Bombay Priyudu (1996)

చిత్రం: బొంబాయి ప్రియుడు (1996)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ప్రతిమా రావ్
నటీనటులు: జె.డి.చక్రవర్తి, రంభ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.కృష్ణమోహన్ రావు
విడుదల తేది: 27.09.1996

చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని
ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవ నను వీడని జత నీవని
చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని
ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవ నను వీడని జత నీవని
ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చిన
తలరాతకు తలవంచదు ప్రేమా ఆ… ఆ…
చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని

చరణం: 1
నీవు నేనులే మనస్సు ఒక్కటే
ఇద్దరైన ఈ మమకారంలో
నీవు నేననే పదాలు లేవులే
ఏకమైన ఈ ప్రియమంత్రంలో
నా గుండెలో కోకిలా నీ గొంతులో పాడగా
నా జన్మ ఓ పూవులా నీ కొమ్మలో పూయగా
కలా ఇలా కౌగిలై కనే కలే వెన్నెలై
చెయ్ కలిపిన చెలిమే అనురాగం ఆ… ఆ…
చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని
ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవ నను వీడని జత నీవని

చరణం: 2
నిన్ను తాకితే దేవతార్చన
పూజలందుకో పులకింతల్లో
వాలు చూపులే వరాల దీవెన
నన్ను దాచుకో కనుపాపల్లో
నా ప్రేమ గీతానికీ నీవేలే తోలి అక్షరం
నా ప్రేమ పుట్టింటికీ నీవేలే దీపాంకురం
రసానికో రాగమై రచించని కావ్యమై
చెయ్ కలిపిన చలవే అనుబంధం ఆ… ఆ…
చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని
ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవ నను వీడని జత నీవని

*********  *********  ********

చిత్రం: బొంబాయి ప్రియుడు
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి, చిత్ర

ఆ ఆ ఆ ఆ…. ఆ ఆ ఆ ఆ….
ఆ ఆ ఆ ఆ  ఆ ఆ ఆ ఆ
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
మోయలేని భావమా రాయలేని కావ్యమా నండూరి వారి గేయమా
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
మోయలేని భావమా రాయలేని కావ్యమా నండూరి వారి గేయమా
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా

చరణం: 1
ఔననకా కాదనకా మనసే వినకా మురిపిస్తావేల ప్రాయమా న న నా
రేయనకా పగలనకా తపనల వెనకా తరిమిస్తావేల న్యాయమా లా ల లా
నిన్న లేని చోద్యమా నిన్ను ఆప సాధ్యామా
నిన్న లేని చోద్యమా నిన్ను ఆప సాధ్యామా
ఆ ఆ ఆ ఆ…. ఆ ఆ ఆ ఆ….
ఆ ఆ ఆ ఆ  ఆ ఆ ఆ ఆ
గుండె చాటు గానమా గొంతు దాటు మౌనమా ఎదలోని ఇంద్రజాలమా
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
టింక్టటటన్ టింక్టటటర టింక్టటటర టంటటన్
టింక్టటటన్ టింక్టటటర టిరంటరంటర టరరన్

చరణం: 2
పూలనకా ముళ్ళనకా వలచిన క్షణమే విహరిస్తావేల హృదయమా
రేపనకా మాపనకా ఆ మరు క్షణమే విసిగిస్తావేల విరహమా లవ్లీ
ఇంత వింత సత్యమా ఎంతకైనా సిద్దమా
అంతులేని ఆత్రమా అందులోనే అందమా
ఆ ఆ ఆ ఆ…. ఆ ఆ ఆ ఆ….
ఆ ఆ ఆ ఆ  ఆ ఆ ఆ ఆ
కోటి కలల నేత్రమా కొంటె వలపు గోత్రమా శృంగార సుప్రభాతమా
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
మోయలేని భావమా రాయలేని కావ్యమా నండూరి వారి గేయమా
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా

