చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: ఘంటసాల
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, శివాజి గణేషన్, అంజలిదేవి
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: పి.ఆదినారాయణరావు
విడుదల తేది: 05.07.1973
(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు)
హరి ఓం హరి ఓం హరి ఓం ఆ… ఆ… ఆ…
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
అది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపో
అది మధుర మధుర మధురమౌ ఓంకారమౌ
పాండురంగ పాండురంగ
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
చరణం: 1
ప్రాభాత మంగళ పూజావేళ
నీ పద సన్నిధి నిలబడీ నీ పదపీఠిక తలనిడి
ప్రాభాత మంగళ పూజావేళ
నీ పద సన్నిధి నిలబడీ నీ పదపీఠిక తలనిడీ
నిఖిల జగతి నివాళులిడదా నిఖిల జగతి నివాళులిడదా
వేడదా కొనియాడదా పాండురంగ పాండురంగ
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
చరణం: 2
గిరులూ ఝరులూ విరులూ తరులూ
నిరతము నీపాద ధ్యానమే నిరతము నీ నామ గానమే
గిరులూ ఝరులూ విరులూ తరులూ
నిరతము నీపాద ధ్యానమే నిరతము నీ నామ గానమే
సకల చరాచర లోకేశ్వరేశ్వరా
సకల చరాచర లోకేశ్వరేశ్వరా
శ్రీకరా భవహరా పాండురంగ పాండురంగ
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
ఘనాఘన సుందరా
పాండురంగ పాండురంగ (8)
******** ********* ********
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, పి. సుశీల
పూజకు వేళాయెరా…
రంగపూజకు వేళాయెరా…
పూజకు వేళాయెరా…
ఇన్నినాళ్లు నే నెటుల వేచితినో
ఎన్ని రేలు ఎంతెంత వేగితినో
ఇన్నినాళ్లు నే నెటుల వేచితినో
ఎన్ని రేలు ఎంతెంత వేగితినో
పిలుపును విని విచ్చేసితివని
నా పిలుపును విని విచ్చేసితివని
వలపులన్నీ నీ కొరకె దాచితిని
వలపులన్నీ నీ కొరకె దాచితిని
ఎవరూ పొందని ఏకాంతసేవలో
ఈవేళ తమితీరగా నిన్నె అలరించు
పూజకు వేళాయెరా పూజకు వేళాయెరా
చరణం: 1
ఈ నీలినీలి ముంగురులు ఇంద్రనీలాల మంజరులు
ఈ వికసిత సిత నయనాలు శతదళ కోమల కమలాలు
అరుణారుణమీ అధరము తరుణమందార పల్లవము
అ…ఎదలో పొంగిన ఈ రమణీయ పయోధరాలు
పాలకడలిలో ఉదయించు సుధాకలశాలు
ఎంత సుందరము శిల్ప బంధురము ఈ జఘన మండలము
సృష్టినంతటిని దాచుకున్న ఆ పృథివీ మండలము
ఓ అభినవ సౌందర్యరాశీ
ఓ అపూర్వ చాతుర్యమూర్తీ
నీ కటాక్షముల లాలనమ్ములో
నీ మధురాధర చుంబనమ్ములో
నీ కటాక్షముల లాలనమ్ములో
నీ మధురాధర చుంబనమ్ములో
మధురిమలెన్నో పొదుగుకున్న
నీ స్తన్య సుధల ఆస్వాదనమ్ములో
అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో
హాయిగా నిదురించ గలిగే పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే
లేదాయె తల్లీ… తల్లీ… తల్లీ…
స్వామీ…
అవునమ్మా నీవు ప్రదర్శించిన సౌందర్యం అనిత్యం
నీవు నమ్ముకున్న యవ్వనం అశాశ్వతం
దువ్వుకున్న ఆ నీలిముంగురులె దూదిపింజలై పోవునులే
నవ్వుతున్న ఆ కంటి వెలుగులే దివ్వెల పోలిక ఆరునులే
వన్నెలొలుకు ఆ చిగురు పెదవులే వాడి వక్కలై పోవునులే
పాలుపొంగు ఆ కలశాలే తోలుతిత్తులై పోవునులే
నడుము వంగగా నీ ఒడలు కుంగగా
నడుము వంగగా ఒడలు కుంగగా
నడువలేని నీ బడుగు జీవితం వడవడ వణకునులే
