Chalo (2018)
Chalo (2018)

Chalo (2018)

చిత్రం: చలో  (2018)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి , సాగర్
నటీనటులు: నాగశౌర్య , రష్మీక మందాన
దర్శకత్వం: వెంకీ కుడుముల
నిర్మాత: ఉషా ముల్పూరి
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
బ్యానర్: ఐరా క్రియేషన్స్
విడుదల తేది: 02.02.2018

(చలో సినిమా సంగీత దర్శకుడు మహతి సాగర్  మణిశర్మ గారి అబ్బాయి, అలాగే ఈ సినిమాకు నిర్మాత ఉషా గారు
నాగశౌర్య వాళ్ల అమ్మగారు ఇది వాళ్ల సొంత బ్యానర్)

చూసి చూడంగానే  నచ్చేశావే
అడిగి అడగాకుండా వచ్చేశావే
నా మనసులోకీ హో అందంగా దూకి
దూరం దూరంగుంటూ ఏం చేశావే
దారం కట్టి గుండె ఎగరేశావే
ఓ చూపుతోటి హో ఓ నవ్వు తోటి
తొలిసారిగా నాలోపల
ఏమైయ్యిందో తెలిసేదెలా
నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు
నీలోను చూశానులే
నీ వంక చూస్తుంటే అద్దంలో
నను నేను చూస్తున్నట్టే ఉందిలే హో

ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే
అహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే
నువు నా కంట పడకుండా నా వెంట పడకుండా
ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే
నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే
నేనెన్నెన్నో యుద్దాలు చేస్తానులే
నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను
హామీ ఇస్తున్నానులే
ఒకటో ఎక్కమ్ కూడా మరచి పోయేలాగా
ఒకటే గుర్తొస్తావే నిను చూడకుండ ఉండగలన
నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు
నీలోను చూశానులే
నీ వంక చూస్తుంటే అద్దంలో
నను నేను చూస్తున్నట్టే ఉందిలే హో…

*******   *******   *******

చిత్రం: చలో  (2018)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనురాగ్ కులకర్ణి , సాగర్

చూస్తుంటె పువ్వుల షేపు…కాని పోలందేవి టైపూ
సెంతిమెంటల్ అనిపిస్తావె నాకు మెంటల్ తెప్పిస్తావే
ఓ చందమామ లాగ బైటకు బిల్డప్ ఇస్తావే
చంద్రముఖి లాగా లోపల ఏషాలేస్తావే
వర్జినల్ని అర్జెంటుగా చూడాలనుందే
రెయిన్.బో లాగా ఫుల్లుగ ఓపెన్ ఐపోవే

టెక్కులాపవే టెక్కులాపవె చిక్కినావె నువ్వు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా
ఓ రేసు కారులా దూసుకెల్లకా బ్రేకులేసి నువ్వు ఓకె చెప్పాలా

తీసుకెల్లు స్లిప్పులే పాసు కావు సప్లీలే
కంప్యూటర్ కనిపెట్టినట్టు కంటింగులియ్యొద్దే
యావరేజు బ్యూటివే ఆర్జివ్ ట్రీటువే
తొక్కలో తిక్కను చూపి బ్రతికెయ్యొద్దే
b.com లొ physics ఉందనె బాపతి నువ్వే
మన మద్యన కెమిస్టీనే అర్దం చేస్కోవే
బిల్గెట్సు బిట్ ఐనట్టు బిల్డప్పులు వద్దే
నా దిల్లో గేటు తెరిచే ఉంచానే

టెక్కులాపవే టెక్కులాపవె చిక్కినావె నువ్వు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా
ఓ రేసు కారులా దూసుకెల్లకా బ్రేకులేసి నువ్వు ఓకె చెప్పాలా

హాలిడే ట్రిప్పులా ఎవ్రి డే ట్రీటు లా
నువ్వు నా చెంతకు వస్తే నీలా ఉండొచ్చే
రూల్స్ నీకు ఉండవే బౌండరీలసలు ఉండవే
మనసుకే మాస్కే వేసె క్షణమే రాదే
రైట్ అయినా రాంగ్ ఐనా నా వోటు నీకే
నీ వెంటె నేనుంటా వీడని షాడోలా
ఓ బ్యాడ్ అయినా శాడ్ అయినా దాటాలి నన్నే
కాస్తూ ఉంటా నిన్నే ప్రాణంలా

టెక్కులాపకె టెక్కులాపకె ఒక్కసారి నువ్ నాతో చేరాకా
ఓ రేసు కారులా దూసుకెల్లవె బ్రేకులెయ్యకే ఓకే చెప్పకా