Bhayya (2007)

Advertisements

చిత్రం: భయ్యా (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాహితి
గానం: రమేష్ వినయగం
నటీనటులు: విశాల్ కృష్ణ, ప్రియమణి
దర్శకత్వం: భూపతి పాండ్యన్
నిర్మాత: విక్రమ్ కృష్ణ
విడుదల తేది: 28.09.2007

చెలి నా యెదనే నే నిన్ను చూచుకోని క్షణం
అణువు అణువు పులకించే నువ్వు నన్ను చూచుమరుక్షణం
నీ కనుల్లో వెలిగే కర్పూరమల్లే ప్రియాని కరిగే
నిన్ను నడిపించే నా శృతిని నీవని తెలియనివా
ఎప్పుడు వికశించే నీ నవ్వులే అవి న పువ్వులుగా
సందెవేళవీచే నీ చల్లగాలిని నేనేగ
ప్రతి నిత్యం పలికే నీ మౌనగీతమై జతకానా

నీ నున్నని బుగ్గలపలకపై నా పెదవితో రాసే విధమెలా
నీ నుదుటను బొట్టే జాబిలై సిరివెన్నెల కాచెను పగలెలా
నీ పడుచుగుండెలో చొరబడిగిలిగా ఒక ఒడి వరిగేదెన్నడు
నీలేత నడుమునే తడిమి చూడన అలజడి కలిగే దెప్పుడు
నువ్వు ఆమే అనకవా నా కానుకవా రెండూ నీవై వెలిశానే
నిన్ను నడిపించే నా శృతిని నీవని తెలియనివా
ఎప్పుడు వికశించే నీ నవ్వులే అవి నా పువ్వులుగా
సందేళవీచే నీ చల్లగాలిని నేనేగా
ప్రతి నిత్యం పలికే నీ మౌనగీతమై జతకనా

నీ యెంగిలి ఉద్దేశం మతం అది ఏక్షణమైన సమ్మతం
నీ చిలిపి కౌగిలి సమ్మతం అది నను బలికొన్న సమ్మతం
నీ చెవుల పక్కగా ఎగిరేజుట్టును నిమరగ ఎంతో సమ్మతం
నీ చీరకడితే ఓ చినుకల్లే ఇలపైపడినా సమ్మతం
ఇక నా జీవితం నీ కల్పనం నువ్వేకదా నా ప్రాణం
నిన్ను నడిపించే నా శృతివి నీవని తెలియనివా
ఎప్పుడు వికశించే నీ నవ్వులే అవి నా పువ్వులుగా
సందేళవీచే నీ చల్లగాలిని నేనేగా
ప్రతి నిత్యం నీ మౌనగీతమై జతకానా

********   *********   **********

చిత్రం: భయ్యా (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాహితి
గానం: రాహుల్ నంబియర్

యో బేబి నువ్వు దివ్యామృతం బేబి నువ్వు పంచామృతం
బేబి నువ్వు పూలనందనం యో బేబి నువ్వు దీపావళి బేబి నువ్వు
అనార్కలి బేబి నువ్వు వెన్నెల జాబిలి
అమ్మమ్మో ఆ పాదం చిక్కితే కుమ్మే బంగారం
అబ్బబ్బో చెలి చెయ్యేపడితే నీరే సారాయే
అయ్యోయ్యో తనుతాకితే ఎటూకాదూ నాదేహం

ఈ చిలక పలికే పలుకే రామ చిలక నేర్చే కులుకు
తనకాలి ముద్దు కొరకే విలచేపలన్నీ ఉరుకు
అరె కంచిపట్టు చీరే అది కుచ్చీళ్ళనే కోరు
నాగమల్లి పువ్వే ఆమె బాసలకే తుళ్ళు
పిల్లే పతంగిలా పైటని ఎగరేయింగా
చచ్చినోళ్ళంతా మళ్ళా బతికి వచ్చారుగా
ప్రేమను పూజారిలా కలలు పూజలు చేయంగా
రెండునే ఉయ్యాల ఊగితల తిరిగింది

నా ఆలమంత వెలుగా తన కంటి తళుకు చాలు
నా ఆశలన్నీ తీర ఒహా కాలి మెరుగు చాలు
ఎహే తాళికట్టు వేళ నిను సిగ్గుపడితే చాలు
నే మత్తు పిల్ల నడగ నను నసగకుంటే చాలు
మిర్చి బజ్జీలా మనసంతా ఊరించేలా
పిచ్చినాకు పట్టించేసి రెచ్చగొట్టేరా
కంటికి కనపడని గాలెల్లో కలిసేరా
కలలో శ్రీదేవిలా కలలు చెప్పేరా

********   *********   **********

చిత్రం: భయ్యా (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నలకంటి
గానం: నవీన్

అయ్యాసామి శివుని కుమార నాచిన్న కోర్కె నెరవేర్చు
చక్కని చుక్కతో కావాలి పెళ్ళి నాకొక పిల్లను జతజేర్చు
పావడి పరిణిదొరికాక కావడీ తెస్తాము
నెమలికి బదులు నీకొక ప్లైటు బహుమతి ఇస్తాము
వల్లివి నువ్వు హరోంహరా ఏమిటి పట్టవు హరోంహరా
చెల్లిస్తావా హరోంహరా దక్షిణిస్తాం హరోంహరా

