చిత్రం: చండీప్రియ (1980)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
నటీనటులు: శోభన్ బాబు, చిరంజీవి, జయప్రద
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: అంజలీ దేవి
విడుదల తేది: 1980
చిత్రం: చండీప్రియ (1980)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: వేటూరి సుందరరామ్మూర్తి
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
ఏ వేళనైన ఒకే కోరికా
ఏ పూవులైన ఒకే మాలిక
ఇలాగే పాడాలి కలకాలం
ఇలాగే పాడాలి కలకాలం
ఏ వేళనైన ఒకే కోరికా
ఏ పువులైన ఒకే మాలిక
యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్
యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్
చరణం: 1
అరవిరిసే కనులే కమలాలు
ముసురుకునే కురులే బ్రమరాలు
మిల్ కర్ సనమ్ హర్ కదమ్ హమ్ చలేంగే
మిల్ కర్ సనమ్ హర్ కదమ్ హమ్ చలేంగే
దిగిరావా నీలాల గగనాలు
ఏ వేళనైన ఒకే కోరికా
ఏ పూవులైన ఒకే మాలిక
యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్
యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్
చరణం: 2
కెహెతా హై ప్యాసా మన్ మేరే సాజన్
ఖిల్తా రహే అబ్ మై ఆజ్ సావన్
మెరిసే నీ నవ్వులే జల్లులైతే
మెరిసే నీ నవ్వులే జల్లులైతే
పరువాలే శ్రావణ మేఘాలు
ఏ వేళనైన – ఒకే కోరికా
ఏ పూవులైన – ఒకే మాలిక
యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్
యూ హీ హమ్ గాయేంగే జనమే జనమ్
చిత్రం: చండీప్రియ (1980)
సంగీతం: పి.ఆదినారాయణరావు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
ఓ ప్రియా – ప్రియా
చండీప్రియా – ప్రియా
తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖా
నడిచే చంద్రరేఖ
ఓ ప్రియా – ప్రియా
చండీప్రియా – ప్రియా
తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా
నీదే ఈ చంద్రరేఖ
చరణం: 1
మనసులో ప్రతి మలుపులో
నిను మలుచుకున్నానులే
కలలలో మధువనులలో
నీ పిలుపు విన్నానులే
మనసులో ప్రతి మలుపులో
నిను మలుచుకున్నానులే
కలలో మధువనులలో
నీ పిలుపు విన్నానులే
ఆ.. చెలియ రూపాన చేరుకున్నావ
పలికే రాగలేఖ
కలా? – నిజం..
నిజం? – మ్మ్..
ఓ ప్రియా – ప్రియా
చండీప్రియా – ప్రియా
తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా
నీదే ఈ చంద్రరేఖ
చరణం: 2
ఎవ్వతే నీ వెవ్వతే
వలికించుతావు వగలు
ఏమీటే కథ ఏమిటే
కురిపించుతావు సెగలు
ఆశను జీవితాశను
నే చెదిరితే విషాదం
చండిని అపర చండిని
నను కదిపితే ప్రమాదం
ఆ నీవు నా కైపు తాను నా వైపు
అయ్యో ఏమి రాత
అటా? – ఇటూ…
ఏటు? – ఇటూ …
ఓ ప్రియా – ప్రియా
చండీప్రియా – ప్రియా
తొలి గిలిగింతలు కలిగించిందా నా ప్రేమలేఖా
నడిచే చంద్రరేఖ
తొలి గిలిగింతలు కలిగించింది నీ ప్రేమలేఖా
నీదే ఈ చంద్రరేఖ