చిత్రం: భార్గవ రాముడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, యస్.జానకి, పి. సుశీల, యస్.పి.శైలజ
నటీనటులు: బాలకృష్ణ , విజయశాంతి, మందాకిని
కథ: కొమ్మనపల్లి గణపతి రావు
మాటలు ( డైలాగ్స్ ): పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: యస్.జయరామారావు
సినిమాటోగ్రఫీ: నందమూరి మోహన కృష్ణ
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: జయ ప్రొడక్షన్స్
విడుదల తేది: 14.01.1987
1.ఆనందో బ్రహ్మ లిరిక్స్
ఆనందో బ్రహ్మ అనురాగం బ్రహ్మ
ఈ మన్మధ యజ్ఞంలో తరించనీ జన్మా
ఎందుకురా పైకిక యాతన తపోధన
అద్వైతం బ్రహ్మ అహమేవ బ్రహ్మ
నా జీవిత యజ్ఞంలో చేయను దుష్కర్మ
ఎందుకులే ఆ ముఖ బోధన మ్రోగేక్షణ
ఇంతలు కన్నులు పుంతలు చూడగనేల
చూడని వింతల లోకం వింతలనే చూడనీరా
ధారాణ జపమంత్రాలకిది వేళా
మార్గము చూపవె మా గృహ సీమకు ఓ మందయాన
అంగాంగాలను అలుముకొనే ఆనంద యజ్ఞపు అగ్ని ఇది
తనువులు దనములిచ్చుకొనే మనువులు కోరే మార్గామిది
ఆ శ్రీహరి ఓ నారి మరునారి మాంపాహి
వీడగదె ఈ సంసారిని విలాసిని
ఆనందో బ్రహ్మ అనురాగం బ్రహ్మ
ఈ మన్మధ యజ్ఞంలో తరించనీ జన్మా
ఎందుకులే ఆ ముఖ బోధన మ్రోగేక్షణ
మిన్నులనంటిన వెన్నెల పుట్టిన చోట
వలచి తనంతట వచ్చిన కాంతను వారించనేల
పుచ్చాలి క్షణ సౌఖ్యల పడనేల
వంచన చెల్లదు చంచల చిత్తుడనే కాను బాల
వైరాగ్యానికి నిచ్చెనలు పాండిత్యాలను మెచ్చితిలే
వారిజ నేత్రల కౌగిలికి వాహిజి భవులే మెచ్చిరిలే
చి పొగదే సుకుమారి సురనారి నీ దారి
చూపగదే ఇంటికి దారిని వరూధిని
ఆనందో బ్రహ్మ అనురాగం బ్రహ్మ
ఈ మన్మధ యజ్ఞంలో తరించనీ జన్మా
ఎందుకులే ఆ ముఖ బోధన మ్రోగేక్షణ
********** ********** ********** **********
2.మాఘమాసం యేలవచ్చే లిరిక్స్
దింతరికిట దింతరికిట దింతరికిటత
దింతరికిట దింతరికిట దింతరికిటత
మాఘమాసం యేలవచ్చే మన్మథ ఓ మన్మథ
మల్లెగాలి యేలవీచె మన్మథ ఓ మన్మథ
మామపక్క భామచేర మంచం యేలగోలచేసె తుమ్మెద ఓ తుమ్మెద
అదిచాటుమాటంట చెప్పేది కాదంట
తుమ్మెద ఓ తుమ్మెద మన్మథ ఓ మన్మథ
మాఘమాసం యేలవచ్చే మన్మథ ఓ మన్మథ
మల్లెగాలి యేలవీచె మన్మథ ఓ మన్మథ
తకథిమితోం తకథిమితోం తందాన తాన
తకథిమితోం తకథిమితోం తందాన తాన
పువ్వెట్టి కొటొద్దు ఓ మన్మథ పులకింత పుట్టుద్ది ఓ మన్మథ
ఆ బక్క నడుమట్ట తైతక్కమంటుంటే నా తిక్క రేగినాదిరో
నాకొంగు ముట్టొద్దు ఓ తుమ్మెద నా తేనే లాగొద్దు ఓ తుమ్మెద
తొలి ముద్దు పెడుతుంటే నా ముద్దబంతుల్లో గిలిగింత పుట్టినాదిరో
రెక్క విడిచిన పువ్వ రేగుతుందది గువ్వ
హైలో హైలెస్స పైలో పచ్చిస కసిగాలి వీస్తుంటే
కౌగిల్లే దిక్కంట తుమ్మెద ఓ తుమ్మెద మన్మథ ఓ మన్మథ
మాఘమాసం యేలవచ్చే మన్మథ ఓ మన్మథ
మల్లెగాలి యేలవీచె మన్మథ ఓ మన్మథ
హోయ్ తందాన హోయ్ తందాన
నన్నవొడిసి పట్టాక ఓ మన్మథ సిగ్గిసిపెట్టాను ఓ మన్మథ
నా లేత చెక్కిళ్లు నీ చేత పడుతుంటే ఆ చుక్క పొడిచినాదిరో
నీ సొగసు ముట్టాక ఓ తుమ్మెద నా వయసు పుట్టింది ఓ తుమ్మెద
నీ గుట్టు గుమ్మాలు నేదాటిపోయాక గుబులెంతో తెలిసినాదిరో
మబ్బు విడిచిన ఎండ మల్లె పూవుల దండ
హైలో హైలెస్స చెయరా కులాస
పొలిమేర దాటాక పొదరిల్లె దిక్కంట మన్మథ ఓ మన్మథ
తుమ్మెద ఓ తుమ్మెద
మాఘమాసం యేలవచ్చే మన్మథ ఓ మన్మథ
మల్లెగాలి యేలవీచె మన్మథ ఓ మన్మథ
మామపక్క భామచేర మంచం యేలగోలచేసె తుమ్మెద ఓ తుమ్మెద
అదిచాటుమాటంట చెప్పేది కాదంట
తుమ్మెద ఓ తుమ్మెద మన్మథ ఓ మన్మథ
********** ********** ********** **********
3.అల్లుకోరా అందగాడా లిరిక్స్
అల్లుకోరా అందగాడా
అల్లుడల్లే అందమంతా
ఈడుతో ఈలగా ఆడుకో లీలగా
జంట ఉయ్యాలగా….
