Bratuku Teruvu (1953)

చిత్రం: బ్రతుకు తెరువు (1953)
సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్, ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: ఘంటసాల
నటీనటులు: అక్కినెని నాగేశ్వర రావు, సావిత్రి
దర్శకత్వం: పి.యస్. రామకృష్ణా రావు
నిర్మాత: కోవెలమూడి భాస్కరరావు
విడుదల తేది: 06.02.1953

అందమె ఆనందం
అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం

పడమట సంధ్యా రాగం
కుడి ఎడమల కుసుమ పరాగం
పడమట సంధ్యా రాగం
కుడి ఎడమల కుసుమ పరాగం
ఒడిలో చెలి మోహన రాగం
ఒడిలో చెలి మోహన రాగం
జీవితమే మధురానురాగం
జీవితమే మధురానురాగం

అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం

పడిలేచే కడలి తరంగం ఓ…
పడిలేచే కడలి తరంగం
ఒడిలో జడిసిన సారంగం
పడిలేచే కడలి తరంగం
ఒడిలో జడిసిన సారంగం
సుడిగాలిలో… ఓ…
సుడిగాలిలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటక రంగం
జీవితమే ఒక నాటక రంగం…

అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం
ఓ… ఓ…ఓ…

********   ********   *********

చిత్రం: బ్రతుకు తెరువు (1953)
సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్, ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం: పి.సుశీల

అందమె ఆనందం
అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం

పడమట సంధ్యా రాగం
కుడి ఎడమల కుసుమ పరాగం
పడమట సంధ్యా రాగం
కుడి ఎడమల కుసుమ పరాగం
ఒడిలో చెలి తీయని రాగం
ఒడిలో చెలి తీయని రాగం
జీవితమే మధురానురాగం
జీవితమే మధురానురాగం

అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం

చల్లని సాగర తీరం
మది గిళ్లను మళయ సమీరం
చల్లని సాగర తీరం
మది గిళ్లను మలయ సమీరం
మదిలో కదిలే సరాగం
మదిలో కదిలే సరాగం
జీవితమే అనురాగ యోగం
జీవితమే అనురాగ యోగం

అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం
లాలాలా లాలాలా లాలాలా
లాలాలా లాలాలా

error: Content is protected !!