A To Z Telugu LyricsA To Z Telugu Lyrics
Aa
  • Movie Albums
  • Devotional
  • Trending Lyrics
  • Motivational Mode
  • Bhakti
  • Love Failure Songs
  • Love Songs
  • Private Album Songs
  • Telugu Rain Songs
  • Laali Paatalu
  • Folk Lyrics
Reading: Bharat Anu Nenu (2018)
Share
Aa
A To Z Telugu LyricsA To Z Telugu Lyrics
Search your favourite lyric
  • Movie Albums
  • Devotional
  • Trending Lyrics
  • Motivational Mode
  • Bhakti
  • Love Failure Songs
  • Love Songs
  • Private Album Songs
  • Telugu Rain Songs
  • Laali Paatalu
  • Folk Lyrics
Mahesh BabuMovie Albums

Bharat Anu Nenu (2018)

Share

Bharath Ane Nenu Lyrics

భరత్ అనే నేనూ… లిరిక్స్

చిత్రం: భరత్ అనే నేను (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: డేవిడ్ సైమన్
నటీనటులు: మహేష్ బాబు, కైరా అద్వానీ
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాణం: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 20.04.2018

విరచిస్తా నేడే నవశకం
నినదిస్తా నిత్యం జనహితం
నలుపెరగని సేవే అభిమతం
కష్టం ఏదైనా సమ్మతం
భరత్ అనే నేనూ… హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ….
of the people
for the people
by the people ప్రతినిధిగా
this is me… this is me
this is me… this is me

పాలించే ప్రభువుని కాననీ
సేవించే బంటుని నేననీ
అధికారం అర్దం ఇది అనీ
తెలిసేలా చేస్తా నా పనీ

భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ….
of the people
for the people
by the people ప్రతినిధిగా
this is me… this is me
this is me… this is me

మాటిచ్చా నేనీ పుడమికీ
పాటిస్తా ప్రాణం చివరికీ
అట్టడుగున నలిగే కలలకీ
బలమివ్వని పదవులు దేనికీ

భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ
బాధ్యున్నై ఉంటానూ….
of the people
for the people
by the people ప్రతినిధిగా
this is me… this is me
this is me… this is me

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

i don’t know… లిరిక్స్

చిత్రం: భరత్ అనే నేను (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఫరహన అక్తర్
నటీనటులు: మహేష్ బాబు, కైరా అద్వానీ
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాణం: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 20.04.2018

లెమి లెమి గొ లెమి గొ లెమి గో గో గో గో
లెమి లెమి learn something interesting on the go
universe అనే encyclopedia లో లో లో లో
తెలుసుకున్న కొద్ది ఉంటాయి ఎన్నెన్నో
art of living అంటే….art of learning అంటే
నాకు తెలిసింది ఓ కొంత తెలియంది ఇంకెంతో
i don’t know…i don’t know…know know know
know know know know know know
i don’t know…know know know
know know know know know ఎన్నో

i don’t know…know know know
know know know know know
i don’t know…i don’t know…know know know
know know know know know know ఎన్నో

ఎందుకో మరి మాటికొక్క సరీ
చెంగు మంది చేప నీటినుంచి యెగిరీ
కొత్త గాలిలో కొత్తగా సంగతేదో నేర్చుకోవడానికేమో
i don’t know…i don’t know
ఎన్ని సార్లు చెప్పినా good morning
తగ్గదే మరి ఆ sun shining
కొత్త మేటరేదొ భూమినుంచి రోజూ నేర్చుకున్న వెలుగేమో
i don’t know…i don’t know only one thing i know
there is so much to know
wanna grow అంటు స్టార్ట్ అయ్యె జర్నీకి స్టీరింగ్ ఏ

i don’t know…know know know
know know know know know
i don’t know…i don’t know…know know know
know know know know know know ఎన్నో

i don’t know…know know know
know know know know know
i don’t know…i don’t know…know know know
know know know know know know ఎన్నో

కంటి ముందు ఉన్న అద్భుతాలు ఎన్నో
వాటిలోన ఉన్న మిస్టరీలు ఎన్నో
ఎంతకాలం చూసి చూడకుండా ఎన్ని వదిలేశానో
i don’t know…i don’t know
questionఅయి ఈ నిమిషంలో తెలుసుకుంటా తెలియనివెన్నో
నన్ను చేరే మరు నిమిషం నాకింకేం నేర్పుతుందో
i don’t know…i don’t know
on a birdseye view…life a learning avenue
everyday ఏదో నేర్పిచే refreshing అంతమే..

i don’t know…know know know
know know know know know
i don’t know…i don’t know…know know know
know know know know know know ఎన్నో

i don’t know…know know know
know know know know know
i don’t know…i don’t know…know know know
know know know know know know ఎన్నో

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

ఓ వసుమతి, ఓ ఓ వసుమతి… లిరిక్స్

చిత్రం: భరత్ అనే నేను (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యాజిన్ నిజార్, రీటా
నటీనటులు: మహేష్ బాబు, కైరా అద్వానీ
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాణం: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 20.04.2018

