Chanakya Sapatham Telugu Lyrics

Chanakya Sapatham (1986)

Chanakya Sapatham Telugu Lyrics

మెల్లగా… మెల్లగా… లిరిక్స్

చిత్రం: చాణక్య శపథం (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: చిరంజీవి , విజయశాంతి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాణం: డి.వి.యస్.రాజు
విడుదల తేది: 18.12.1986

మెల్లగా… మెల్లగా…
అల్లుకో… అల్లుకో…
మెత్తగా… మెత్తగా…
హత్తుకో… హత్తుకో…
అల్లుకుంటు అందమంత గిల్లుకోనా..
హత్తుకుంటు హాయికాస్త జల్లుకోనా..
గుట్టు గుట్టుగా.. గుండెలోనే..
వేడిగా వెచ్చగా.. ఉండిపోనా..
మెత్త మెత్తగా.. ఉన్నవన్నీ..
చాటుగా మాటుగా..  ఇచ్చుకోనా..

మెల్లగా… మెల్లగా…
అల్లుకో… అల్లుకో…

ఆడ ఈడ ఉన్న ఆడ అందమంత
ముద్దచేసి ముద్దుపెట్టి కొట్టమాకు
కన్నె ఈడు సన్నకారు సోకులన్ని
కౌగిలిస్తే లెక్కపెట్టి చంపమాకు
చల్లగాలి కొట్టగానే.. ఉల్లికోక జారిపోయే..
తాకే.. నీ ఊపిరీ.. సాగించే అల్లరీ..
పోజులన్ని పట్టుకోర పోరగాడ
బొమ్మలాడుకోర వాలుపొద్దు కాడ

మెల్లగా… మెల్లగా…
అల్లుకో… అల్లుకో…
మెత్తగా… మెత్తగా…
హత్తుకో… హత్తుకో…

చూడరాని చెప్పలేని రేఖలన్ని
ఏడు రంగులేసి చూసి రెచ్చిపోకు
పుట్టుమచ్చ తాకలేని పూతలన్ని
గుచ్చి మాలలల్లుతుంటే నొచ్చుకోకు
కన్ను నువ్వు కొట్టగానే.. గాజులమ్మ ఘల్లుమంటే..
తగిలే నీ కాటుకా.. రగిలే నా కోరికా..
పండు దాచుకోకు బిట్టలాడు వేళ
పక్కదాటిపోకు చుక్కలాడువేళ

మెల్లగా… మెల్లగా…
అల్లుకో… అల్లుకో…
మెత్తగా… మెత్తగా…
హత్తుకో… హత్తుకో…
అల్లుకుంటు అందమంత గిల్లుకోనా..
హత్తుకుంటు హాయికాస్త జల్లుకోనా..
గుట్టు గుట్టుగా.. గుండెలోనే..
వేడిగా వెచ్చగా.. ఉండిపోనా..
మెత్త మెత్తగా.. ఉన్నవన్నీ..
చాటుగా మాటుగా..  ఇచ్చుకోనా..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

వేడి వేడి వలపులు… లిరిక్స్

చిత్రం: చాణక్య శపథం (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: చిరంజీవి , విజయశాంతి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాణం: డి.వి.యస్.రాజు
విడుదల తేది: 18.12.1986

లల లల లలా…
లలాలలాలలాలలాల

వేడి వేడి వలపులు
తేనే కలల చినుకులు
మూగ మూగ పిలుపులు
ముట్టుకుంటె వణుకులు
హో.. మనసా.. తెలుసా.. హే..

జాజిపూల తేరుమీద ప్రేమ యాత్రా..
జాబిలమ్మ ఇంటిదాక జంట యాత్రా.. ||2||

ఏ దేశమేగినా ప్రేమ ఒక్కటే
ఏడేడు జన్మల బంధమొక్కటే
ప్రేమలేనినాడు బ్రతుకు చీకటే
పెదవుల్ని కలిపేది ముద్దొక్కటే
ముద్దిస్తే పుట్టేది సడిఒక్కటే
ఆ.. జతులే.. జతలో.. కలిసీ..

జాజిపూల తేరుమీద ప్రేమ యాత్రా..
జాబిలమ్మ ఇంటిదాక జంట యాత్రా.. ||2||

నీలాల నీ కురుల తెరల మాటున
ఈనాడే చూస్తున్న చంద్రబింబము
కవ్వించే కౌగిళ్ళ కథల చాటున
ఈనాడే చూస్తున్న స్వర్గలోకము
మంచు గాలి తగిలితే..
ఆ మల్లె పువ్వు రగిలితే..
నింగీ నేలా ముద్దులే..
నిన్ను నేను తాకితే..
నీ వలపే,, వలలై బిగిసే..

జాజిపూల తేరుమీద ప్రేమ యాత్రా..
జాబిలమ్మ ఇంటిదాక జంట యాత్రా.. ||2||

నీలోనే చూస్తున్న ఇంద్రధనస్సులు
నీకే నేనిస్తున్న ఏడు రంగులు
నీవు నవ్వుతుంటే తార నేరమా,,
మబ్బుల్లో మంచాలు పరిచేయనా,,
నీ మేను మెరుపంతా దోచేయనా,,
ఈ.. రథమే.. కదిలే.. ఒడిలో,,

వేడి వేడి వలపులు
తేనే కలల చినుకులు
మూగ మూగ పిలుపులు
ముట్టుకుంటె వణుకులు
హో.. మనసా.. తెలుసా.. హే..

జాజిపూల తేరుమీద ప్రేమ యాత్రా..
జాబిలమ్మ ఇంటిదాక జంట యాత్రా.. ||2||

లల లల లలా…
లలాలలాలలాలలాల

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Andala Ramudu (2006 )
error: Content is protected !!