Chaavu Kaburu Challaga (2021)

Chaavu Kaburu Challaga (2021)

పైన పటారం.. ఈడ లోన లొటారం… లిరిక్స్

చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జేక్స్ బిజోయ్
సాహిత్యం: సనరే
గానం: మంగ్లీ, సాకేత్ కొమండూరి
నటీనటులు: కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, ఆమని
దర్శకత్వం: కౌశిక్‌ పెగళ్ళపాటి
నిర్మాణం: బన్నీ వాసు
విడుదల తేది: 19.03.2021

Paina Pataaram Song Telugu Lyrics

పుట్టువేళ తల్లికి నువ్వు పురిటి నొప్పివైతివి
గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా
గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా
బట్ట మరక పడితే నువ్వు… కొత్త బట్టలంటివీ
ఇప్పుడేమో ఉతకలేని… మట్టి బట్ట కడితివా
ఇప్పుడేమో ఉతకలేని… మట్టి బట్ట కడితివా

ఇట్టాగున్నవయ్యో పీటారన్నయ్యో
నీది ఏదేమైనా శానా గొప్ప సావయ్యో
పుచ్చు తోసి మంచి వంగ ఏరినట్టు
స్వచ్ఛమంటి స్వామి నిన్నే కోరినాడయ్య

హే..! పైన పటారం… ఈడ లోన లొటారం
ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం
ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం
పైకి బంగారం… లోన గూడు పుటారం
గెలికి సూడు తెలిసిపోద్ది… అసలు బండారం
గెలికి సూడు తెలిసిపోద్ది… అసలు బండారం

మనుషులు మాయగాళ్ళు… మచ్చలున్న కేటుగాళ్ళు
కానీ ఎవరికాళ్ళు మనసులున్న గ్రేటుగాళ్ళు
నాది నాది అన్న స్వార్ధమున్న సెడ్డవాళ్ళు
నీలా బ్రతకలేని డబ్బులున్న పేదవాళ్ళు
నాకాడ వందుంటే… నా ఏంటే తిరిగేటోళ్ళు
నీకాడ వెయ్యుంటే… నాపైనే మొరుగుతారు
సందంట పోతాంటే… సూసి కూడా పలకనోళ్ళు
నీకాడ సొమ్ముంటే… ఇంట చేరి పొగుడుతుంటారు

లోకమెంతో లోతయ్యా పీటరన్నయ్యా
అది తవ్వి చూడడానికే… ఈ జీవితమయ్యా
తొవ్వేకొద్దీ వస్తుంటారు… నిండా ముంచి పోతుంటారు
నీతో నాతో ఉండే సగం దొంగోల్లేనయ్యా
వీ ఆర్ వెరీ హ్యాపీ బాసు… నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు
వీ ఆర్ వెరీ హ్యాపీ బాసు… నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు

హే..! పైన పటారం… ఈడ లోన లొటారం
ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం
పైకి బంగారం… లోన గూడు పుటారం
గెలికి సూడు తెలిసిపోద్ది… అసలు బండారం

కారు బంగళాలు… వేలికున్న ఉంగరాలు
ఏవీ రావంట సచ్చినాక మనవెంట
నీతో ఉన్నవాళ్ళు… నిన్ను మోసి కన్నవాళ్ళు
వెళిపోతారంతా వెలిగినాక సితి మంట
మట్టి మీద నువ్ కలిసిన… బంధాలన్నీ అబద్ధం
మట్టిలోన పిచ్చి పురుగుల జట్టే… చివరి ప్రపంచం

మనిషి తీరు మారదయ్యా పీటరన్నయ్యా
అందుకనే సెబుతున్న ఇనరాదయ్యా
బాధే లేని బెంగే లేని… రేపేంటన్న సింతేలేని
సోటేదైనా ఉన్నాదంటే స్మశానమేరా, అందుకే
వీ ఆర్ వెరీ హ్యాపీ బాసు… నువ్వుండేదే సేఫెస్టు ప్లేసు

