భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా… లిరిక్స్
సంగీతం: గజ్వెల్ వేణు
సాహిత్యం: శివ నాగులు
గానం: జై శ్రీనివాస్
విడుదల తేది: 25.01.2017
భరత భూమి పోరులో.. అమరుడైన సైనికుడా..
భరత మాత ముద్దు బిడ్డవు, జోహార్లు జవానుడా..
భరత భూమి పోరులో.. అమరుడైన సైనికుడా..
భరత మాత ముద్దు బిడ్డవు, జోహార్లు జవానుడా..
తూటాలు తగులంగా తల్లడిల్లే నీ దేహము
నెత్తుటి మడుగుల్లో నెలకొరిగే నీ ప్రాణము
భరత భూమి పోరులో.. అమరుడైన సైనికుడా..
భరత మాత ముద్దు బిడ్డవు, జోహార్లు జవానుడా..
పొత్తిల్లో ముద్దాడి మురిసిన అమ్మ
ఎగరేసి ఎద మీద వాల్చిన నాన్న
గోరింత రాగాల గారాల చెల్లి
గొర్రె పిల్ల ఎక్కి ఆడిన తమ్ముడు
అర్ధ రాత్రి పీడ కల తట్టి లేపింది
ఉలిక్కిపడ్డ గుండె ఊగూగి ఆగింది
ఆ.. అనుకోని ఆపద నాకెదురు వచ్చింది
కన్న కొడుకు కన్నీటి కథ చెప్పింది
భరత భూమి పోరులో.. అమరుడైన సైనికుడా..
భరత మాత ముద్దు బిడ్డవు, జోహార్లు జవానుడా..
భరత మాత ముద్దు బిడ్డవు, జోహార్లు జవానుడా..
నూతన బాసికమే బాసిపాయని
నీడ నిచ్చే చెట్టు నేల వాలెనని
మూడు ముళ్ళు మూడు నాళ్ళ ముచ్చటాయే..
అడుగులేసిన తోడు నెత్తుటి మడుగాయే..
సీకటింట్లో ఒక్కటయ్యిన మాటలు
ఎంగిలి బడ్డవి నా సీర సెంగులు
కడుపులో కణమైన నా సిన్ని తండ్రి
వీరుడై ఒరిగిండు నిను కన్న తండ్రీ..
భరత భూమి పోరులో.. అమరుడైన సైనికుడా..
భరత మాత ముద్దు బిడ్డవు, జోహార్లు జవానుడా..
భరత మాత ముద్దు బిడ్డవు, జోహార్లు జవానుడా..
పదకొండు నెల్లకు తిరిగొస్తానన్నావు
కడుపులో నా రూపు జాగ్రత్త అన్నావు
అమ్మ అయ్యా.. మీద అలగబోకన్నావు
బరువులెత్తకు పిల్ల భద్రమని అన్నావు
దేశ భద్రత నా బాధ్యతని అన్నావు
సరిహద్దు సేవంటే.. సాహసమే అన్నావు
భరత మాత నుదుటి తిలకమవుతున్నావు
భూమాత ఒడిలోన నిద్దరోతా ఉన్నావు…
భరత భూమి పోరులో.. అమరుడైన సైనికుడా..
భరత మాత ముద్దు బిడ్డవు, జోహార్లు జవానుడా..
భరత మాత ముద్దు బిడ్డవు, జోహార్లు జవానుడా..
నిను కాల్చేటి కట్టేమో.. కన్నీరు పెడుతుంది
మువన్నెలా జెండ మురిసిపోతుందయ్యా..
నీతోటి సైనికులంత జోహార్లు అన్నారు
గన్నుదీసి గుండ్లు గాలిలో పేల్చిండ్రు
సావాస నేస్తమ సెలవని అన్నారు
ఆఖరి సెల్యూట్ అందుకోమన్నారు
వీరుడా నీకింక చివరి వీడుకోలు
విజయభాస్కరమా వెన్నుతట్టి నడుపు
భరత భూమి పోరులో.. అమరుడైన సైనికుడా..
భరత మాత ముద్దు బిడ్డవు, జోహార్లు జవానుడా..
భరత మాత ముద్దు బిడ్డవు, జోహార్లు జవానుడా..
శత్రువుకు తలవంచని ధైర్యాన్ని
నీ బిడ్డకు ఉగ్గుపాలుగా పోస్తాను
నెత్తుటి మరకల నీ ఉత్తరాలలో..
అక్షరాల ఆనవాళ్లు జూపుతాను
సావంటే భయపడని కొడుకునే కంటాను
సావుతో కలపడే బలము నేర్పుతాను
నీ అడుగు జాడల్లో నడిపిస్తాన్నయ్య
నీ జ్ఞాపకాలతో బతికేస్తానయ్యా…
భరత భూమి పోరులో.. అమరుడైన సైనికుడా..
భరత మాత ముద్దు బిడ్డవు, జోహార్లు జవానుడా..
భరత మాత ముద్దు బిడ్డవు, జోహార్లు జవానుడా..
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****