దేవదారు శిల్పంలా
మెరిసి పోయే ప్రియురాలా
ఓ వసుమతి , ఓ ఓ వసుమతి
ప్రేమ కవితల షెల్లీ లా
మారిపోయా నీవల్ల
ఓ వసుమతి , ఓ ఓ వసుమతి

ప్రపంచమేలు నాయకా
ఇదేగా నీకు తీరికా
మనస్సు దోచుకుంది నీ పోలికా
పదే పదే పనే అని
మరీ అలాగే ఉండకా
పెదాల తీపి చూడగా రా ఇకా
దరికి చేరవే సోకుల హార్మోనికా

దేవదారు శిల్పంలా
మెరిసి పోయే ప్రియురాలా
ఓ వసుమతి , ఓ ఓ వసుమతి
ప్రేమ కవితల షెల్లీ లా
మారిపోయా నీవల్ల
ఓ వసుమతి , ఓహ్ ఓహ్ వసుమతి

ఆ సూరీడు తోటి మంతనాలు చెయ్యనా
మాటలాడి చందమామ మనసు మార్చనా
నా రోజుకున్న ఘంటలన్నీ మార్చనా
నీ… కోసం …

ఓహ్ విమానమంత పల్లకీని చూడనా
ఆ గ్రహాలు దాటి నీతో జర్నీ చేయనా
రోదసిని కాస్త రొమాంటిక్ గ మార్చనా
నీ… కోసం …

మెరుపు తీగల హారాలల్లీ
సెకను కొకటి కానుక చేయనా
వాన విల్లుని బొంగరమల్లే
మలిచి నీ కొన వేలుకి తొడిగేనా

దేవదారు శిల్పంలా
మెరిసి పోయే ప్రియురాలా
ఓ వసుమతి , ఓ ఓ వసుమతి
ప్రేమ కవితల షెల్లీ లా
మారిపోయా నీవల్ల
ఓ వసుమతి , ఓ ఓ వసుమతి

ఓలే ఓలే ఓలే వసుమతి
వయ్యారి వసుమతి
అయ్యయ్యో అడిగిలోపే ఇచ్చినవే అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగు తీసే
దరికి రావే శ్రీ మతి

ఓ ప్రశాంతమైన దీవి నేను వెతకన
అందులోన చిన్న పూల మొక్క నాటనా
దానికేమో నీ పేరు పెట్టి పెంచనా
ప్రేమతో…

నీ పెదాల ముద్ర బొమ్మ లాగ చేయనా
నా మెల్లోన దాన్ని లాకెట్ అల్లే వెయ్యనా
మాటి మాటికది ముద్దు ముచ్చటాడగా
గుండెతో…

ప్రతి ఒక జన్మలో ముందే పుట్టి
ప్రేమికుడిలా నీతో రానా
బ్రహ్మగారికి రిక్వెస్ట్ పెట్టి
మరొక లోకం మనకై అడిగేయనా

దేవదారు శిల్పంలా
మెరిసి పోయే ప్రియురాలా
ఓ వసుమతి , ఓ ఓ వసుమతి
ప్రేమ కవితల షెల్లీ లా
మారిపోయా నీవల్ల
ఓ వసుమతి , ఓ ఓ వసుమతి

ఓలే ఓలే ఓలే వసుమతి
వయ్యారి వసుమతి
అయ్యయ్యో అడిగిలోపే ఇచ్చినవే అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగు తీసే
దరికి రావే శ్రీ మతి

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

అరెరే ఇది కలల ఉన్నదే… లిరిక్స్

చిత్రం: భరత్ అనే నేను (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఆండ్రియా జెరేమియాహ్
నటీనటులు: మహేష్ బాబు, కైరా అద్వానీ
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాణం: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 20.04.2018

నన నన నా న నా న..

అరెరే ఇది కలల ఉన్నదే
హయ్యాయో కానీ జరిగిన నిజమిదే

నా కథలో అతను ఇదెలా నమ్మను
నా జతలో తనను నేనెలా చూడనో

అసలేమౌతుందో ఇంకా ఇంకా అర్థం అయ్యే లోపు
సుడి గాలై నన్ను చుట్టేసిందో
ఓ అందగాడి కను చూపు

అరెరే ఇది కలల ఉన్నదే
హయ్యాయో కానీ జరిగిన నిజమిదే

ఎవ్వరికుంటుంది అరె ఎందరికుంటుంది
హయ్యయయ్యో ఇంత అదృష్టం నాకే దొరికింది
ఎన్నడు అడగంది ఎదురుగ వచ్చింది
ఈ నిజము నేను రాజి పడగా సమయం పడుతుంది

జగమే వినగా గొంతు పెంచి చెప్పుకోవాలనుంది
కనులు కలలు మెరిసిపోయే గొప్ప వార్తే ఇది
జనమంతా నన్ను యువరాణిలా
చూసే రోజు ముందుంది