Advertisements

నాన్నగారి తిట్లు తిన్నాములేరా పరీక్షల్లో
సున్నా తెచ్చుకున్నావేరా చదువుచించేశాం చించీ చదివేశాం
బస్సులో వెల్తే టాక్టుల మోత బైకులో వెళ్తే గ్యాప్‌ల మోత
నడిచిన పిల్లవస్తే నడిచే పోతామురా
ఆడపిల్ల మనసే ముదురు దానికుండాదులేరా కుదురు
గాలం చేస్తారు బ్రదరూ పడితే నీపని అదురు
బూకంపం అయినా అణిగెను గురువా అమ్మాయి మనసు అణగదులే
వల్లిని నువ్వు హరోంహరా ఏమిటి పట్టవు హరోంహరా
చెల్లిస్తావా హరోంహరా దక్షిణిస్తాం హరోంహరా

కొత్తసినిమాకు ముందేవుంటాం ప్రెండ్స్‌కు ఎప్పుడు వెనకే వుంటాం
పోటీ వచ్చిందో మధ్యలో మేముంటాం
టీ కొట్టు ప్రక్కన మీటింగులు పెడతాం ఫిగరులుచ్వస్తే పువ్వులు పెడతాం
పిల్లేనవ్విందా పార్తీలు మేమిస్తాం
అరె బరిలోకి వచ్చే భయ్యా నువు పంతం వెయ్యరా మియ్యా
సయ్యంటేను సయ్యా హూసుకుపోరా అయ్యా
ఫిగర్స్ వల్లో పడ్డా కూడ బ్రదర్స్ తోటి వెగరేమి
వల్లిని నువ్వు హరోంహరా హరోంహరా ఏమిటి పట్టవు హరోంహరా
చెల్లిస్తావా హరోంహరా దక్షిణిస్తాం హరోంహరా

********   *********   **********

చిత్రం: భయ్యా (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నలకంటి
గానం: దీపు

దేవత నీవే నా దేవత నీవే
కనుపాపగ కాస్త నినునే రిబ్బనై
నా జత నీవే ఇక నా కత నీవే ఎడ బాయక ఉంటా తోడు నీడనై
నీలో నేను సగములే నీవే నాకు జగములే
నీతో యుగమే క్షణములే ఇది మన మనసుకు కలయిక

చినుకై వచ్చే నీకోసం పుడమై పోతాను
నదిలా వచ్చే నీకోసం కడవై పోతాను
కలలా వచ్చే నీకోసం కన్నై పోతాను
పులిలా నన్ను తాకా ఓ సింహానవుతాను
నీ ఊపిరితో ఋమెదురైనా వేణువుకాగా
నీ చూపులతో ఈ వేసవిలో వెన్నెలరాగా
సూర్యుని చుట్టూ భూమిలా నీ చుట్టూనే తిరగనా
నీవేనేనై బతకనా తలపుల తలపులు తెరిచినా

జోరున కురిసే వానలు ఎండే నువ్వంట
దిక్కులు చెరిగే ఎండలు వానే నువ్వంట
ఏకాంతాన్ని వెలివేసేతోడే నువ్వంట
శోకాలన్నీ తరిమేసే జాడే నువ్వంట
నీ నవ్వుల్లో పూచేటి పువ్వైపోనా
నీ నడకల్లో మోగేటి మువ్వైపోనా
గుడిలో వెలసిన రూపము గుండెన వెలిగే దీపము
పంచే తీయని పాపము వలపుల పిలుపులు తెలిపెను

********   *********   **********

చిత్రం: భయ్యా (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: మురళీధర్, విజయలక్ష్మి

హే వస్తావస్తానమ్మా తోడుగా నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
అరే వస్తా వస్తానమ్మా వేడిగా నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
ఈరే అక్కుం బక్కుం జాజిమల్లే అల్లుకుందామ్రా పిల్లా
హే వస్తావస్తానమ్మా తోడుగా నా పాటే పాడా మళ్ళీ ఫోజుగా
గడ గడ గడ వేశస్తా వయ్యారం గడియ
గుమ గుమ గుమ కమాన్ బేబి పోదాం తనయ

ఆ మేఘం వచ్చింది ఆకాశం మూసింది అదురు తెలిపినది
అత్తర్లు పూచాను అందాలు దాచాను ఎగిచే ఎద అలలో
పడుచు మనసుకు వెండి తెర వేస్తావా
తళుకు వలపుల తొలి కస నీవమ్మా
మారని ఇదీ ఇదీ కోరికలే వరింది తీరుబడి కలిసాం మరి తెలుసుకో

నా ప్రేమ గుప్పెట్లో నీగుండె చప్పుల్ని నా ఈడు పోటుందిరా
ప్రేమించే కళ్ళుంటే ఆడెండి ఈడేండి వాడిక వాటాలకూ
ఎగిసే వలపులు అల్లరికే బెదరవు రవ్వంత మెరుపుకు నా మనసు బెదరదు
మనస మనస మనసకి నీ నస తెలియని వరసె పాయసమే మనసై మతి చితికెనె

Advertisements

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Sri Venkateswara Mahatyam (1960)
error: Content is protected !!