అబ్బ అబ్బ అమ్మ అమ్మ
అబ్బ అబ్బ అమ్మ అమ్మ
అల్లరైతే ఎలాగమ్మా?
చల్లబడితే మంచిదమ్మా
కొత్తలో వింతగా కొంగు కౌవ్వింతగా
కమ్ముకో మెత్తగా
అబ్బ అబ్బ అమ్మ అమ్మ
అబ్బ అబ్బ అమ్మ అమ్మ
చం ఛమ చం చం నీటి మడుగుల్లో
చం ఛమ చం చం చాటు అడుగుల్లో
చం ఛమ చం చం ప్రేమ చినుకుల్లో
చం ఛమ చం చం తేనె వలపుల్లో
తడి తాళం వేశేసుకోరా….
చం ఛమ చం చం సోపు నురగల్లో
చం ఛమ చం చం సోకు వరదల్లో
చం ఛమ చం చం వేడి తరగల్లో
చం ఛమ చం చం ఈడు బుడగల్లో
చలిరాగమే పాడుకోవే….
తీసుకో జంటగా ఈదుకో కొంటెగా
జోడుగా జోరుగా…
అబ్బ అబ్బ అమ్మ అమ్మ
అబ్బ అబ్బ అమ్మ అమ్మ
అల్లరైతే ఎలాగమ్మా?
అల్లుకోరా అందగాడా
ల ల ల లా.. లా..
ల ల ల లా.. లా..
ల ల ల లాల
చం ఛమ చం చం కొత్త చొరవళ్లో
చం ఛమ చం చం కోటి గొడవల్లో
చం ఛమ చం చం తీపి చనువుల్లో
చం ఛమ చం చం జంట దరువుల్లో
పెన వేసుకుంటాను నిన్నే….
చం ఛమ చం చం చెంప ఎరుపుల్లో
చం ఛమ చం చం చెంగు విడుపుల్లో
అరె చం ఛమ చం చం చేతి ఒడుపుల్లో
చం ఛమ చం చం సిగ్గు పిలుపుల్లో
పదవిచ్చుకుంటాను నీకే….
రెచ్చిపో.. రేగిపో..
నచ్చితే ఓడిపో..
పక్కలో దిండులా..
అబ్బ అబ్బ అమ్మ అమ్మ
అబ్బ అబ్బ అమ్మ అమ్మ
అల్లుకోరా అందగాడా
అల్లరైతే ఎలాగమ్మా?
ఈడుతో ఈలగా ఆడుకో లీలగా
కమ్ముకో మెత్తగా….
అబ్బ అబ్బ అమ్మ అమ్మ
అబ్బ అబ్బ అమ్మ అమ్మ
********** ********** ********** **********
4.మన్మథనామ సంవత్సరం లిరిక్స్
మన్మథనామ సంవత్సరం
నా మదిలో పుట్టెను ప్రేమ జ్వరం
పిలిచే సన్నాయిలా.. వలపే అమ్మాయిలా..
నీ కొమ్మకే కోయిలై చేరనా..
మన్మథనామ సంవత్సరం
నా మనసే పాడెను నాగ స్వరం
విరిసే ఈ పువ్వులా.. మెరిసే నీ నవ్వులా..
నీ రెమ్మకే తుమ్మెదై చేరనా..
అందం చందం గంధాలుగా చల్లనా..
నాలో వయ్యారపు లేత ఉయ్యాలలను నీ కోసం ఊపనా..
మోహం తాళం నీ ముద్దుతో పెంచనా..
జారే నీ కొంగున యేరై ఉప్పొంగిన పరువాలలో తేలనా..
చెక్కిళి కవితలు రాశేయి
కౌగిలి తలుపులు తీసేయి
నా తీగలో పువ్వులే రాలగా..
మన్మథనామ సంవత్సరం
నా మదిలో పుట్టెను ప్రేమ జ్వరం
క్షేమం లాభం కౌగిల్లలో పొందనా..
