ఆశా పాశం బందీ చేసేలే… లిరిక్స్
చిత్రం: C/O కంచరపాలెం (2018)
సంగీతం: స్వీకర్ ఆగస్తి
సాహిత్యం: విశ్వా
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: సుబ్బారావు, రాధా బెస్సీ, మోహన్ భగత్, పరుచూరి ప్రవీణ, కార్తీక్ రత్నం,
ప్రణీత పట్నాయక్, కేశవ్ కర్రి,నిత్యశ్రీ, కిషోర్ పొలిమేర
దర్శకత్వం: వెంకటేష్ మహా
నిర్మాణం : పరుచూరి ప్రవీణమురళి
విడుదల తేది: 07.09.2018
ఆశా పాశం బందీ చేసేలే..
సాగే కాలం ఆడే ఆటేలే..
తీర తీరం చేరే లోగానే ఎతీరవునో..
చేరువైన సేదు దూరాలే..
తోడవ్తూనే వీడే వైనాలే..
నీదో కాదో తెలే లోగానే ఎదేటవ్నో..
ఆటు పోటు గుండె మాటుల్లోన..
సాగేనా…
ఏ లే లే లేలో..
కల్లోలం ఈ లోకంలో..
లో లో లోలోతుల్లో..
ఏ లేలో ఎద కొలనులో..
నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి
సిమ్మ సీకటై పోతుంటే..
నీ గమ్యం గంధరగోళం..
దిక్కు తోచకుండ తల్లడిల్లిపోతు
పల్లటిల్లిపోయి నీవుంటే..
తీరేనా నీ ఆరాటం..
ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో..
నిశితంగా.. తెలిసేదెల
రేపేటవునో.. తేలాలంటే..
నీ ఉనికి ఉండాలిగా..
ఓ..ఓ.. ఆటు పోటు
గుండె మాటుల్లోన
సాగేనా…..
ఆశా పాశం బందీ చేసేలే..
సాగే కాలం ఆడే ఆటేలే..
తీర తీరం చేరే లోగానే ఎతీరవునో..
ఏ జాడలో ఏమున్నదో..
క్రీనీడల విధి వేచున్నదో..
ఏ మలుపులో ఎం దాగున్నదో..
నీవు గ తేల్చుకో..నీ శైలిలో..
చిక్కు ముళ్ళు గప్పి
రంగు లీనుతున్న లోకమంటే.. పెద్ద నాటకమే..
తెలియకనే సాగే కథనం..
నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి పట్టి పోతుంటే..
కంచికి నీ కథలే దూరం…
నీ చేతుల్లో ఉంది సేతల్లో సూపించి ఎదురేగి సాగాలిగా..
రేపేటవునో.. తేలాలంటే..
నువ్వెదురు సూడాలిగా…
ఓ.ఓ.. ఆటు పోటు
గుండె మాటుల్లోన… ఉంటున్న…
Hi sir
So thankful for providing telugu songs lyrics in telugu.
I found so many old golden hits in this page. Thank u so much for ur efforts.
Sir I need 1 movie songs lyrics.plz do needful.
Movie name…..???ళా???ారుడు (2019)
Music ర???ురా???
Cast…శ్ర???దర్ , దుర్??? ,ప???సాని
Song name pls
thank u sooo mush sir
welcome bro. 🙂
so super app sir or mam I found motivative music here I sing well but with seeing lyrycs providing this app makes me happy tq sir lucky app half but music vunte deenithi path I can give 100 stars
Sure.????