Bobbili Puli (1982)

చిత్రం: బొబ్బిలి పులి (1982)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం:  దాసరి నారాయణ రావు
గానం: యస్.పి.బాలు
నటీనటులు: యన్.టి.ఆర్, శ్రీదేవి, జయచిత్ర
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: వడ్డే రమేష్
విడుదల తేది: 09.07.1982

జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ
స్వర్గాదపీ గరీయసీ
ఏ తల్లి నిను కన్నదో?
ఏ తల్లి నిను కన్నదో?
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా
జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ
స్వర్గాదపీ గరీయసీ

చరణం: 1
నీ తల్లి మోసేది నవమాసాలేరా
ఈ తల్లి మోయాలి కడవరకు రా
కట్టే కాలే వరకు రా
ఆ ఋణం తలకొరివి తో తీరేను రా
ఈ ఋణం ఏ రూపాన తీరేది రా
ఆ రూపమే ఈ జవాను రా
త్యాగానికి మరో రూపు నువ్వు రా
జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ
స్వర్గాదపీ గరీయసీ

చరణం: 2
గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో
ఆ గుండెకే తెలుసూ గుండె కోత బాదెంతో
నీ గుండె రాయి కావాలి…
ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషీ
మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషుల కోసం… ఈ…మనుషుల కోసం…
నీ మనుషుల కోసం

జననీ జన్మ భుమిశ్చ స్వర్గాదపీ గరీయసీ
స్వర్గాదపీ గరీయసీ