*********  *********  ********

చిత్రం: బొంబాయి ప్రియుడు
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర

అహో ప్రియా…
క్యా బాత్ బోల చిడియా మేరా దిల్ పిత్తర్ పిత్తర్ హోగయా
అయ్యయ్యో మిమ్మల్ని కాదండీ
నేను నేనేదో సరదాగ రాసుకున్న పాట
ప్రాక్టీస్ చేసుకుంటున్నా నంతే అంతే అంతేనండి
అహో ప్రియా… ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా
అహొ  అహొ అహో ప్రియా
అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా
కౌగిళించవా ప్రియా అనే జవాబు తానివ్వదా
అహొ  అహొ అహో ప్రియా

చరణం: 1
రాగమంటు ఏమిటుంది అనురాగమను పాటకీ
తాళమంటు ఏమిటుంది పెనవేసుకొను ఆటకీ
మూగసైగ కన్న మంచి పలుకు ఏముందీ
ముద్దు కన్న పెద్దదైన  కవిత ఏముందీ
జంటకోరే గుండెలన్నీ ఒక్కటే భాషలో దగ్గరౌతున్నవీ
కౌగిళించవా ప్రియా ప్రియా అనేటి భావం అదీ
అహొ  అహొ అహో ప్రియా
ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా
అహొ  అహొ అహో ప్రియా
అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా

చరణం: 2
తీయనైన స్నేహముందీ విరిసేటి పూలతీగలో
తీరిపోని దాహముంది తిరిగేటీ తేనే టీగలో
పూల బాల పరిమళాల కబురు పంపిందీ
తేనే టీగ చిలిపి పాట బదులు పలికింది
ఎన్ని సార్లో విన్నదైనా ఎందుకు ఎప్పుడూ కొత్తగా వుంటది
కౌగిళించవా ప్రియా ప్రియా అనేటి ఆ సంగతీ
అహొ  అహొ అహో ప్రియా
ఇంతకన్న తియ్యనైన పిలుపు వేరె వుందా
అహొ  అహొ అహో ప్రియా
అంత మంచి పిలుపు విన్న మనసు ఆగుతుందా
కౌగిళించవా ప్రియా అనే జవాబు తానివ్వదా
అహొ  అహొ అహో ప్రియా

*********  *********  ********

చిత్రం: బొంబాయి ప్రియుడు
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర

గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం
అదిరిపడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధరకాగితం నీ మధుర సంతకం
అధరకాగితం.. మధుర సంతకం..
గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం
అదిరిపడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధరకాగితం నీ మధుర సంతకం
అధరకాగితం.. మధుర సంతకం..

కిలకిలా కులికితే ఒంటి పేరే సుందరం కంటి ముందే నందనం
చిలకలా పలికితే ఉండిపోదా సంబరం గుండె కాదా మందిరం
జాబిల్లి జాబు రాసి నన్నే కోరే పరిచయం
పున్నాగపూలు పూసే వన్నె చిన్నె రసమయం
ఎందువల్లో ముందులేదీ కలవరం
అదిరిపడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధరకాగితం నీ మధుర సంతకం
అధరకాగితం.. మధుర సంతకం..
గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం

వలపులా వాలితే కన్నెపైటే స్వాగతం కన్న కలలే అంకితం
చెలిమిలా చేరితే పల్లెసీమే పావురం పిల్లప్రేమే వాయనం
సింధూరపూల వాన నిన్నూ నన్ను తడపనీ
అందాల కోనలోన హాయి రేయి గడపనీ
కొత్తగున్నా మత్తుగుంది మన జగం
అదిరిపడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధరకాగితం నీ మధుర సంతకం
అధరకాగితం.. మధుర సంతకం..
గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం
అదిరిపడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి అధరకాగితం నీ మధుర సంతకం

అధరకాగితం.. మధుర సంతకం..

