Chal Mohana Ranga (1978)

చిత్రం: చల్ మోహన రంగ (1978)
సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్)
సాహిత్యం: దాశరధి, సి.నారాయణ రెడ్డి, కొసరాజు, జాలాది, గొల్లపూడి, సముద్రాల సుధాకర్
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి, జి.ఆనంద్, విజయలక్ష్మీ శర్మ
నటీనటులు: కృష్ణ , దీప , జయమాలిని , పుష్ప కుమారి, మోహన బాబు, షావుకారు జానకి
మాటలు: గోపి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి.భాస్కర్
ఫోటోగ్రఫీ: పుష్పాల గోపికృష్ణ
ఎడిటర్: వి.జగదీష్
నిర్మాత: పి.త్రినాధ రావు
విడుదల తేది: 29.06.1978

చిత్రం: చల్ మోహన రంగ (1978)
సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్)
సాహిత్యం:
గానం:

పల్లవి:
ఎంత తియ్యని మాట పంచుకుంటె చాలు
పులకింతలై పుచెరా
కొత్త కొత్త వయసు పైటంత  పాటమ్మ
పురివిప్పి ఆడేనురా
ఇక ఆగలేను నేనింక హోలాల
ఊగిందే నా మనసే ఉయ్యాల

ఎంత తియ్యని మాట పంచుకుంటె చాలు
పులకింతలై పుచెరా
కొత్త కొత్త వయసు పైటంత  పాటమ్మ
పురివిప్పి ఆడేనురా
ఇక ఆగలేను నేనింక హోలాల
ఊగిందే నా మనసే ఉయ్యాల

చరణం: 1
మనసైన వాడే వరసైనాడని స్వప్నాల విహరించనా
కన్నె మనసే నీకు కనుకైయ్యిందని పువ్వు పువ్వుకు చెప్పనా
ఉన్నపాటున నిన్ను పెనవెయ్యనా
ముద్దుల్లో మురిపాలు ముంచెత్తనా
నా కొంగుచాటున నిన్ను దాచెయ్యనా

ఎంత తియ్యని మాట పంచుకుంటె చాలు
పులకింతలై పుచెరా
కొత్త కొత్త వయసు పైటంత  పాటమ్మ
పురివిప్పి ఆడేనురా
ఇక ఆగలేను నేనింక హోలాల
ఆ ఊగిందే నా మనసే ఉయ్యాల

చరణం: 2
ఆ నాడు వద్దంటే పైపైకి వచ్చావు
ఈనాడు ఏమాయెరా
అసలైన వగలేమో బుసగొట్టి కసిరేపే
ఇక కైపుగున్నానురా
వలపంతా రంగరించి కలబోయారా
చెలరేగి స్వర్గాలు చూపించరా

ఎంత తియ్యని మాట పంచుకుంటె చాలు
పులకింతలై పుచెరా
కొత్త కొత్త వయసు పైటంత  పాటమ్మ
పురివిప్పి ఆడేనురా
ఇక ఆగలేను నేనింక హోలాల
అహహ  ఊగిందే నా మనసే ఉయ్యాల

******  ******   *******

చిత్రం: చల్ మోహన రంగ (1978)
సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్)
సాహిత్యం: సినారె
గానం: యస్.పి.బాలు, సుశీల 

పల్లవి:
ఎన్నాళ్ళీ తలపులు… కలల మేలుకొలుపులు
ఎగిసిపడే హృదయంలో ఘడియ పడని తలుపులు

ఎన్నాళ్లీ పిలుపులు…. మూసిన కనుకొలకులు
ఎన్నాళ్లీ పిలుపులు…. మూసిన కనుకొలకులు
నువు నడిచే బాటలో … తీయని తొలి మలుపులు

ఎన్నాళ్ళీ తలపులు… ఎన్నాళ్లీ పిలుపులు

చరణం: 1
తారకలే నీ కన్నుల తోరణాలు తీర్చేనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
తారకలే నీ కన్నుల తోరణాలు తీర్చేనా

