Challenge (1984)

చిత్రం: చాలంజ్ (1984)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి (All Songs)
గానం: యస్. పి. బాలు, యస్.జానకి
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, సుహాసిని
దర్శకత్వం: ఏ. కోదండ రామిరెడ్డి
నిర్మాత: కె.ఎస్. రామారావు
విడుదల తేది: 09.08.1984

ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే…
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే…
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే?
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే?

ఐ లవ్ యూ ఓ హారికా…
నీ ప్రేమకే జోహారికా!
ఐ లవ్ యూ ఓ హారికా…
నీ ప్రేమకే జోహారికా!

ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే…

కవ్వించే కన్నులలో, కాటేసే కలలెన్నో
పకపక నవ్వులలో, పండిన వెన్నెలవై నన్నందుకో…
కసి కసి చూపులతో, కొస కొస మెరుపులతో నన్నల్లుకో…

ముకిళించే పెదవుల్లో మురిపాలు
ఋతువుల్లో మధువంతా సగపాలు…
సాహోరే భామా…హోయ్!

ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే…
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే?
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే?

ఐ లవ్ యూ ఓ హారికా…
నీ ప్రేమకే జోహారికా!
ఐ లవ్ యూ ఓ హారికా…
నీ ప్రేమకే జోహారికా!

మీసంలో మిసమిసలు, మోసాలే చేస్తుంటే…
బిగిసిన కౌగిలిలో, సొగసరి మీగడలే దోచేసుకో…
రుస రుస వయసులతో, ఎడదల దరువులతో ముద్దాడుకో!

తొలిపుట్టే ఎండల్లో సరసాలు…
పగపట్టే పరువంలో ప్రణయాలు…
జోహారే ప్రేమ… హోయ్!

ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే…
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే?
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే?

ఐ లవ్ యూ ఓ హారికా…
నీ ప్రేమకే జోహారికా!
ఐ లవ్ యూ ఓ హారికా…
నీ ప్రేమకే జోహారికా!

ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే…

*********  *********  *********

చిత్రం: ఛాలెంజ్ (1984)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

పల్లవి :
ఓం శాంతి.. ఓం శాంతి… వయ్యారి వాసంతి
నీ ఈడులో ఉంది వేగం… నీ తోడు నాకుంది భాగం

చంకి చక్కకి చం.. చకచంచక చకకచం
చంకి చక్కకి చం.. చకచంచక చకకచం

ఓం శాంతి.. ఓం శాంతి… నీదేలే పూబంతి

చరణం: 1
ఒంపుఒంపున హంపి శిల్పమే చూశా… కన్నేశా
లేత నడకలో హంస గమనమే చూశా… కాజేశా
కన్నెనడుమా?  కల్పనా?… కవులు పాడే కావ్యమా
కదిలి వచ్చే శిల్పమా? … కరిగిపోనీ స్వప్నమా
నీ ఊహలో ఇలా… ఉప్పొంగునా అలా
ఉయ్యాలలూగి యవ్వనాలా నవ్వులన్నీ నీవే కావా

ఓం శాంతి.. ఓం శాంతి… వయ్యారి వాసంతి
నీ పువ్వు నా పూల బాణం… నీ ఊపిరే నాకు ప్రాణం

చంకి చక్కకి చం.. చకచంచక చకకచం
చంకి చక్కకి చం.. చకచంచక చకకచం

చరణం: 2
నీలవేణిలో కృష్ణవేణినే చూశా… ముడి వేశా
పడతి కొంగులో కడలి పొంగులే చూశా… చుట్టేశా
మేని విరుపా?  మెరుపులా?… బుగ్గ ఎరుపా?  వలపులా?
నీలికనులా?  పిలుపులా? … మత్తులా?  మైమరపులా?
నీ చూపుతో ఇలా… నీ సందిటకేలా
ఇన్నాళ్ల నుంచి వేచి ఉన్నా… వెన్నెలంతా నీకే కాగా

ఓం శాంతి.. ఓం శాంతి… వయ్యారి వాసంతి
నీ ఈడులో ఉంది వేగం… నీ తోడు నాకుంది భాగం

చంకి చక్కకి చం.. చకచంచక చకకచం
చంకి చక్కకి చం.. చకచంచక చకకచం

********   *********  *******

చిత్రం: ఛాలెంజ్ (1984)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్.జానకి

పల్లవి:
భామా…  ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..
మావా…  నీ పప్పులు ఉడకవు ఆపర గోలా

వద్దంటే వయసొచ్చి…  వద్దన్నా మనసిచ్చి
నిద్దరకే సెలవిచ్చేయ్ ఈ వేళా..

