ప్రేమ ఓ ప్రేమ ప్రేమా… లిరిక్స్
చిత్రం: బుచ్చినాయుడు కండ్రిగ (2020)
సంగీతం: మిహిరాంష్
సాహిత్యం: బట్టు విజయ్ కుమార్
గానం: అధీఫ్ ముహమ్మద్
నటీనటులు: మున్నా, దృశిక చందర్
దర్శకత్వం: కృష్ణ పోలూరు
నిర్మాణం: పమిడిముక్కల చంద్రకుమారి
విడుదల తేది: 21.08.2020
ప్రేమ ఓ ప్రేమ ప్రేమా… మోసం చేశావే
ప్రేమే లేదంటూ… ప్రేమ ప్రాణం తీసావే
మాటే ఒక మాటే… చురకత్తై యద కోసిందే
పలుకే ఆ పలుకే… నను చంపే విశమయ్యిందే
నా నేరం ఏంటే ప్రేమ… ప్రేమించా ప్రాణంగా
కన్నీటి లోకం నాకు అందించకే…
ఎంతో ప్రేమే చూపించావే… అంతా ఓ మాయే
అన్నీ నేనే అంటూ… నాకే ద్రోహం చేశావే
నిదురే రాని మత్తు వరమై పోనీ… కల్లో కూడా నిన్ను మరించేంతగా
దూరం కోని కాలం దాటే పోనీ… నువ్వే లేని లోకం చేరేంతగా
నమ్మించి మోసం చేశావేంటే… ఇదేనా ప్రేమంటే
ఏమైన కానీ వదిలే పోను అన్నావు ఏమైందే…
ఎంతో ప్రేమే చుపించావే… అంతా ఓ మాయే
అన్నీ నేనే అంటూ… నాకే ద్రోహం చేశావే
మాటే ఒక మాటే… చురకత్తై యద కోసిందే
పలుకే ఆ పలుకే… నను చంపే విశమయ్యిందే
కన్ను నాదే… పొడిచే వేలు నాదే
భాధ నాదే… నీకు చెప్పేదెలా
నాదే స్వార్ధం… నాకు నువ్వే ముఖ్యం
లేదే మోసం అంతా విధి రాతనే…
నీ కోసమే నే దూరం అయ్యా… తప్పంతా నాదేగా
ఈ పాపమంతా నాదే కదా… వీలుంటే మన్నించవా
ఎంతో ప్రేమే నీపై ఉంది… చెప్పే వీళ్ళేదే
అన్ని నువ్వై ఉంటున్నాను… చేరే దారేది
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****