చిత్రం: సి.ఐ.డి (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: సుశీల
నటీనటులు: యన్.టి.రామారావు, జమున, పండరీ భాయి
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాతలు: బి. నాగిరెడ్డి, చక్రపాణి
విడుదల తేది: 23.09.1965
పల్లవి:
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి .. ఐసవుతావా అబ్బాయి
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి .. ఐసవుతావా అబ్బాయి
విరహమె నీకు శీతలమైతే .. ఆ ..
విరహమె నీకు శీతలమైతే వెచ్చని కౌగిట ఊచెదనోయి
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి ..ఐసవుతావా అబ్బాయి
చరణం: 1
కనుచూపులతో పలుకరింపగ కందిపోతివా పాపాయి
కనుచూపులతో పలుకరింపగ కందిపోతివా పాపాయి
ఉగ్గుపోసి నీ సిగ్గు వదలగా ..
ఉగ్గుపోసి నీ నీ సిగ్గు వదలగ.. తమలపాకుతో విసిరెదనోయి..
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి ..ఐసవుతావా అబ్బాయి
చరణం: 2
పెదవి కదపకే ప్రేమ గీతమును మొదలు పెడితివా బుజ్జాయి.. ఓ .. ఓ ..
పెదవి కదపకే ప్రేమ గీతమును మొదలు పెడితివా బుజ్జాయి
మూగమనసె నీ మోజైతే …
మూగమనసె నీ మోజైతే మాటాడక జరిగేరెదనోయి..
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి ..
విరహమె నీకు శీతలమైతే వెచ్చని కౌగిట ఊచెదనోయి
యువతులు చూసి చూడక ముందే
ఐసవుతావా అబ్బాయి .. ఐసవుతావా అబ్బాయి
****** ****** *******
చిత్రం: సి.ఐ.డి (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: పి.సుశీల
పల్లవి:
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే
చరణం: 1
ఆశాలత మొగ్గలేసి పూలు విరగపూసెనే
ఆశాలత మొగ్గలేసి పూలు విరగపూసెనే
తలపులెల్ల వలపులై.. పులకరింపజేసెనే
తలపులెల్ల వలపులై.. పులకరింపజేసెనే .. పరవశించి పోతినే..
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే
చరణం: 2
చందమామ నేడేలనో చలి వెన్నెల కాయడే
చందమామ నేడేలనో చలి వెన్నెల కాయడే
గాలి కూడా ఎందుకనో నులి వెచ్చగ వీచెనే
గాలి కూడా ఎందుకనో నులి వెచ్చగ వీచెనే.. మేను కందిపోయెనే..
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే.. మనసు నిండిపోయెనే
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
ఆ ఆ ఆ ఆ… ఓ ఓ ఓ ఓ… ఊ ఊ ఊ ఊ …
****** ****** *******
చిత్రం: సి.ఐ.డి (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
నా సరినీవని నీ గురినేనని… ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలది… పులకలు కలిగెనులే
నీకు నాకు వ్రాసి ఉన్నదని… ఎఫుడో తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలది… కలవరమాయెనులే
నా సరి నీవని… నీ గురి నేనని… ఇపుడే తెలిసెనులే
చరణం: 1
నా హృదయమునే వీణ చేసుకొని.. ప్రేమను గానం చేతువని..
ఆ…ఆ…ఆ…
నా హృదయమునే వీణ చేసుకొని… ప్రేమను గానం చేతువని
నీ గానము నా చెవి సోకగనే.. నా మది నీదై పోవునని
నీ గానము నా చెవి సోకగనే .. నా మది నీదై పోవునని…
నీకు నాకు వ్రాసి ఉన్నదని… ఎపుడో తెలిసెనులే
చరణం: 2
నను నీ చెంతకు ఆకర్షించే… గుణమే నీలో ఉన్నదని
నను నీ చెంతకు ఆకర్షించే… గుణమే నీలో ఉన్నదని
ఏమాత్రము నీ అలికిడి ఐనా… నా ఎద దడ దడలాడునని
ఏమాత్రం నీ అలికిడి ఐనా… నా ఎద దడ దడలాడునని
నా సరినీవని.. నీ గురి నేనని… ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచిన కొలది… కలవారమాయెనులే
నా సరి నీవని… నీ గురి నేనని…ఇపుడే తెలిసెనులే
****** ****** *******
చిత్రం: సి.ఐ.డి (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా
ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..
ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..
నా తనువు నీ తనువు వేరు వేరు వేరయినా
పాలు నీరు కలియనటులనే.. కలిసిమెలసి పోదము
పాలు నీరు కలియనటులనే.. కలిసిమెలసి పోదము
చరణం: 1
నీ హక్కులు నా హక్కులు.. వేరు వేరు వేరయినా..ఆ..ఆ..
నీ హక్కులు నా హక్కులు.. వేరు వేరు వేరయినా
కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా
కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా
నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా
ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..
చరణం: 2
నీ ప్రాణము నా ప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా..ఆ..ఆ..
నీ ప్రాణము నా ప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా..
నీవంటే.. నీవనచు.. ఊఁ..ఆపావే?
నీవంటే.. నీవనచు.. కీచులాడుకొందుమా..
నా తనువు నీ తనువు వేరు వేరు వేరయినా
పాలు నీరు కలియనటులనే కలిసి మెలసి పోదము..
ఆ..ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ…ఆ..
ఊ..ఊ..ఊ..ఊ..
****** ****** *******
చిత్రం: సి.ఐ.డి (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: పింగళి
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
ఎందుకనో నిను చూడగనే.. కవ్వించాలని ఉంటుంది
ఎందుకనో నిను చూడగనే.. కవ్వించాలని ఉంటుంది
కవ్వించి నీవు కలహమాడితే నవ్వుకొనాలని ఉంటుందీ..
ఎందుకనో…ఓ..ఓ..
ఎందుకనో నిను చూడగనే.. ఏదో ఇదిగా ఉంటుంది..
ఎందుకనో నిను చూడగనే.. ఏదో ఇదిగా ఉంటుంది..
నీ పెదవులపై నవ్వు చిందితే.. మనసు చల్లగా ఉంటుందీ..
ఎందుకనో..ఓ…ఓ..ఎందుకనో
చరణం: 1
అడుగడుగున నీ రాజసమంతా.. ఒలికిస్తూ నువు కులుకుతు ఉంటే..
అడుగడుగున నీ రాజసమంతా.. ఒలికిస్తూ నువు కులుకుతు ఉంటే..
కొంగున కట్టుకు నిను తిప్పాలని..
నా కొంగున కట్టుకు నిను తిప్పాలని..
ఏదో వేడుక పుడుతుంది…. ఎందుకనో..
ఎందుకనో నిను చూడగనే.. ఏదో ఇదిగా ఉంటుంది..
కవ్వించి నీవు కలహమాడితే.. నవ్వుకొనాలని ఉంటుందీ..
ఎందుకనో…ఓ..ఓ..
చరణం: 2
అణువణువున నీ సొంపులు ఒంపులు.. నను మైకంలో ముంచుతు ఉంటే..
అణువణువున నీ సొంపులు ఒంపులు.. నను మైకంలో ముంచుతు ఉంటే..
నీలో ఐక్యం చెందాలంటూ…నీలో ఐక్యం చెందాలంటూ… ఏదో తహతహ పుడుతుందీ.. ఎందుకనో..
ఎందుకనో నిను చూడగనే.. కవ్వించాలని ఉంటుంది
కవ్వించి నీవు కలహమాడితే.. నవ్వుకొనాలని ఉంటుందీ..
ఎందుకనో…ఓ..ఓ.. ఎందుకనో…
ఆ..ఆ..ఆ.. ఓ..ఓ..ఓ..
అహా..హా..ఆ..హా.. ఓ..ఓహో..ఓహో..ఓ…