ఆశలు రేపే సుందర దేహము అస్థిపంజరంబౌవ్వునులే
స్వామి మన్నించండి అందగత్తెననే అహంకారంతో
మిమ్మల్ని అపకీర్తి పాలు చెయ్యాలని ప్రయత్నించాను
మిమ్మల్ని ఓడించాలనుకొని నేనోడిపోయాను
మీరు నా హృదయంలోని చీకటి తెరలను తొలగించారు
పోరలుకమ్మిన నా కళ్ళు తెరిపించారు
స్వామి ఇక మీరే నాకు శరణ్యం ఈ నరకకూపం నుండి తప్పించి
నాకు వెలుగుబాట చూపించండి
బహిన పతిత పవణుడైన ఆ పాండు రంగడే మనందరికీ శరణ్యం
ఆ దేవ దేవుని సేవించి తరించు
పాండురంగ హరి జైజై పాండురంగ హరి (5)
విఠల విఠల పాండురంగ (4)
******** ******** ********
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల
సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా…
సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా…
సరిసరీ…
చెంతకు రమ్మన చేరనంటినా…
చెక్కిలినొక్కిన కూడదంటినా…
చెంతకు రమ్మన చేరనంటినా…
చెక్కిలినొక్కిన కూడదంటినా…
తొలిఝామైనా కానిదే
తొలిఝామైనా కానిదే తొందర ఎందుకు ఎందుకంటిరా…
సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా…
సరిసరీ…
చరణం: 1
ఆ… మంచి గంధం పూయకముందే
మల్లెమొగ్గలు చల్లకముందే
మంచి గంధం పూయకముందే మల్లెమొగ్గలు చల్లకముందే
కులుకుటందెలు మోగకముందే
కొత్త జావళి పాడకముందే
గరిస నిపమప ససని ససనిసని
నినిప నినిపనిప
మగప మనిపసని పపాని
పమగమ గపామగ సనిస
ఆ… ఆ… ఆ…
కొత్త జావళి పాడకముందే
కంటి గిలుపుల జంట తలపుల
కొంటి చేతల కవ్వింతలింకేల చాలించవేరా…
సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా…
సరిసరీ…
చరణం: 2
ఆ… పండువెన్నెల పానుపు చేసి
పైట కొంగున వీవన వీచీ
వేడిముద్దులు కానుక చేసి
విడని కౌగిట బందీచేసి
ఎన్నడెరుగని వన్నెతరుగని
కన్నెవలపులు అందించి అందాలు చిందింతులేరా…
సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా…
సరిసరీ…
******** ******** ********
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: వీటూరి
గానం: ఘంటసాల
ఆ నందన వనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి
మరచితివో మానవ జాతిని దయమాలి
బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
బలే బలే అందాలు సృష్టించావు
మాటలు రాని మృగాలు సైతం మంచిగ కలసి జీవించేను
మాటలు నేర్చిన మా నరజాతి మారణ హోమం సాదించేను
మనిషే పెరిగి మనసే తరిగి
మనిషే పెరిగి మనసే తరిగి మమతే మరచాడు మానవుడు
నీవేల మార్చవు…
బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
బలే బలే అందాలు సృష్టించావు
ఆ ఆ… చల్లగ సాగే చలయేటివోలే మనసే నిర్మలమై వికచించాలి
గుంపుగ ఎగిరే గువ్వలవోలే అందరు ఒక్కటై నివసించాలి
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని
మంచిగ మానవుడే మాధవుడై మహిలోన నిలవాలి…
బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
బలే బలే అందాలు సృష్టించావు
******** ******** ********
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల
సర్వసుఖాలకు నిలయం దేహం ఈ దేహంపై అందుకె మొహం
అహము విడిచితే ఆనందమురా అన్నిట మిన్నా అనురాగమురా
భక్త తుకారాం గానము వింటే మనసు ఊయలై ఉగునురా
ప్రేమ మందిరా శ్యామసుందరా
ప్రేమ మందిరా నా శ్యామసుందరా