హే..! పైన పటారం… ఈడ లోన లొటారం
ఇను బాసు సెబుతానీలోకమెవ్వారం
పైకి బంగారం… లోన గూడు పుటారం
గెలికి సూడు తెలిసిపోద్ది… అసలు బండారం
గెలికి సూడు తెలిసిపోద్ది… అసలు బండారం
గెలికి సూడు తెలిసిపోద్ది… అసలు బండారం

Chaavu Kaburu Challaga Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

కదిలే కాలాన్నడిగా… లిరిక్స్

చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జేక్స్ బిజోయ్
సాహిత్యం: పెగళ్ళపాటి కౌశిక్, సనరే
గానం: గౌతమ్ భరద్వాజ్, షాసా త్రిపాఠి
నటీనటులు: కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, ఆమని
దర్శకత్వం: కౌశిక్‌ పెగళ్ళపాటి
నిర్మాణం: బన్నీ వాసు
విడుదల తేది: 19.03.2021

Kadhile Kaalannadiga Song Telugu Lyrics

పడవై కదిలింది మనసే… ఆకాశం వైపే
గొడవే పెడుతూ ఉందే… నువ్వు కావాలనే
నువ్వొచ్చావనీ వచ్చావని వచ్చావనీ… నా ప్రాణం చెప్పిందే

నిససస నిస సగరిగరిగ… నిససస నిస సగరిగరిగ
మా పగపమగరిగరి పా గరిరిగరి
నిససస నిస సగరిగరిగ… నిససస నిస సగరిగరిగ
సరిగపనిసరి సా గపగరిసనిప

కదిలే కాలాన్నడిగా… ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా… నీ వైపే నను లాగమని
నా ప్రాణం ఎక్కడో దాచిందా సందడే
నీ తోడే చేరగా తెలిసిందా నేడే

మహారాజై మురిసానే ఆకాశ దేశాన
నీ మాట విన్నాకా… ఆఆ
మెరుపల్లే మెరిసానే ఆ నీలిమేఘాన
తెలిసేలా నీదాకా… ఆ ఆ
ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షములో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే

కదిలే కాలాన్నడిగా… ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా… నీ వైపే నను లాగమని

ఆశలే ఆవిరై ఎగిరిపోతుంటే
చెలిమితో చేరువై… వెతికి తెచ్చేసానలా
మనసావాచా మనసిచ్చాగా… నీ తలరాతే మార్చేస్తాన చిరునామాగా
కలలో కూడా కలిసుంటాగా… ఏ దూరాలు రాలేవడ్డంగా
నిజంగానే మరో లోకం సమీపిస్తోందా
మళ్ళీ నీలా నన్నే లోకం పరీక్షిస్తుందా
బ్రతుకైనా చితికైనా… నీ లోపలి హృదయాన్నై నిన్నంటే నేనుంటా
చనిపోయే క్షణమైనా… విడిపోని ప్రణయాన్నై, నీడల్లే తోడుంటా

ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షములో పురివిప్పే నెమలి వలె
నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే

కదిలే కాలాన్నడిగా… ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా… నీ వైపే నను లాగమని

Chaavu Kaburu Challaga Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

మై నేమ్ ఈజు రాజు బస్తీ బాలరాజు… లిరిక్స్

చిత్రం: చావు కబురు చల్లగా (2021)
సంగీతం: జేక్స్ బిజోయ్
సాహిత్యం: క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల
గానం: రేవంత్
నటీనటులు: కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, ఆమని
దర్శకత్వం: కౌశిక్‌ పెగళ్ళపాటి
నిర్మాణం: బన్నీ వాసు
విడుదల తేది: 19.03.2021

My Name Iju Raju Song Telugu Lyrics

హే… ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగ పుట్టావురో
అట్టా అట్టా అట్టా అట్టా అట్టాగే పోతావురో
ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఫీలైపోతారేందిరో
సత్తే సత్తే సత్తే సత్తే సత్తే ఏమౌతాదిరో

