Bobbili Raja (1990)

చిత్రం: బొబ్బిలి రాజా (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: యస్.పి.బాలు , చిత్ర
నటీనటులు: వెంకటేష్ , దివ్య భారతి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: డి.సురేష్ బాబు
విడుదల తేది: 14.09.1990

బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
పంతం పట్టీ ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా
అం, అః అంటా అమ్మడూ హొయ్యరే హొయ్యరే హొయ్
కం అః ఉండేటప్పుడూ…
బుజ్జి పాపాయీ పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో!!
సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యొ
అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో??
అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడూ??

చరణం: 1
ఎట్టాగుందే పాప తొలి చూపే చుట్టుకుంటే?
ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే!!
ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది.
మొత్తంగా ప్రపంచం మహ గమ్మత్తుగా ఉంది!!
ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా…
నాక్కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైనా??
కాస్తైనా… కంగారు తగ్గాలి, కాదనను ఏం చేసినా

సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యొ
అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో?
అం, అః అంటా అమ్మడూ… హొయ్యరే హొయ్యరే హొయ్
కం అః ఉండేటప్పుడూ… అరె రె ఓహోహోహో!!

చరణం: 2

తుప్పల్లో తుపాకీ సడి ఎట్టారేగుతుందో
రెప్పల్లో రహస్యం పడి అట్టా అయ్యిందయ్యో
కొమ్మల్లో కుకూలే మన స్నేహం కోరుతుంటే
కొండల్లోయ కోలే మనమెట్టా వున్నామంటే
అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా
ఎవరెవరో అత్తామామ వరసెట్టా తెలిసేనే
అందాకా… అమర్రి నీఅత్తమ్మ ఈ మద్ది మమనుకో
బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
పంతం పట్టీ ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా
అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడూ??
పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జోవయ్యో

బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో??
అం, అః అంటా అమ్మడూ… హొయ్యరే హొయ్యరే హొయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడూ??
తాన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా
తనన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా
తందన తందానన్నానా అరె హొయ్యారె హొయ్యారె హోయ్
తందన తందానన్నానా ఓహో ఓహో ఓహో హోయ్

**********   *********  **********

చిత్రం: బొబ్బిలి రాజా (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: యస్.పి.బాలు , ఎస్.జానకి

కన్యాకుమారీ కనపడదా దారి
కయ్యాలమారి పడతావే జారి
పాతాళం కనిపెట్టేలా  ఆకాశం పనిపట్టేలా
ఊగకే మరి మతి లేని సుందరి

జింగి చక్  జింగి చక్  చా
చక్ జింగి చక్  జింగి చక్  చా

గోపాలబాలా ఆపర ఈ గోల
ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాలా
మైకంలో మయ సభ చూడు మహరాజా రాణా తోడు
సాగనీ మరి సరదాల గారడి

జింగి చక్  జింగి చక్  చా
చక్ జింగి చక్  జింగి చక్  చా

కొండలు గుట్టలు చిందులాడే తధికినతోం
వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం
తూనీగ రెక్కలెక్కుదాం సూరీడి పక్క నక్కుదాం
ఊదేటి కొమ్ము వెతుకుదాం బంగారు జింకనడుగుదాం
చూడమ్మో… హంగామా…
అడివంతా రంగేద్దాము సాగించే వెరైటీ ప్రోగ్రాం
కళ్ళ విందుగా పైత్యాల పండగ

జింగి చక్  జింగి చక్  చా
చక్ జింగి చక్  జింగి చక్  చా

ఆ.. కన్యాకుమారీ కనపడదా దారి
కయ్యాలమారి పడతావే జారి
మైకంలో మయ సభ చూడు మహరాజా రాణా తోడు
సాగనీ మరి సరదాల గారడి

జింగి చక్  జింగి చక్  చా
చక్ జింగి చక్  జింగి చక్  చా

డేగతో ఈగలే ఫైటు చేసే చెడుగుడులో
చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలో
నేలమ్మా తప్ప తాగెనో ఏ మూల తప్పిపోయనో
మేఘాల కొంగు పట్టుకో తూలేటి నడకనాపుకో
ఓయమ్మో… మాయమ్మో…
దిక్కుల్నే ఆటాడించే కిక్కుల్లో గందరగోళం
ఒళ్ళు ఊగగా ఎక్కిళ్ళు రేగగా

ఏయ్…గోపాలబాలా ఆపరా ఈ గోల
ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాలా
ఆ పాతాళం కనిపెట్టేలా  ఆకాశం పనిపట్టేలా
ఊగకే మరి మతి లేని సుందరీ

జింగి చక్  జింగి చక్  చా
చక్ జింగి చక్  జింగి చక్  చా

ఆ.. సాగనీ మరి సరదాల గారడి

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Devudu (1997)
error: Content is protected !!