చిత్రం: భోగిమంటలు (1981)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, సి. నారాయణ రెడ్డి, కొసరాజు, అప్పలా చార్యా
గానం: యస్.పి.బాలు,
నటీనటులు: కృష్ణ , రతి, అంజలీ దేవి
కథ:
మాటలు:
దర్శకత్వం: విజయనిర్మల
నిర్మాతలు: త్రిపురనేని మహారథి , టి.యస్.కిషోర్
ఫోటోగ్రఫీ: పుష్పాల గోపికృష్ణ
ఎడిటర్: ఆదుర్తి హరినాథ్
బ్యానర్: రోహిణి ఆర్ట్స్
విడుదల తేది: 29.04.1981
పల్లవి:
లేత వయసు పూతకొచ్చిందే మరదలా
చేతికందితే చెంగుమంటావే
మరదలా చేతికందితే చెంగుమంటావే
కోడి వయసు కమ్ముకొచ్చిందోయ్ బావయ్యో
కాడిగట్టితే కంగుతింటావోయ్
బావయ్యో కాడిగట్టితే కంగుతింటావోయ్
చరణం: 1
ఎందుకంత ముమ్మరం అందాల బొంగరం
తాడు చుట్టి తిప్పానంటే తీరుతుంది సంబరం
ఎందుకంత ముమ్మరం అందాల బొంగరం
తాడు చుట్టి తిప్పానంటే తీరుతుంది సంబరం
తిప్పినకొద్ది చప్పున తిరిగే డిప్పకాయననుకున్నవా
తిప్పినకొద్ది చప్పున తిరిగే డిప్పకాయననుకున్నవా
తిప్పలేక బదులు చెప్పలేక నువ్వు
తిప్పలు పడతావు బావా తిప్పలు పడతావు బావా
లేత వయసు పూతకొచ్చిందే మరదలా
చేతికందితే చెంగుమంటావే
మరదలా చేతికందితే చెంగుమంటావే
కోడి వయసు కమ్ముకొచ్చిందోయ్ బావయ్యో
కాడిగట్టితే కంగుతింటావోయ్
బావయ్యో కాడిగట్టితే కంగుతింటావోయ్
చరణం: 2
చురుకైన సూరీడా కరుకైన కుర్రోడా
చల్లబడిపోతావులే కమ్మితే నా నీడ
చురుకైన సూరీడా కరుకైన కుర్రోడా
చల్లబడిపోతావులే కమ్మితే నా నీడ
ఎప్పటికప్పుడు గుప్పున మండే ఎర్రని ఎండలుకాస్తా
ఎప్పటికప్పుడు గుప్పున మండే ఎర్రని ఎండలుకాస్తా
నీ లాంటి పిల్లకు నాజూకు మల్లెకు
లేలేత వెన్నెలనౌతా లేలేత వెన్నెలనౌతా
కోడి వయసు కమ్ముకొచ్చిందోయ్ బావయ్యో
కాడిగట్టితే కంగుతింటావోయ్
బావయ్యో కాడిగట్టితే కంగుతింటావోయ్
ఓయ్ లేత వయసు పూతకొచ్చిందే మరదలా
చేతికందితే చెంగుమంటావే
మరదలా చేతికందితే చెంగుమంటావే