Bichagadu (2016)

Bichagadu Telugu 2016 500x500 1

చిత్రం: బిచ్చగాడు (2016)
సంగీతం: విజయ్ ఆంటోనీ
సాహిత్యం: భాషశ్రీ
గానం: జానకి అయ్యర్
నటీనటులు: విజయ్ ఆంటోనీ, సాంతా టైటస్
దర్శకత్వం: శశి
నిర్మాతలు: ఫాతిమా, విజయ్ ఆంటోనీ
విడుదల తేది: 2016

నీకోసం వస్తా
నా ప్రాణం ఇస్తా
నువ్వొకసారి చూస్తే చాలు
ఏమడిగినా చేస్తా
జ్ఞాపకమల్లె నిను దాచుటకు
నీడలాగ నడిచేస్తా
నువు ఎవరైన కానీ
ఇక నాకు సొంతమే
నువు నను వీడిన క్షణమే
నా ఊపిరి ఆగులే

నీకోసం వస్తా
నా ప్రాణం ఇస్తా

ఏవేరేమీ అన్నాను
నన్నే చంపే వెసిసను
నీలోనే సగమై బ్రతికే ఉంటా
నేనెక్కడున్నాను
నీ పక్కనున్నాను
నీ పేరే వినిపిస్తే
తిరిగిచూస్తా
నా ప్రాణం ఇస్తున్నా
నీకు ప్రేమ అని
ఇక మరణం ఎదురైన
నేను చావలేనులే

నీకోసం వస్తా
నా ప్రాణం ఇస్తా
నువ్వొకసారి చూస్తే చాలు
ఏమడిగినా చేస్తా
జ్ఞాపకమల్లె నిను దాచుటకు
నీడలాగ నడిచేస్తా
నువు ఎవరైన కానీ
ఇక నాకు సొంతమే
నువు నను వీడిన క్షణమే
నా ఊపిరి ఆగులే

********  *******   *******

చిత్రం: బిచ్చగాడు (2016)
సంగీతం: విజయ్ ఆంటోనీ
సాహిత్యం: భాష
గానం: విజయ్ ఆంటోనీ

వంద దేవుళ్ళే కలిసొచ్చినా
అమ్మ నీలాగ చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించినా
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా
నా రక్తమే ఎంతిచ్చినా
నీ త్యాగాలనే మించునా
నీ రుణమే తీర్చాలంటే
ఒక జన్మయిన సరిపోదమ్మా
నడిచేటి కోవెల నీవేలే…

వంద దేవుళ్ళే కలిసొచ్చినా
అమ్మ నీలాగ చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించినా
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా

పగలైన రాత్రయినా జాగారాలు
పిల్లల సుఖమే మెడ హారాలు
పగలైన రాత్రయినా జాగారాలు
పిల్లల సుఖమే మెడ హారాలు
దీపముల కాలి వెలుగే పంచేను
పసి నవ్వులే చూసి బాధే మరిచేను
నడిచేటి కోవెల అమ్మేలే

వంద దేవుళ్ళే కలిసొచ్చినా
అమ్మా నీలాగ చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించినా
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా
నా రక్తమే ఎంతిచ్చినా
నీ త్యాగాలనే మించునా
నీ రుణమే తీర్చాలంటే
ఒక జన్మయిన సరిపోదమ్మా
నడిచేటి కోవెల నీవేలే

Leave a comment

You cannot copy content of this page