చిత్రం: భలే బుల్లోడు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి.బాలు, చిత్ర
నటీనటులు: జగపతిబాబు, సౌందర్య
దర్శకత్వం: శరత్
నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 1995
ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని
మెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని
కనుచూపులే కొంటె మెరుపులై
కవ్వింతలే కన్నె ఉరుములై
కలిపింది వాన కౌగిళ్ళలో
ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని
మెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని
కొత్త కొత్త కోరికా కొంగే దాటు వేళలో
వెన్నపూస లాంటి ఒళ్ళు నిన్నే కోరుతున్నది
వెచ్చనైన ఊహలో ఒల్లే తుల్లే హాయిలో
రెచ్చిపోయి కోడె ఈడు నిన్నే తరుముతున్నది
కట్టాలి జట్టు పట్టాలి పట్టు కమ్మంగ వాన జోరులో
పట్టేనే గుట్టు ఉయ్యాల కట్టు అందాల పూల దీవిలో
మెరుపే మైమరుపై నీ ఒడిలో దాగే వేళా
ఆఁ ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని
ఆఁ… మెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని
అగమంటే ఆగదు అశే నన్ను వీడదు
చిన్నదాని చీర బెంగ తీర్చేదాక వదలదు
తాళలేడు తుంటరి మాటే వినడు పోకిరి
తెల్లవారిపోయేదాక ఆపేదెట్టా అల్లరి
చిక్కావే బొమ్మ దానిమ్మ రెమ్మా చిత్రాలు చేసే వానలో
ఆడించకమ్మా అంటితే కొమ్మ మత్తెక్కిపోయే మలుపులో
వయసే వెల్లువగా కమ్ముకొనే కోలాటంలో
ఆఁ ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవని
హోయ్ మెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని
కను చూపులే కొంటె మెరుపులై
కవ్వింతలే కన్నె ఉరుములై
కలిపింది వాన కౌగిళ్ళలో
********** *********** **********
చిత్రం: భలే బుల్లోడు (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, చిత్ర
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
హేయ్ నీ బంపరు సోకు నాదేలే కన్యకుమారి
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
పూబంతుల రేకు నీదేలే కుర్ర కుమారా
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
ఓ పైట వయ్యారి ఆట మయూరి జంట షికారి చలో మరీ
హోయ్ పక్కకురారా ఓ చక్కని వీరా
దండుకు పోరా ఓ దిండుకుమారా
నీ బంపరు సోకు నాదేలే కన్యకుమారి
పూబంతుల రేకు నీదేలే కుర్ర కుమారా
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
హో నీ జోరుకు చేస్తా జోహారు
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
నీ జోలికి వస్తే బేజారు
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
ఒరత్త కొడకా ఒళ్ళంత అలక పుట్టించి లాలించుకో
కోడి కూత కెక్కితే గంపలెక్కడాగునే
ఒట్టి మాటలింక కట్టిపెట్టు ఉట్టిమీదచెయ్య పెట్టు
ముంత దాచి ముచ్చటాడుకుండమురో
హేయ్ అంటుకుపోవే నా సెంటుకుమారి
దులుపుకుపోని నీ దుమ్ము దుమారి
నీ బంపరు సోకు నాదేలే కన్యకుమారి
పూబంతుల రేకు నీదేలే కుర్ర కుమారా
హేయ్ నా చూపులు చంపి బాణాలు
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
అవి మన్మధ బంతికి బాణాలు
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
నా మామ చిలక నీ ప్రేమ మొలక ముగ్గేసె ముంగిళ్ళలో
ఈడు వంద చేరని ఆడ హద్దు దాటని
కన్నె పూతరేకు మేత పెట్టు కన్నుకొట్టి వెన్ను తట్టి
పాల పొంగు మీగడందుకుందాములే
దాటుకుపోరా ఓ నీటు కుమారా – అరరెరరె
నా పొలిమేర ఓ నీ కసి తీరా
నీ బంపరు సోకు నాదేలే కన్యకుమారి
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
పూబంతుల రేకు నీదేలే కుర్ర కుమారా
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
హాయ్ రుక్కు హాయ్ రుక్కు హాయ్ హాయ్
ఓ పైట వయ్యారి ఆట మయూరి జంట షికారి చలో మరీ
హోయ్ వద్దకురారా ఓ చక్కని వీరా
దండుకు పోరా ఓ దిండుకుమారా