చిత్రం: చలాకి రాణి కిలాడి రాజా (1971)
సంగీతం: సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు
నటీనటులు: కృష్ణ , విజయలలిత
దర్శకత్వం: విజయ్
నిర్మాత:
విడుదల తేది: 29.10.1971
పల్లవి:
భలే కుర్రదానా.. హుషారైన జాణా..ఆ..
నీ వాడి చూపులలోనా.. నే ఓడిపోయానే
నీ వాడి చూపులలోనా.. నే ఓడిపోయానే
భలే కుర్రదానా.. హుషారైన జాణా
నీ వాడి చూపులలోనా.. నే ఓడిపోయానే
నీ వాడి చూపులలోనా.. నే ఓడిపోయానే
ఓహోహో.. హాఁ..
అహాహా.. హేహే..
చరణం: 1
మొగ్గంటి నీ బుగ్గ రమ్మన్నదీ.. మనసార కసితీర ఇమ్మన్నదీ
నీ అలకెందుకే నన్ను ఊరించకే..
నీ అలకెందుకే నన్ను ఊరించకే..
నీవే చలాకి రాణీ.. నేనే కిలాడి రాజా..హొయ్ హొయ్ హొయ్ హొయ్..
కలవాలి నీవు నేను.. గెలవాలి లోకాలు
కలవాలి నీవు నేను.. గెలవాలి లోకాలు
భలే కుర్రదానా.. హుషారైన జాణా
నీ వాడి చూపులలోనా.. నే ఓడిపోయానే
నీ వాడి చూపులలోనా.. నే ఓడిపోయానే..
చరణం: 2
అబ్బబబ్బబబ్బబబ్బ
బింకాలు బిడియాలు ఇంకెందుకే.. పంతాలు చాలించి ప్రేమించవే
నీ అందాల మోము.. నాకందించవే..
నీ అందాల మోము.. నాకందించవే..
ఈ ఏకాంత వేళా వృధాచేయనేలా.. నీ తీపి కౌగిలిలోనా నే సోలిపోవాలి
నీ తీపి కౌగిలిలోనా నే సోలిపోవాలి..
భలే కుర్రదానా.. హుషారైన జాణా
నీ వాడి చూపులలోనా.. నే ఓడిపోయానే
హెహేయా..