Bobby (2002)

చిత్రం: బాబీ (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: యస్. పి. బాలు, సునీత
నటీనటులు: మహేష్ బాబు, ఆర్తి అగర్వాల్
దర్శకత్వం: శోభన్
నిర్మాత: కె.కృష్ణ మోహన్ రావు
విడుదల తేది: 01.11.2002

వా… వారెవ్వా వవ్వా రెవ్వా (6)

కళ్ళల్లో ద్రాక్షరసం వళ్ళంతా చెరుకు రసం
పరువం దానిమ్మరసం చిట్టి పెదవి తేనే రసం రా
వా… వా… దీన్ని పట్టబోతే పాదరసం రా…
చూపు సప్పోట రసం వయసే బత్తాయి రసం
నవ్వే నారింజ రసం నీటుగాడు నిమ్మరసం రా
వా… వా… వీడి కొంటెతనం శొంఠి రసం రా…

వా… వారెవ్వా వవ్వా రెవ్వా (2)

చరణం: 1
ఆ పక్క మాయక్క ఎన్నెల్లో గుమ్మాడి
ఈ పక్క మాసెల్లి ఎన్నెల్లో గుమ్మాడి
నడిమద్యనా నేను ఎన్నెల్లో గుమ్మాడి
నిదరోతామాగదిలో ఎన్నెల్లో గుమ్మాడి
చిమ్మ చీకటిలోన క్కూ క్కూ క్కూ
తిన్నగ నాకాడికొచ్చి క్కూ క్కూ క్కూ
బుగ్గ నిమరగలవా నువ్వు వా వా
ముద్దులెట్టగలవా నువ్వు
తలుపు కిర్రుమనకుండా గురివిందా గుమ్మాడి
తైలాలు పోసిపెట్టు గురివిందా గుమ్మాడి
గొళ్ళాలు ఎయ్యకుండా గురివిందా గుమ్మాడి
దగ్గరగ ఏసిపెట్టు గురివిందా గుమ్మాడి
కాళ్ళకింద ఎత్తుపీట క్కూ క్కూ క్కూ
పెట్టుకొని నిద్దరోతే క్కూ క్కూ క్కూ
గుర్తుపట్టి ముద్దులు పెడతా వా వా
గుట్టంత దోచుకు పోతా

వా… వారెవ్వా వవ్వా రెవ్వా (3)

చరణం: 2
మీ అమ్మ మీ నాన్న గురివిందా గుమ్మాడి
ఎదురూగ ఉన్నా గానీ గురివిందా గుమ్మాడి
ఊరి జనం అంత గూడి గురివిందా గుమ్మాడి
చూత్తానే ఉన్నగాని గురివిందా గుమ్మాడి
అటూ ఇటూ చూడకుండ క్కూ క్కూ క్కూ
తిన్నగ నాకాడికొచ్చి క్కూ క్కూ క్కూ
వదిలి పెట్టకుండా నన్ను… వా వా
వడిసి పట్టగలవా నువ్వు…
ఊరి చెరువులోన నువ్వు ఎన్నెల్లో గుమ్మాడి
కలువ పూలు కోత్తావుండు ఎన్నెల్లో గుమ్మాడి
మంచినీళ్ళ కోసం వచ్చి ఎన్నెల్లో గుమ్మాడి
కాలుజారి కేకలెడతా ఎన్నెల్లో గుమ్మాడి
కాపాడేటట్టు నువ్వు క్కూ క్కూ క్కూ
నా నడుము పట్టుకుంటే క్కూ క్కూ క్కూ
అందరు సూత్తుండగా నేను… వా వా
వంటికదుము కుంటా నిన్నూ…

చరణం: 3
సూపు సూపు కలవాలని గురివిందా గుమ్మాడి
తిరణాళ్ళు వత్తాయంట ఎన్నెల్లో గుమ్మాడి
ఇద్దరొక్కటవ్వాలని గురివిందా గుమ్మాడి
ఎదిగేనంట కంది సేను ఎన్నెల్లో గుమ్మాడి
వత్తుకో కూడదని క్కూ క్కూ క్కూ
ఇసక మెత్తగుంటదంట క్కూ క్కూ క్కూ
వయసుకొస్తే ఆడ పిల్ల క్కూ క్కూ క్కూ
ఉరుకుతాది గోదారల్లె క్కూ క్కూ క్కూ
ఇచ్చి పుచ్చు కోవాలని క్కూ క్కూ క్కూ
కుర్ర జంట కోరుకుంటే క్కూ క్కూ క్కూ
తాటిచెట్టు సాటు చాలు… వా వా
తానినాన నన్నా నా అ… అ…
చూపు సప్పోట రసం వయసే బత్తాయి రసం
నవ్వే నారింజ రసం నీటుగాడు నిమ్మరసం రా
వా… వా… వీడి కొంటెతనం శొంఠి రసం రా…
కళ్ళల్లో ద్రాక్షరసం వళ్ళంతా చెరుకు రసం
పరువం దానిమ్మరసం చిట్టి పెదవి తేనే రసం రా
వా… వా… దీన్ని పట్టబోతే పాదరసం రా…

*********     *********    *********

చిత్రం: బాబీ (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శక్తి
గానం: శంకర్ మహదేవన్

పల్లవి:
ఈ జెండా పసిబోసి చిరునవ్వురా
దాస్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండా అమరుల తుది శ్వాసరా
రక్త తిలకాలు దిద్దిందిరా
వీర స్వాతంత్య్ర పోరాట తొలిపిలుపురా
మన వెలలేని త్యాగాల ఘనచరితరా
తనచనుబాలతో పోరు నేర్పిందిరా
ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి తరం

ఈ జెండా పసిబోసి చిరునవ్వురా
దాస్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండా అమరుల తుది శ్వాసరా
రక్త తిలకాలు దిద్దిందిరా

చరణం: 1
శాస్ర్తానికి ధ్యానానికి ఆదిగురువురా మనదేశం
మానవాళికే వైతాళిక గీతంరా భారతం
ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మనదేశం
ఎన్నో మతాల సహజీవన సూత్రంరా భారతం
ఆ దైవం మనకోసం సృష్టించే ఈ స్వర్గం
ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా
తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా
మనమేమిస్తే తీరేను ఆ రుణమురా
ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా
భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది చాలురా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

ఈ జెండా పసిబోసి చిరునవ్వురా
దాస్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండా అమరుల తుది శ్వాసరా
రక్త తిలకాలు దిద్దిందిరా

చరణం: 2
పిచ్చికుక్కలా ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసినా
వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా
మంచు మల్లెల శాంతి కపోతం నెత్తుటి తడిలో తడిసినా
చెక్కు చెదరని ఐకమత్య మొక్కటే సవాలురా
మానవుడే మా వేదం మానవతే సందేశం
మా శతకోటి హృదయాలదొక మాటరా
ఉక్కు పిడికిలితో అణిచేను నీ బలుపురా
చావు ఎదురైనా భయపడదు మా గుండెరా
శత్రువెవడైనా తలవంచదీ జెండరా
ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

ఈ జెండా పసిబోసి చిరునవ్వురా
దాస్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండా అమరుల తుది శ్వాసరా
రక్త తిలకాలు దిద్దిందిరా
వీర స్వాతంత్య్ర పోరాట తొలిపిలుపురా
మన వెలలేని త్యాగాల ఘనచరితరా
తన చనుబాలతో పోరు నేర్పిందిరా
ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి తరం

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Alluri Seetarama Raju (1974)
error: Content is protected !!