శంకర
శంభో హరహర నమో నమో
చరణం: 1
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల చేయాలి నీ సేవలు
శివ శివ శంకర భక్తవ శంకర
శంభో హరహర నమో నమో
చరణం: 2
మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగను తేనా నీ సేవకూ
******** ******** ********
చిత్రం: భక్త కన్నప్ప (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: వి.రామకృష్ణ, పి.సుశీల
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా
అరె సిన్నోడా
ఆకుచాటున పిందె ఉందీ చెట్టూ సాటున సిన్నాదుందీ
ఓ ఓ ఓ ఆకుచాటున పిందె ఉంది చెట్టూ సాటున సిన్నాదుందీ
సక్కని సుక్కని టక్కున ఎతికీ దక్కించుకోరా దక్కించుకోరా
దక్కించుకోరా దక్కించుకోరా
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా
అరె సిన్నమ్మీ
మబ్బు ఎనకా మెరుపుతీగె దుబ్బు ఎనకా మల్లెతీగా
ఓ ఓ ఓ మబ్బు ఎనకా మెరుపుతీగె దుబ్బు ఎనకా మల్లెతీగా
ఏడానున్నా దాగోలేవే మల్లెమొగ్గా అబ్బో సిగ్గా
మల్లెమొగ్గా అబ్బో సిగ్గా
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా
అహ అత్తారింటికి దారేదమ్మా సందామామా
ఆమడ దూరం ఉందోలమ్మా సందామామా
అహ అత్తారింటికి దారేదమ్మా సందామామా
అరెరెరెరె ఆమడ దూరం ఉందోలమ్మా సందామామా
ఆమడ దూరం ఉన్నాగానీ ఎళ్ళాలమ్మా
ఆమడ దూరం ఉన్నాగానీ ఎళ్ళాలమ్మా
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా
సీకటింట్లో సిక్కు తీసా ఎలుతురింట్లో కొప్పు ముడిసా
ఓ ఓ ఓ సీకటింట్లో సిక్కు తీసా ఎలుతురింట్లో కొప్పు ముడిసా
కొప్పూ లోనీ మొగలీ పువ్వూ గుప్పుమందే ఒప్పులకుప్పా
ఓయ్ గుప్పుమందే ఒప్పులకుప్పా
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా
సందమామా రైకలెన్ని కలువపువ్వూ రేకులెన్ని
ఓ ఓ ఓ సందమామా రైకలెన్ని కలువపువ్వూ రేకులెన్ని
దానికి దీనికి ఎన్నెన్ని ఉన్నా నీకు నేనే నాకు నువ్వే
నీకు నేనే నాకు నువ్వే
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా
******** ******** ********
చిత్రం: భక్త కన్నప్ప (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: వి.రామకృష్ణ, పి.సుశీల
ఆకాశం దించాలానెలవంకా తుంచాలాసిగలో ఉంచాలా
ఆకాశం దించాలానెలవంకా తుంచాలాసిగలో ఉంచాలా
చెక్కిలి నువ్వూ నొక్కేటప్పటి చక్కిలిగింతలు చాలు
ఆకాశం నా నడుమూనెలవంకా నా నుదురూసిగలో నువ్వేరా
పట్టు తేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానేతెస్తానే
మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానేతీస్తానే
ఆపట్టు తేనె నీకన్నా తియ్యంగా ఉంటుందా
మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా
అంతేనాఅంతేనా
అవునుఅంతేరా
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా
సూరీడూ ఎర్రదనం సింధూరం చేస్తానేచేస్తానే
కరిమబ్బూ నల్లదనం కాటుక దిద్దేనేదిద్దేనే
ఆనీ వంటి వెచ్చదనం నన్నేలే సూరీడూ
నీ కంటి చల్లదనం నా నీడనా గూడూ
అంతేనాఅంతేనా
అవునుఅంతేరా
హహమెరిసేటి చుక్కల్నీ మెడలోన చుట్టాలాతలంబ్రాలు పొయ్యాలా
గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా !
******** ******** ********
చిత్రం: భక్త కన్నప్ప (1976)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: జానకి
శివ శివ అననేలరా
శివ శివ అననేలరా
కౌగిలిలోనే కైలాసమందగా
కౌగిలిలో నే కైలాసమీయగా
శివ శివ అననేలరా
కొందరికేమో జన్మకో శివరాత్రి
ఈ సుందరికి ప్రతి రాత్రి నవరాత్రి
కొందరికేమో జన్మకో శివరాత్రి
ఈ సుందరికి ప్రతి రాత్రి నవరాత్రి
భక్తులకో బ్రతుకు గడుపగా గడుపగా ముక్తి
భక్తులకో బ్రతుకు గడుపగా గడుపగా ముక్తి
మనబోటి రక్తులకు ఘడియ ఘడియకు ముక్తి శివ శివా
శివ శివ అననేలరా
కౌగిలిలోనే కైలాసమందగా
కౌగిలిలో నే కైలాసమీయగా
శివ శివ అననేలరా రా
టక్కరి మరుని ముక్కడగించెను నాటి ముక్కంటి చూపు
కాలిన మదనుని మేలుకొలిపెను నేటి నీ కొంటె చూపు
టక్కరి మరుని ముక్కడగించెను నాటి ముక్కంటి చూపు
కాలిన మదనుని మేలుకొలిపెను నేటి నీ కొంటె చూపు
సగము మేనిలో మగువను నిలిపిన
సగము మేనిలో మగువను నిలిపిన చంద్రధరుడు ఆ హరుడు
తనువు తనువునే మరునికొసగిన రసికవరుడు ఈ హరుడు శివ శివా
శివ శివ అననేలరా
కౌగిలిలోనే కైలాసమందగా
కౌగిలిలో నే కైలాసమీయగా
శివ శివ అననేల రా రా రా