చిరునవ్వులలు వెన్నెలకే.. కొత్త సిగ్గు నేర్పేనా
కొత్త సిగ్గు నేర్పేనా

నిదుర రాదు… నిదుర రాదు… నిదుర రాదు… నిదుర రాదు…
నిను చూసిన కనులకు

ఎన్నాళ్ళీ తలపులు… ఎన్నాళ్లీ పిలుపులు

చరణం: 2
ఆమని నీ కౌగిలో… అలసి నిలిచి పోయేనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆమని నీ కౌగిలో… అలసి నిలిచి పోయేనా

ఏమని నా మనసు నన్నే  …  విసిగి వేసరించేనా
విసిగి వేసరించేనా

విడిది చేసే మధుమాసం
విడిది చేసే మధుమాసం
చల్లని నీ లే ఎదలో…
చల్లని నీ లే ఎదలో…

ఎన్నాళ్ళీ తలపులు… ఎన్నాళ్లీ పిలుపులు
ఎన్నాళ్ళీ తలపులు… ఎన్నాళ్లీ పిలుపులు
ఎన్నాళ్ళీ తలపులు… ఎన్నాళ్లీ పిలుపులు
ఎన్నాళ్ళీ తలపులు… ఎన్నాళ్లీ పిలుపులు

******  ******   *******

చిత్రం: చల్ మోహన రంగ (1978)
సంగీతం: బి.శంకర్ (ఘజల్ శంకర్)
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి.బాలు

పల్లవి:
ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ… కలహంస నడకల కలికి
సింగారమొలకంగ చీర కొంగులు జారే రంగైన నవమోహనాంగీ
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ… రాణీ
ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ… కలహంస నడకల కలికి
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ… రాణీ

చరణం: 1
అందాల గంధాలు పూసేయనా…
సింధూర కుసుమాలు సిగ ముడవనా…
అందాల గంధాలు పూసేయనా…
సింధూర కుసుమాలు సిగ ముడవనా…

చిలకమ్మో… కులికి పలుకమ్మో
ఆ… చిలకమ్మో.. కులికి పలుకమ్మో
నిలువెత్తు నిచ్చెన్లు నిలవేయనా… నీ కళ్ళ నెలవళ్ళ నీడంచనా

మడతల్లో.. మేని ముడతల్లో.. ముచ్చట్లో.. చీర కుచ్చిట్లో
మడతల్లో.. మేని ముడతల్లో.. ముచ్చట్లో.. చీర కుచ్చిట్లో

పసుపు పారాణేసి.. పట్టె మంచం వేసి
పసుపు పారాణేసి.. పట్టె మంచం వేసి
దొంతు మల్లెల మీద దొర్లించనా

అలివేణీ అలకల్లే.. నెలరాణి కులుకల్లే.. తరలెల్లి పోకమ్మా కలికీ
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ… రాణీ
ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ… కలహంస నడకల కలికి

చరణం: 2
గగనాల సిగపూల పరుపేయనా… పన్నీటి వెన్నెల్లో ముంచేయనా
గగనాల సిగపూల పరుపేయనా… పన్నీటి వెన్నెల్లో ముంచేయనా

నెలవంకా.. చూడు నా వంక
చిట్టి నెలవంకా… చూడు నా వంక
నీ మేని హొయలన్నీ బులిపించనా.. ఎలమావి కోకేసి కొలువుంచనా

పొద్దుల్లో… సందపొద్దుల్లో.. నిద్దట్లో.. ముద్దు ముచ్చట్లో
పొద్దుల్లో… సందపొద్దుల్లో.. నిద్దట్లో.. ముద్దు ముచ్చట్లో

నట్టింట దీపాన్ని నడికొండ కెక్కించి
చీకట్ల వాకిట్లో చిందేయనా

పొగరంతా ఎగరేసి.. వగలన్నీ ఒలకేసి.. కవ్వించబోకమ్మా కలికీ
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోమెందుకే కోమలాంగీ.. రాణీ
ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ… కలహంస నడకల కలికి
ఈడూ జోడూ మనకు ఇంపుగ కుదిరింది కోపమెందుకే కోమలాంగీ… రాణీ

error: Content is protected !!