భామా…  ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..

చరణం: 1
తప్పంటూ చేయక పోతే తగలాటము..
నిప్పంటి వయసులతోనా చెలగాటము
ఐతే మరి ఎందుకు చెప్పు మోమాటము
ఆడదాని మోమాటాలే ఆరాటము
వానాకాలం ముసిరేస్తుంటే
వాటేసుకునే హక్కే ఉంది
ఇదివానో గాలో పొంగో వరదో
రారా మలిపొద్దులు పుచ్చక సుద్దులతో ఈ వేళా

మావా…  నీ పప్పులు ఉడకవు ఆపర గోలా
భామా…  ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..

చరణం: 2
ఏదిక్కూ లేని చోటే ఏకాంతము
నా దిక్కూ మొక్కూ నువ్వే సాయంత్రమూ
ఇప్పట్లో వద్దూ మనకు వేదాంతము
సిగ్గంటూ బుగ్గివ్వడమే సిద్దాంతము
కవ్వింతల్లో కసిగా ఉంటే.. కౌగిలి కన్నా దారేముంది
అది రైటో కాదో నైటో పగలో..రావే
చెలి ఆకలి తీర్చకు చూపులతో ఈ వేళా

భామా…  ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..
మావా…  నీ పప్పులు ఉడకవు ఆపర గోలా
వద్దంటే వయసొచ్చి వద్దన్నా మనసిచ్చి
నిద్దరకే సెలవిచ్చేయ్ ఈ వేళా..

భామా…  ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా..
మావా…  నీ పప్పులు ఉడకవు ఆపర గోలా

********  ********  ********

చిత్రం: ఛాలెంజ్ (1984)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

పల్లవి:
సాయంకాలం సాగర తీరం
నా చెలి వొళ్ళో చలి సందళ్ళో
రోజూ మోజుగా జల్సా చేయరా
విరజాజిపూల గంధమంటి అందమంత నీదిరా

సాయంకాలం సాగర తీరం
వెచ్చని వొళ్ళో వెన్నెల గుళ్ళో
తాజా మోజులే రోజూ చూడరా
నడి రాతిరల్లే పగటిపూట రాసలీలలాడరా

చరణం: 1
కాపురమొస్తే కాదంటానా కౌగిలి నీకే లేదంటానా
కాపురమొస్తే కాదంటానా కౌగిలి నీకే లేదంటానా
కవ్వించి నవ్వించి కసితీరా కరిగించి కథకాస్త నడిపించనా

మరుమల్లె మరి విచ్చుకునే వేళ లాలాలలాల
కళ్ళుమరీ గిచ్చుకునే వేళ లాలాలలాల
కళ్ళుమరీ గిచ్చుకునే వేళ లాలాలలాల
రానంటానా పొదరింటికి పూతకొచ్చి పండుతున్న పులకరింత వేళకి

చరణం: 2
సిగ్గని చెప్పి పొమ్మంటానా చక్కెర విందు లేదంటానా
సిగ్గని చెప్పి పొమ్మంటానా చక్కెర విందు లేదంటానా
రేపంటూ మాపంటూ అంతటితో ఆపంటూ తెల్లారిపోనిస్తానా లాలాలలాల

చెలిగాలి మరి చంపితినే వేళ లాలాలలాల
జంట చలి పెంచుకునే వేళ లాలాలలాల
జంట చలి పెంచుకునే వేళ లాలాలలాల
రమ్మంటావా సందిళ్ళకి ఒంటిగుండి చావలేనె సలపరింత గోలకి

సాయంకాలం సాగర తీరం
నా చెలివొళ్ళో చలి సందళ్ళో
తాజా మోజులే రోజూ చూడరా
విరజాజిపూల గంధమంటి అందమంత నీదిరా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Neram Nadi Kadu (1989)
error: Content is protected !!