చిత్రం: భలే దొంగ (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, జానకి
నటీనటులు: బాలకృష్ణ , విజయశాంతి
దర్శకత్వం: ఎ కోదండరామిరెడ్డి
నిర్మాత: కె. దేవి వర ప్రసాద్
విడుదల తేది: 10.02.1989
ఏం ముద్దు యమా ముద్దు
ఏం ముద్దు యమా ముద్దు
ఒక్క దెబ్బకే కదిపేసి కుదిపేసి నలిపేసింది
ఏం ముద్దు యమా ముద్దు
ఏం ముద్దు యమా ముద్దు
ఒక్క దెబ్బకే కరిచేసి కొరికేసి దులిపేసింది
ఏమి చెప్పుకోనమ్మ ముద్దు ముచ్చట
ఎంతదూరమెళ్లింది ప్రేమ మక తిక
ఎంత గారడీ ముద్దు తాకిడి
ఎప్పుడూ రెడీ చప్పరింతకి
ఏం ముద్దు యమా ముద్దు
ఏం ముద్దు యమా ముద్దు
ఒక్క దెబ్బకే కదిపేసి కుదిపేసి నలిపేసింది
కదిల్తే ముద్దు మెదిల్తే ముద్దు
కసెక్కే ప్రేమలో శుభం
సరేలే ముందుకాని వేడుకో కోరుకో
పుట్టాలి లేతబుగ్గల్లో మోత పిట్టంత ముద్దు చేసుకో
పలాన పండు నీదే నంజుకో పుంజుకో
ఒంపుకొక్క ముద్దుపెట్టి ఒళ్ళు రుద్దనా
ఎంగిలెట్టి రంగులేస్తే నీకు దక్కనా
ముద్దే క్షేమము లాభము అందము చందము
ఏం ముద్దు యమా ముద్దు
ఏం ముద్దు యమా ముద్దు
ఒక్క దెబ్బకే కదిపేసి కుదిపేసి నలిపేసింది
కథల్లో ముద్దు నవల్లో ముద్దు తెరల్లో ముద్దుకే సుఖం
ఖలేజా ఉంటే నీదే కాసుకో కమ్ముకో
కన్నేస్తే ముద్దు కాటేస్తే ముద్దు కవ్వించే ముద్దులే శుభం
తడాఖా ఉంటె ముద్దు పెట్టుకో గట్టిగా
ముద్దులన్ని మూట కట్టి ముందుపెట్టనా
మూటకున్న ముడ్లు విప్పి కన్నుకొట్టనా
ముద్దే దాహము మోహము ప్రేమకే దేహము
ఏం ముద్దు యమా ముద్దు
ఏం ముద్దు యమా ముద్దు
ఒక్క దెబ్బకే కరిచేసి కొరికేసి దులిపేసింది
ఏమి చెప్పుకోనమ్మ ముద్దు ముచ్చట
ఎంతదూరమెళ్లింది ప్రేమ మక తిక
ఎంత గారడీ ముద్దు తాకిడి
ఎప్పుడూ రెడీ చప్పరింతకి
ఏం ముద్దు – అబ్బా, యమా ముద్దు – అమ్మా
ఏం ముద్దు యమా ముద్దు
ఒక్క దెబ్బకే కదిపేసి కుదిపేసి నలిపేసింది
******* ******* *********
చిత్రం: భలే దొంగ (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, జానకి
అందాల గుమ్మడి పండు…
ఓ హో హో హో ఓ హో హో హో (2)
కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా
కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా
కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా
కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా
మంచుల్లో మంచాలే వెయ్యరాదా
వెన్నెల్లో దీపాలే పెట్టరాదా
సాగింది మురిపాల ముద్దుల పాకం
రేగింది పరువాల పక్కల తాళం
ఈ సాయంత్రం ఒళ్ళో సంగీతం
నీ సావాసం చలిలో సంసారం
కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా
కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా
ఓ హో హో హో ఓ హో హో హో
ఓ హో హో హో ఓ హో హో హో
సందెమబ్బు పైటేసి చందమామ బయటేసి
వచ్చాక జంట జాతర – ఓ హో హో హో
ఈడుకొద్ది ఈలేసి సిగ్గులుంటే తోలేసి
తీయాలి ప్రేమ పాతర – ఓ హో హో హో
పోద్దుల్ని మొద్దు నిద్ధర ఓ హో హో హో
పోనివ్వు మెత్త మెత్తగా ఆ. ఆ. ఆ. ఆ
కాని… చూపెందుకు
నాతో ఊపందుకో
నా వయ్యారం పిలిచే పేరంటం
ఈ పువ్వుల్తో తెచ్చా నా అందం
కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా
కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా
అయ్య అయ్య అయ్య అయ్
అమ్మ అమ్మ అమ్మ అమ్మ
అయ్య అయ్య అయ్య అయ్
అమ్మ అమ్మ అమ్మ అమ్మ
మల్లెపూల పక్కేసి మంచి గంధం ఇచ్చేసి
వేసేయి చాటు వంతెన – ఓ హో హో హో
చెక్కాముక్క చెల్లించి ఆకు వక్క అర్పించి
పుట్టించు తీపి యాతన – ఓ హో హో హో
పువ్వల్లే ఉంది నా ఎద ఓ హో హో హో
నువ్వోచ్చి వాలు తుమ్మెద ఓ హో హో హో
నీలో… ఏమున్నదో
నాలో… శోధించుకో
నీ కౌగిట్లో కరిగే కాశ్మీరం
నీ నవ్వుల్లో వెలిగే కర్పూరం
కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా
కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా
మంచుల్లో మంచాలే వెయ్యరాదా
వెన్నెల్లో దీపాలే పెట్టరాదా
సాగింది మురిపాల ముద్దుల పాకం
రేగింది పరువాల పక్కల తాళం
ఈ సాయంత్రం ఒళ్ళో సంగీతం
నీ సావాసం చలిలో సంసారం
కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పెనమ్మా…
కన్నుగీటి మందారం అప్ప జెప్పెనమ్మా…