నీ వేడి వొంపుల నీలోని సొంపుల కవ్వింపులో కాగనా..
దేహం ప్రాణం నీ పేర రాసివ్వనా..
నీవంటుకోనిది నీవంతుకానిది నే ఒంటికంటించనా..
చెప్పకు చప్పున చేసేయి
తప్పని మాటకు మనసియ్యి
నా.. గాలి నీ.. ఊపిరై ఆడగా..
మన్మథనామ సంవత్సరం
నా మదిలో పుట్టెను ప్రేమ జ్వరం
విరిసే ఈ పువ్వులా.. మెరిసే నీ నవ్వులా..
నీ కొమ్మకే కోయిలై ఉండనా..
********** ********** ********** **********
5.ఒయ్యారమా నీయెవ్వాారమేమి లిరిక్స్
అరె ఒయ్యారమా నీయెవ్వారమేమి దానంతు చూడాలి నేను
ఒయ్యారమా నీయెవ్వారమేమి దానంతు చూడాలి నేను
అందనీ అందము పొందనీ అనుభవం
చీరల పైట సిగ్గుల పైట చిలిపిగ లాగేసేయ్
శృంగారమా నీ సయ్యాటలేమి వాటేసి చూడాలి నేను
శృంగారమా నీ సయ్యాటలేమి వాటేసి చూడాలి నేను
అందుకో అందము అందులో గంధము
మల్లెలవేల తెల్లని చీర మదువులు లాగేసేయ్
ముందున్న ఆ ముంతమామిళ్ల తోట
రాసివ్వనా నీకు రసకేళిలో
యెనకున్న అలపాటి దిబ్బల్లతోపు
చేసేయెన సాగు చెలి పేరుతో
ఒప్పించు నన్ను మెప్పించు
ఉన్న వాటలెన్నో మళ్లీ మళ్లీ నాకూ చూపించూ
చాలవే ముడుపులు చూసుకో ఒడుపులు
రాతలు మారి చేతలకొస్తే రావే చినదాన
హేయ్ శృంగారమా నీ సయ్యాటలేమి వాటేసి చూడాలి నేను
అరెరె ఒయ్యారమా నీయెవ్వారమేమి దానంతు చూడాలి నేను
మొటిమంటుకుంటున్న లోహాల సోకు
తడిమేయన కోడె తాపాలతో
చిగురేసుకుంటున్న మొగిళాకుముళ్లు
కసితీర్చన కన్నె అందాలతో
కవ్వించు కాస్త నవ్వించు
లేత అంటింతల్లో హాయెంతుందో నాకూ చూపించూ
చాలదీ పిలుపులు సందెలో వలపులు
ఆటలు మాని అక్కరకొస్తే రార మొనగాడ
అరె ఒయ్యారమా నీయెవ్వారమేమి దానంతు చూడాలి నేను
అందుకో అందము అందులో గంధము
అరె చీరల పైట సిగ్గుల పైట చిలిపిగ లాగేసేయ్
శృంగారమా నీ సయ్యాటలేమి వాటేసి చూడాలి నేను
********** ********** ********** **********
6.కాలమే తాళమై లిరిక్స్
కాల చక్రమున సూర్యగమనమిది కరిగిపోని నాట్యం
ఆగిపోనిదిది ఆపలేనిదిది ఆరమైన నాట్యం
ఆ…. ఆ,,,,
కాలమే తాళమై శీలమే ప్రాణమై
భార్గవ రాముని ఆగమనానికి స్వాగతమిచ్చే నాట్యం
పాపపు భారం పెరిగినవేల పడతి పుడమి నాట్యం
ఉరుములా ఉరికి రా.. పిడుగులా కదలిరా..
ఉరుములా ఉరికి రా.. పిడుగులా కదలిరా..
వంచెన చేసిన అసురులనే ప్రసివంచెన చేసిన మోహిని విలాసం
శక్తి శూల ఆ సంఘమానికే నాంది పలికేనినాట్యం
పంచ భూతములు ప్రకపించిన ప్రకృతి మాపరాట్యం
చేసే నాట్యం తీసే రాగం అందుకో నీ ఆహ్వానమే
అందాలన్నీ నీముందుంచి అందిచమా ఓ క్షణం
ఉరుములా ఉరికి రా.. పిడుగులా కదలిరా..
రంభలు చూపని భంగిమలే ప్రతి అంగము లోపల రేపిన వినోదము
మందహాసముల మల్లెమాలికల నీడలో నాగ బంధం
జన్మజన్మలకు శాపకారణం ఆడదాని శ్రోకం
ఆపని నాట్యం అంతిమ గీతం వేచుంది పైకాలమే
ఒళ్లో రొంత ఉయ్యాలూపి చూపించమా స్వర్గమే
ఉరుములా ఉరికి రా.. పిడుగులా కదలిరా..
అ అ ఆ… అ అ ఆ…
స గ రి గ స గ రి గ స గ రి గ స గ రి గ
గ ప మ ప గ ప మ ప గ ప మ ప గ ప మ ప
ద ని స ద ని స ఆ.. ఆ..
Nonicet
Nonicet