చిత్రం: బ్లఫ్ మాస్టర్ (2018)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: విశ్వనాథ్ కారసాల
గానం: సునీత
నటీనటులు: సత్యదేవ్ కంచరాన, నందిత శ్వేత
దర్శకత్వం: గోపి గణేష్ పట్టాభి
నిర్మాత: రమేష్ పి.పిళ్ళై
విడుదల తేది: 28.12.2018
ఏ మాయో ఏమో తెలియదే
తెలిసేదెలా మనసుకే
అడిగా తొలిగా నన్నే ఎవరనీ
రోజూ చూడని తీరే నీదని
ఏమైనదో తెలియదే
తెలిసేదెలా మనసుకే
మనసా నా మనసా..
నా మనసే.. ఓ.. ఓఓఓ..
తెలియని భావాలన్నీ
తోడై నన్నే చేరీ
నాతో చేస్తున్న సావాసమా
అర్ధాలెన్నో చూపే వేల భాషల్లోని
ప్రేమ గీతాల ఆలాపనా..
కురిసే వరమై ఎదనే తడిమెనుగా
కలిసే వరసై మనసే మురిసెనుగా
అయ్యయ్యయ్యో నీలా ఎలా
ప్రేమే నాలో చేరిందెలా..
ఏ మాయో ఏమో తెలియదే
తెలిసేదెలా మనసుకే
కొత్తగ నాకే నేను
పరిచయమౌతున్నాను
నాలో ఈ మాయ నీదే సుమా
చిన్ని మోమాటాలే
చెప్పే మౌనంగానే
ప్రేమ బాగుంది నీ భావనా
పలికే పెదవే సడినే మరిచెనుగా
ఐనా మరిలా నీ పేరే పలికెనుగా
అయ్యయ్యయ్యో నీలా ఇలా
ప్రేమే నాలో చేరిందెలా
ఏ మాయో ఏమో తెలియదే
తెలిసేదెలా మనసుకే
అడిగా తొలిగా నన్నే ఎవరనీ
రోజూ చూడని తీరే నీదని
ఏమైనదో తెలియదే
తెలిసేదెలా మనసుకే
మనసా నా మనసా..
నా మనసే.. ఓ.. ఓఓఓ..