చిత్రం: చక్రం (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీ చక్రవర్తి
నటీనటులు: ప్రభాస్, ఛార్మి కౌర్, ఆశీన్
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: వెంకటరాజు, శివరాజు
విడుదల తేది: 25.03.2005
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లని
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని
గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి
********** ********** **********
చిత్రం: చక్రం (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కౌశల్య
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
అందించనీ అదిరే అధరాంజలి
బంధించనీ కాలాన్ని కౌగిలి
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే నీ జాలి
మంటల్లే నను మరిగించాలి
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
తలుపేసుకుంటే నీ తలపాగుతుందా
మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా
నీ విషమే పాకింది నరనరమునా
ఇక నా వశము కాకుంది యమయాతన
లేనిపోని నిందలుగాని హాయిగానే ఉంది కాని
ఉన్నమాట నీతో చెప్పనీ
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ
లాగావు గుట్టు గుండెల్లోకి చూస్తూ
నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా
నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా
మనసు పొందే మన్మధలేఖ కెవ్వుమంది కమ్మని కేక
వయసు పొంగిపోయే వేడిగా
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
అందించనీ అదిరే అధరాంజలి
బంధించనీ కాలాన్ని కౌగిలి
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే నీ జాలి
మంటల్లే నను మరిగించాలి
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
********** ********** **********
చిత్రం: చక్రం (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రీ చక్రవర్తి
పిల్లలు: అబ్బ అదిరింది !
అమ్మో భలే చేస్తున్నావే..హి హి హీ !
నా పేరు చక్రం.. భూచక్రం .. విష్ణుచక్రం ..
సుదర్శన చక్రం బస్సు చక్రం .. కారు చక్రం ..
సైకిల్ చక్రం .. కాల చక్రం !
జరిగింది.. జరుగుతున్నది..జరగబోయేది..
అన్నీ నాకు తెలుసు !
పిల్లలు: టూ మచ్ గా మాట్లాడకు..
అసలు నీకేం తెలుసోయ్ ?
నీ అస్సలు పేరు బన్నీ..నీ అస్సలు పేరు చిన్నీ
నీ పప్పీ పేరు స్నూపీ..నీ పాకెట్లో వన్ రూపీ
పిల్లలు: Wow..great !
నీ కిష్టం Tom & Jerry
నచ్చిన ఫ్రూటేమో చెర్రీ
నీ పళ్ళకుంది క్లిప్పూ
నువ్ పెట్టలేదు జిప్పూ
పిల్లలు: ఇంకేం తెలుసూ ?
చాలా తెలుసు !
నువ్ రాత్రి పూట పక్క మొత్తం తడిపేస్తుంటావు
నీ ఫ్రెండుగాడి పెన్సిళ్ళన్నీ మాయం చేస్తావు
నువ్వు సోఫా సెట్టు చెంచా తోటి కోసేస్తుంటావు
నువు కడుపులో నొప్పని స్కూలుకి డుమ్మా కొట్టేస్తుంటావు
పిల్లలు: ఇవన్నీ ఎట్టా చెప్పావూ..
ఇవన్నీ ఎట్టా చెప్పావూ?
ఇదంతా ఫేస్ రీడింగూ.. ఇదంతా ఫేస్ రీడింగూ
ముందుకు దువ్విన పండూ..హిందీలో మార్కులు రెండూ
వెనక్కి దువ్విన వేణూ..నిను తన్నినవాడు సీను..సీనూ
పిల్లలు : My God !
ఇదంతా క్రాఫ్ రీడింగూ.. ఇదంతా క్రాఫ్ రీడింగూ !
పిల్లలు : ఓ !
స్పైడర్ మాన్ విక్కీ..పడలేదా సైకిల్ ఎక్కీ
సూపర్ మాన్ బాలూ..నైటంతా నోట్లో వేలూ
ఇదంతా డ్రెస్సు రీడింగూ.. ఇదంతా డ్రెస్సు రీడింగూ
ఫేస్ రీడింగ్ ..క్రాఫ్ రీడింగ్ .. డ్రెస్ రీడింగ్ అయిపోయాయ్ !
పిల్లలు: హమ్మయ్య !
ఇప్పుడు ఫ్యూచర్ రీడింగ్ !
నువ్ భవిష్యత్తులో..హే..చిరంజీవిలా..
నువ్ భవిష్యత్తులో చిరంజీవిలా డాన్సులు చేస్తావూ..బోలెడు ఫాన్సులు పొందేవూ
పిల్లలు : Is it?
Sure !
నువ్ భారత్ జట్టులో సచిన్ ప్లేస్ ని భర్తీ చేస్తావూ..
బిలియన్ పరుగులు తీస్తావూ
పిల్లలు: We want sixer ! We want sixer !
నువ్వేమో air force..నువ్వేమో military force
నువ్వేమో చోటా టాటా .. నువ్వేమో బుల్లి గేట్స్
పద్మశ్రీలు..డాక్టరేట్లు..జ్ఞానపీఠలు..భారతరత్నలు.. మీరే !
పిల్లలు: సరే మేమేం చెయ్యాలీ.. సరే మేమేం చెయ్యాలీ ?