హే గాల్లో దీపం… గుండెల్లో ప్రాణం
ఎప్పుడు తుస్సంటుందో… ఎవడికి తెలుసును లేరా
ఒంట్లో జీవం… కాదే మన సొంతం
ఉన్నన్నాళ్లు పండగ చేసి… పాడెక్కెయ్ రా
పోయేవాన్ని పోనివ్వక… నీ ఏడుపు ఎందుకురా
నీ ఆస్థి గీస్తి ఏమైనా ఆడట్టుకుపోతాడా
కోటల్లోని రారాజైన… కాటికి పోవాలా
నువ్వు నేను ఎవడైనా… కట్టెల్లో కాలాల, ఆ ఆ ఆఆ

మై నేమ్ ఈజు రాజు… బస్తీ బాలరాజు
చావు కబురు చల్లగా చెబుతా ప్రతిరోజు
మై నేమ్ ఈజు రాజు… బస్తీ బాలరాజు
చావు కబురు చల్లగా చెబుతా ప్రతిరోజు

హే… ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగ పుట్టావురో
అట్టా అట్టా అట్టా అట్టా అట్టాగే పోతావురో
ఎహె…ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఫీలైపోతారేందిరో
సత్తే సత్తే సత్తే సత్తే సత్తే ఏమౌతాదిరో

చుట్టం చూపుకు వస్తాం… పెట్టిందల్లా తింటాం
పర్మనెంట్ గా ఆ ఇంట్లోనే బైఠాయించంగా
సినిమా పోస్టర్ చూస్తాం… ఓ టిక్కెట్ తీసి వెళ్తామ్
అయిపోయాక కుర్చీ ఖాళీ చెయ్యక తప్పదుగా
ఆరడుగుల బాడీ అంతే… అద్దెకు ఉంటున్నామంతే
ఈ బాడీ కొంపని వదిలెయ్యాలి… టైమే అయిపోతే
పుట్టేటప్పుడు ఊపేస్తారు… నిన్నే ఉయ్యాల
పోయేటప్పుడు నలుగురు వచ్చి… చక్కా మొయ్యాలా
ఉన్నన్నాళ్ళు ఆ నలుగురిని సంపాదించాలా
ఊరంతా నిను ఊరేగించి… టాటా సెప్పాలా, ఆ ఆఆ ఆఆ

స్వర్గానికి తొలిమెట్టు… నా బండేరా ఒట్టు
ఎవ్వడైనా సచ్చాడంటే… నాకే ఫోను కొట్టు
స్వర్గానికి తొలిమెట్టు… నా బండేరా ఒట్టు
ఎవ్వడైనా సచ్చాడంటే… నాకే ఫోను కొట్టు

సన్ను డాటరు అవుతాం… సిస్టరు బ్రదరు అంటాం
అందరితోనూ బంధాలెన్నో… కలుపుకుపోతుంటాం
అప్పుల్లో మునిగుంటాం… అంబానీ కలకంటాం
చిల్లర కోసం… ఎన్నో ఎన్నో వేషాలే వేస్తాం
ఈ లైఫొక నాటకమేలే… మన యాక్టింగులు అయిపోతే
ఈ ఊరు పేరు మేకప్ తీసి… చెక్కేయ్యాలంతే
ఆ శివుడాజ్ఞే లేకుండా… సీమైన కుడుతుందా
అంటూ మహభాగ… ఏదాంతం సెబుతామంటా
అన్నీ ఇచ్చిన ఆ సామే… సావును గిఫ్టు ఇవ్వంగా
అయ్యయ్యయ్యో వద్దంటావేందయ్యో సిత్రంగా, ఆ ఆ ఆఆ

జెజ్జెనక జెజ్జెనకా… తోడుంటా నీ ఎనకా
పువ్వుల్లోన మోసుకెళ్ళి… పూడ్చేస్తా పద కొడకా
జెజ్జెనక జెజ్జెనకా… తోడుంటా నీ ఎనకా
పువ్వుల్లోన మోసుకెళ్ళి… పూడ్చేస్తా పద కొడకా
మై నేమ్ ఈజు రాజు… బస్తీ బాలరాజు
చావు కబురు చల్లగా… చెబుతా ప్రతిరోజు

Chaavu Kaburu Challaga Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Rendu Kutumbala Katha (1970)
error: Content is protected !!