*********  *********  ********

చిత్రం: బొంబాయి ప్రియుడు
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర

ఆ  ఆ
మగమదనిసా సగమదనిసా..ఆ
ఓహో హిందోళం బాగుంది పాడండి పాడండి
బాలమురళి కృష్ణమాకు బాల్య మిత్రుడే
ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే
గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే
స్వఛ్చమైన సంగీతం
కచ్చితంగ మాసొంతం
రాగ జీవులం నాద బ్రహ్మలం
స్వరం పదం ఇహం తరం కాగ..ఆ
బాలమురళి కృష్ణమాకు బాల్య మిత్రుడే
ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే
గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే

తేనె పాట పాడితే మేను పులకరించదా
వీణ పాట పాడితే జాణ పరవశించదా
ఈల పాట పాడితే గాలి తాళమేయదా
జావలీలు పాడితే జాము తెల్లవారదా
భూపాళం పాడితే భూగోళం కూలదా
హిందోళం పాడితే అందోలన కలగదా
హొ హొ హొ హొ హొ హొ హొ హొ ఒ
కళ్యాణిలో పాడితే
కళ్యాణం జరగదా
శ్రీరాగం పాడితే సీమంతం తప్పదా
గునకరాళ్ళకేమి తెలుసు చిలక పలుకులూ
ఈ గార్దబాలకేమి తెలుసు గాంధర్వ గానాలూ ఆ
బాలమురళి కృష్ణమాకు బాల్య మిత్రుడే
ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే
గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే

సామగదామగ సామగదామగ సామగదామగసా
షడ్యమంలో పాడితే లోకం అంతా వూగదా
మధ్యమంలో పాడితే మత్తులోన మునగదా
గొంతు విప్పి పాడితే మంత్ర ముగ్దులవ్వరా
శ్రోతలంత బుద్దిగా వంతపాడకుందురా
ఎలుగెత్తి పాడగా
ఆకాశం అందదా
శ్రుతి పెంచి పాడగా
పాతాళం పొంగదా
హొ హొ హొ హొ హొ ఒ
అలవోకగా పాడగా
హరివిల్లే విరియదా
ఇల గొంతుతో పాడగా
చిరు జల్లే కురవదా
తేట తెలుగు పాటలమ్మ తోట పువ్వులం
మేము సందేహం అంటు లేని సంగీత సోదరులం ఆ
బాలమురళి కృష్ణమాకు బాల్య మిత్రుడే
ఆశ భోస్లే అక్షరాల అత్త కూతురే
గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే

సనిస దానీస గస నిదమగసా
తారినన్న తారినన్న తారినన్న నా
నీ పప్పులుడవోయ్ నీకు ముప్పుతప్పదోయ్
నీ పప్పులుడవోయ్ నీకు ముప్పుతప్పదోయ్
నినిస గస నిస గాస నిదమసా
నీ పప్పులుడవోయ్ నీకు ముప్పుతప్పదోయ్
నీ పప్పులుడవోయ్ నీకు ముప్పుతప్పదోయ్

సస్సస్సస్ససగస సస్సాగ ససగ సస్సాగ సనిదమగస గమదా మదనీ
గని సగ్గరి నిసరి దనిద మగదసా
నీదరి దనిస్సా గసనిదనీ మగగ సస నిదమగ దమ్

 

 1. Usually I do not read post on blogs, however I would like to
  say that this write-up very forced me to check out
  and do it! Your writing style has been surprised me.

  Thanks, very nice post.

  Feel free to visit my blog post :: 918kiss plus ios

 2. Awesome blog! Is your theme custom made or did you download it from somewhere?
  A theme like yours with a few simple adjustements would
  really make my blog stand out. Please let me know where you got your design.
  Thanks

  Also visit my website :: ok388 game

 3. Hi I am so thrilled I found your webpage, I really found
  you by mistake, while I was looking on Digg for something else,
  Nonetheless I am here now and would just like to say
  thank you for a marvelous post and a all round
  enjoyable blog (I also love the theme/design), I don’t have time to
  browse it all at the moment but I have saved it and also
  included your RSS feeds, so when I have time I will
  be back to read much more, Please do keep up the excellent b.

 4. Does your site have a contact page? I’m having a tough
  time locating it but, I’d like to shoot you an email.

  I’ve got some recommendations for your blog you might be interested in hearing.
  Either way, great site and I look forward to seeing it expand
  over time.

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Gowri (2004)
error: Content is protected !!