అరెరే ఇది కలల ఉన్నదే , కలల ఉన్నదే
హయ్యాయో కానీ జరిగిన నిజమిదే

అందరి వాడైనా , అందని వాడైనా
ఎవ్వరు చూడని ఏకాంతంలో నాతో ఉంటాడే
తనతో నేనేనా అనిపించే పనిలోనా
ఎప్పటికప్పుడు ఆశ్చర్యంలో ముంచేస్తుంటాడే

పరదా వీడని అతని మౌనం
ఏమి మాట్లాడకున్న
సరదా చిలికే అతని చూపు
ప్రేమకే సూచనా

మా మనసులు రెండు మాట్లాడనిదే
ఇంత కదా జరిగేనా

అరెరే ఇది కలల ఉన్నదే
హయ్యాయో కానీ జరిగిన నిజమిదే

నన నన నా న నా న..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

వచ్చాడయ్యో సామి… లిరిక్స్

చిత్రం: భరత్ అనే నేను (2018)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కైలాష్ ఖేర్, దివ్య కుమార్
నటీనటులు: మహేష్ బాబు, కైరా అద్వానీ
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాణం: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 20.04.2018

ముసలి తాత ముడత ముఖం
మురిసి పోయెనే
గుడిసె పాక గుడ్డి దీపం
మెరిసిపోయెనే
రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్లో గంట
రంగ రంగ సంబరంగా మోగెనే

వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి
ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ||2||

కత్తి సుత్తి పలుగు పారా తీయండి
మన కష్టం సుక్కలు
కుంకుమ బొట్టుగా పెట్టండి
అన్నం బెట్టే పనిముట్లే మన దేవుళ్ళు
మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి
మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి

అమ్మోరు కన్ను తెరిసిన నవ రాతిరి
ఇన్నాళ్ల సిమ్మ సీకటి తెల్లారే సమయం కుదిరి

వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి
ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

ఓ మట్టి గోడలు చెబుతాయి
సీమ మనుషుల కష్టాలు
ఏ దారి గతుకులు చెబుతాయి
పల్లె బతుకుల చిత్రాలు
పండగొస్తే ప్రతి ఒక్కరి మనసు
మరి పరుగయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా..
అస్సలైన పండుగ ఎప్పుడంటే
ఆ కన్నా తల్లి కంటి నీరు
తుడిచినా రోజేగా…

ఓ నాడు కల కల వెలిగిన రాయలోరి సీమిది
ఈనాడు వెలవెల బోతే
ప్రాణమంతా చిన్న బోతుంది

వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి
ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ

ఏ చేతి వృత్తులు నూరారు
చేవగలిగిన పని వారు
చెమట బొట్టు తడిలోనే
తళుక్కుమంటది ప్రతి ఊరు
ఎండ పొద్దుకు వెలిగిపోతారు
ఈ అందగాళ్ళు వాన జల్లుకు మెరిసిపోతారు
ఎవ్వడు కన్నా తక్కువ పుట్టారు వీళ్ళందిరి లాగే
బాగా బతికే హక్కులు ఉన్నోళ్లు

పల్లెటూళ్ళు పట్టుకొమ్మలని
ఒట్టి జోల పాట పాడక
తల్లడిల్లు తల రాతలకు
సాయమేదో చేయాలంటా

వచ్చాడయ్యో సామి
నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి
ఇచ్చాడయ్యో సామి
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

TAGGED: 2018, Bharat Anu Nenu, D.V.V. Danayya, Devi Sri Prasad, Kiara Advani, Koratala Siva, Mahesh Babu
Previous Article Brundhavanike Chindhulu Nerpe Song Lyrics
Next Article Tandra Paparayudu (1986)
9 Comments 9 Comments
  • ramesh says:
    09/05/2020 at 3:42 pm

    vachhadayyo samy song is missing

    Reply
    • A To Z Telugu Lyrics says:
      09/05/2020 at 4:46 pm

      we wiil update. 🙂

      Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Fan Page👍

You Might Also Like

Zari Zari Panche Katti Song Lyrics – Telugu Folk Songs Maanas, Vishnu Priya

Tags: Maanas Vishnu Priya

Oo Shivangi Song Lyrics – Thiru Telugu Movie #MassSong

Tags: Nithya Menen Anirudh Ravichander Dhanush Raashi Khanna

Coka 2.0 Song Lyrics – Liger Telugu Movie

Tags: Vijay Deverakonda Ananya Panday Ramya Krishna

Jinthaak Song Lyrics – Dhamaka, Mangli

Tags: Ravi Teja Bheems Ceciroleo Mangli Sreeleela Trinadha Rao Nakkina

A To Z Telugu Lyrics is a website which provides all telugu songs lyrics as like as movie songs, private album songs, devotional, folk songs lyrics etc,.

Copyright © A To Z Telugu Lyrics 2019-2022. All Rights Reserved.

  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • Contact Us

Removed from reading list

Undo
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
A To Z Telugu Lyrics A To Z Telugu Lyrics
Welcome Back!

Sign in to your account

Lost your password?