చిత్రం: చందమామ కథలు (2014)
సంగీతం: మిక్కీ జె. మేయర్
సాహిత్యం:
గానం: కళ్యాణి
నటీనటులు: లక్ష్మీ మంచు, ఆమని, నరేష్ , నాగశౌర్య , చైతన్య కృష్ణ , రిచా పానయ్
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాత: చాణక్య భూనేటి
విడుదల తేది: 25.04.2014
కలని ఇలని కలిపిన వారధులు
కలిమి లేమి కరిగిన సుధలు
ఎపుడేమైన తరగని సంపదలు
ఇప్పుడే భువిలో ఇవి జానపదులు
చందమామ కథలు సాటివారి ఎదలు దాచుమేడలు
చందమామ కథలు వారి వీరి సోదలు తమపునాదులు
ఇవ్వాళ ఇలాగ నీ ముందు ఉన్నాది
ఇలాగే ఇలాగే రేపుండదోయ్ అది
నిజంలో బలాన్ని చూపిస్తు ఉన్నది
కొన్నాళ్ళు వెలుగులలో కొన్నాళ్ళు మసకలలో
వందేళ్లు గడపమని అన్నాయి
కలని ఇలని కలిపిన వారధులు
కలిమి లేమి కరిగిన సుధలు
ఎపుడేమైన తరగని సంపదలు
ఇప్పుడే భువిలో ఇవి జానపదులు
చందమామ కథలు సాటివారి ఎదలు దాచుమేడలు
చందమామ కథలు వారి వీరి సోదలు తమపునాదులు
తపించే గుణాన్ని నీడల్లే మార్చుకో
శపించే క్షణాన్ని ఓడించి వంచుకో
నటించే జగములో నీ పాత్ర తెలుసుకో
ఆదిచాలు తరువాత మిగిలింది తలరాత
అనుకుంటూ బతకమని అన్నాయి
కలని ఇలని కలిపిన వారధులు
కలిమి లేమి కరిగిన సుధలు
ఎపుడేమైన తరగని సంపదలు
ఇప్పుడే భువిలో ఇవి జానపదులు
చందమామ కథలు సాటివారి ఎదలు దాచుమేడలు
చందమామ కథలు వారి వీరి సోదలు తమపునాదులు