******** ******** ********
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: వీటూరి
గానం: ఘంటసాల
శ్రీ పాండురంగ విఠల్ కి జై
జై జై విఠల్ పాండురంగా విఠల్ విఠల్ పాండురంగ (5)
ఓ నరుడా… పామరుడా…
చిందులు వేయకురా
ఆ… చిందులు వేయకురా
చిందులు వేయకురా
శ్రీరంగ నీతులు చెప్పకురా
శ్రీరంగ నీతులు చెప్పకురా
తెలిసీ తెలియని అజ్ఞానముతో
తెలిసీ తెలియని అజ్ఞానముతో
ప్రజలను వంచన చేయకురా
ప్రజలను వంచన చేయకురా
చిందులు వేయకురా
తనకంతా తెలుసునని తన మాటే వేదమని
తనకంతా తెలుసునని తన మాటే వేదమని
తానే ఒక ఘనుడని తలచే నరుడు వానరుడు పామరుడు
ఆ ఆ… తానెవరో తెలుసుకొని…
తన తప్పులు ఒప్పుకొని…
తనబాధ్యత గ్రహించువాడే జ్ఞాని విజ్ఞాని
విత్తముపై ఆశలు విడచి చిత్తములో రంగని కొలిచి
విత్తముపై ఆశలు విడచి చిత్తములో రంగని కొలిచి
పరమార్ధం గ్రహించరా తత్వము తెలిసి తరించరా
చిందులు వేయకురా
******** ******** ********
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: దాశరధి
గానం: వి.రామకృష్ణ
శ్యామసుందరా ప్రేమ మందిరా
నీ నామమే వీనుల విందురా
నీ నామమే వీనుల విందురా శ్యామసుందరా
ఆణువణువూ నీ అలయమేరా నీవే లేని చోటు లేదురా
ఆణువణువూ నీ అలయమేరా నీవే లేని చోటు లేదురా
నేనని నీవని లేనే లేదు నీకు నాకు భేదము లేదు
శ్యామసుందరా ప్రేమ మందిరా
సుఖదుఃఖాలకు నిలయం దేహం ఈ దేహముపై ఎందుకె మొహం
అహము విడిచితే ఆనందమురా అన్నిట మిన్నా అనురాగమురా
భక్త తుకారాం గానము వింటే తొలగిపోవును శోకంరా
శ్యామసుందరా ప్రేమ మందిరా
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా
అలవాటైతే విషమే అయినా హాయిగ త్రాగుట సాధ్యమురా
హాయిగ త్రాగుట సాధ్యమురా
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా
కాల సర్పమును మెడలో దాల్చి పూల మాలగా తలచవచ్చురా
పూల మాలగా తలచవచ్చురా
ఏకాగ్రతతో ధ్యానము చేసి లోకేశ్వరునే చేర వచ్చురా
లోకేశ్వరునే చేర వచ్చురా
దాస తుకారాం తత్వ బోదతో తరించి ముక్తిని పొందుమురా
తరించి ముక్తిని పొందుమురా
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా
అనిగిమనిగి నుండే వాడే అందరిలోకి ఘనులు
అనిగిమనిగి నుండే వాడే అందరిలోకి ఘనులు
డొద్దమాణులను కూల్చు తుఫాను గడ్డిపరకను కదల్చ గలదా
కదల్చ గలదా
చిన్న చీమలకు చెక్కెర దొరకెను గొప్ప మనిషికి ఉప్పే కరువు
ఉప్పే కరువు
అనుకువ కోరే తుకారాముని మనసే దేవుని మందిరము
మనసే దేవుని మందిరము
అనిగిమనిగి నుండే వాడే అందరిలోకి ఘనులు
పడవెళ్లి పోతుందిరా ఆ…ఆ… ఓ…
పడవెళ్లి పోతుందిరా ఓ మానవుడా దరిచేరే దారేదిరా
ఈ జీవితము కెరటాల పాలాయెరా
పడవెళ్లి పోతుందిరా…
తల్లిదండ్రి అతడే నీ ఇల్లువాకిలతడే
తల్లిదండ్రి అతడే నీ ఇల్లువాకిలతడే
ఆ పాండురంగడున్నాడురా…
నీ మనసు గోడు వింటాడురా నీ భారమతడు మోసేనురా
ఓ యాత్రికుడా నిన్నతడే కాసేనురా
పడవెళ్లి పోతుందిరా…
బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోనే చితుకు
బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోనే చితుకు
ఇది శాశ్వతమని తలచేవురా నీ వెందుకని మురిచేవురా
నువు దరిచేరే దరి వెతకరా
ఓ మానవుడా హరినామం మరవవద్దురా
పడవెళ్లి పోతుందిరా…