అల్లరి చెయ్యాలి..చిల్లర పనులే చెయ్యొద్దూ
నవ్వుతూ ఉండాలీ..నవ్వుల పాలే కావొద్దూ
కలలే చూడాలీ..నిజముగ మలచక వదలొద్దూ
ఎత్తుకు ఎదగాలీ..నిలిచిన నేలను మరవొద్దూ
భారతభూమిని మరవద్దూ.. భారతమాతను మరవద్దూ
పిల్లలు :
We like your idea..We love our India !
We like your idea..We love our India !!
********** ********** **********
చిత్రం: చక్రం (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చక్రి
ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవోపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ
నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ
నా ఓపిరే నువ్వనీ
నీకు చెప్పాలని
నేను అని లేను అని చెబితే ఏం చేస్తావు
నమ్మనని నవ్వుకొని చాల్లె పొమ్మంటావు
నీ మనసులోని ఆశగా నిలిచేది నేనని
నీ తనువులోని స్పర్శగా తగిలేది నేననీ
నీ కంటి మైమరపులో నను పోల్చుకుంటాననీ
తల ఆన్చి నీ గుండెపై నా పేరు వింటాననీ
నీకు చెప్పాలని
నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
నువు రాకముందు జీవితం గురుతైన లేదనీ
నిను కలుసుకున్న ఆ క్షణం నను వదలిపోదనీ
ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నీదేననీ నీకైన తెలుసా అనీ
నీకు చెప్పాలనీ
********** ********** **********
చిత్రం: చక్రం (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్
రంగేళి హోళి హంగామా కేళి
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి
రవ్వల రించోలి సిరి దివ్వెల దీవాలి
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి
పంచాంగం చెబితేగాని పండుగ రానందా
సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా
తినేది చేదని తెలిసి అది ఉగాది విందని తలచి
ఇష్టపడే ఆ పూటే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది
గడపలు అన్నీ జరిపి ఆ గణపతి పండుగ జరిపి
నిమ్మజనంగా జనం జరిపే పయనం నిత్య భాద్రపదమౌతుంది
లోకుల చీకటి తొలగించే శుభసమయం కోసం వెతికే
చూపులు దీపాలుగ జేసే జాగరణే శివరాత్రి
ప్రత్యేకంగా బంధువులొచ్చే రోజొకటుండాలా
చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగా లేదా
తల్లుల జోలపదాలై గొల్లల జానపదాలై
నరుడికి గీత పథమై నడవడమంటే అర్ధం కృష్ణ జయంతి
అందరి ఎండకు మనమే పందిరయ్యే లక్షణమే
మనిషితనం అంటారని గుర్తించడమే శ్రీరామ నవమయింది
మనలో మనమే కలహించి మనలో మహిషిని తలపించి
విజయం సాధించే క్షణమే దసరా దశమి అవుతుంది
పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగి మంటయింది
మది ముంగిలిలో ముగ్గులు వేసే శాంతే సంక్రాంతి
ఒకటి రెండంటూ విడిగా లెక్కెడితే
తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడూ అంకెలు ఎన్నంటే
పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే
లెక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే
నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
కోట్ల ఒకటై ఎవరి ముసుగులో వాళ్ళుంటామంతే
నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే
ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒక్కటే
********** ********** **********
చిత్రం: చక్రం (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: కండికొండ
గానం: చక్రి, కౌశల్య
సోని సెల్‌ఫోన్ పీసా దిల్లోకివ్వవే వీసా
సోనిక్ ఫైట్లు స్పీడే నేను చూశా
నువ్వులవ్ వైరస్లాగా నాపై పోక్కాగా
అల్లుకుపోనా నేనై గోల్డెన్ తీగ
నవ్వుతు మనస్సే కోస్తా మోనాలిసా
హర్టే హైజాక్ చేస్తా ఓయాసిస్సా
మోనాలిసా ఒయాసిస్సా (2)
చరణం: 1
లేత వెన్నెల్లో ఫ్యారిస్లా నన్నుసోకగా వైరస్‌లా
కలలు ఆగవు పరిగెడుతూ క్వాలిస్లా
వయస్సు పొంగదా షాంపెన్లా మనస్సు మారెను
తుఫాన్‌లా నిన్ను రమ్మని మోగింది అనుసారంలా
రానా రాకెట్ లాగా
నేనే వీనాస్ ప్లానిట్ కానా
ప్రాణం ఉన్నా ప్లాటినం ముద్దిస్తావా
ముద్దులు ఇచ్చే ఏటీమ్ నేనూ వస్తాగా
ముద్దిస్తావా
నేనొస్తాగా
చరణం: 2
మేని మెరిసెను మేల్వోన్లా టోరె కోహినూర్ డైమెండ్‌లా
దాడి చేస్తిని సొగసులపై బిన్‌లాడెన్‌లా
చూపు తాకితే యాసిడేల్ తీపిగుంది ప్రూట్ సలాడ్‌లా
ప్రేమ ప్రేమతో చంపెయ్యరా సైనేడ్లా
నడుమే నైలాన్ ఉయ్యాల ఊగితే రేగెను నాలో జ్వాలా
మూసిన రెప్పల పైపైకి కలనై వస్తా
కలలే కన్నా ఊహలని నిజమే చేస్తా
కలనై వస్తా
నిజమే చేస్తా