చిత్రం: కెప్టెన్ కృష్ణ (1979)
సంగీతం: యస్. పి. బాలు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, సుశీల
నటీనటులు: కృష్ణ , శ్రీప్రియ, శారద
దర్శకత్వం: కె.యస్.ఆర్. దాస్
నిర్మాత: పి.రాజశేఖర్ రెడ్డి
విడుదల తేది: 1979
పల్లవి:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఏహే..హె..హే….ఆ..ఆ..హా..ఆ…ఆ..
కలకాలం ఇదే పాడనీ..
నీలో నన్నే చూడనీ…
కలకాలం ఇదే పాడనీ..
నీలో నన్నే చూడనీ…
చరణం: 1
నీ… వలపుల లోగిలిలో విహరించనీ…
నీ… వెచ్చని కౌగిలిలో నిదురించనీ…
నీ… వలపుల లోగిలిలో విహరించనీ…
నీ… వెచ్చని కౌగిలిలో నిదురించనీ..
నీ నయనాలలో నను నివశించనీ…
నీ నయనాలలో నను నివశించనీ…
మన ప్రేమనౌక ఇలా సాగనీ….
కలకాలం ఇదే పాడనీ…
నీలో నన్నే చూడనీ…
చరణం: 2
జన్మ జన్మల నీ హృదయరాణినై
ఈ అనుబంధం పెనవేయనీ…
జన్మ జన్మల నీ హృదయరాణినై
ఈ అనుబంధం పెనవేయనీ…
ఈ ప్రేమ గీతికా ఒక తీపి గురుతుగా
నా కన్నులలో వెన్నెలలే కురిపించనీ
నీడల్లె నీ వెంట నేనుండగా
బ్రతుకంత నీతోనే పయణించగా
కలకాలం ఇదే పాడనీ….
నీలో నన్నే చూడనీ…
చరణం: 3
ఈ జంటకు తొలిపంట ఈ రూపము
నా కంటికి వెలుగైన చిరుదీపము
ఈ జంటకు తొలిపంట ఈ రూపము
నా కంటికి వెలుగైన చిరుదీపము
ఈ చురునవ్వులే వేయి సిరిదివ్వెలై
ఈ చురునవ్వులే వేయి సిరిదివ్వెలై
వెలగాలి కోటి చందమామలై….
కలకాలం ఇదే పాడనీ….
నీలో నన్నే చూడనీ….
కలకాలం ఇదే పాడనీ….
నీలో – నన్నే చూడనీ…