చిత్రం: చంద్రలేఖ (1998)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి.బాలు
నటీనటులు: నాగార్జున, రమ్యకృష్ణ, ఇషాకొప్పికర్
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాతలు: నాగార్జున, వి.రాంప్రసాద్
విడుదల తేది: 31.07.1998
సాహసమే చేయ్‌రా డింభకా
అన్నది కదరా పాతాళభైరవి
చొరవగా దూకకపోతే సాధించలేవురా
నువ్వనుకున్నది
ధైర్యముంటే హహ్హహ్హా
దక్కుతుంది హహ్హహా రాకుమారి
తెలివిగా వేయ్‌రా పాచిక
కల్లో మేనక ఒళ్లోపడదా
సులువుగా రాదురా కుంక
బంగారు జింక వేటాడాలిగా
నింగిదాకా హహ్హహ్హా నిచ్చెనేద్దాం హహ్హహ్హా
ఎక్కిచూద్దాం హహ్హహ్హా ఒహ్హొహో…
చందమామను అందుకొనే
ఇంద్ర భవనాన్ని కడతానురా
పడవంత కారులోన బజారులన్నీ
షికారు చేస్తానురా
సొంతమైన విమానములో
స్వర్గలోకాన్ని చూడతానురా
అపుడు అప్సరసలు ఎదురువచ్చి
కన్ను కొడతారురా
చిటికేస్తే హహ్హహ్హా సుఖమంతా హహ్హహ్హా
మనదేరా
సాహసమే చేయ్‌రా డింభకా
అన్నది కదరా పాతాళభైరవి
చొరవగా దూకకపోతే సాధించలేవురా
నువ్వనుకున్నది
ధైర్యముంటే హహ్హహ్హా
దక్కుతుంది హహ్హహా రాకుమారి
సున్ని ఉండలు కందిపొడి
ఫ్యాక్టరీల్లోన వండించనీ
అమెరికా ఇరాను జపాను ఇరాకు
జనాలు తింటారనీ
కొన్ని ఎం.పి.లను కొంటా
కొత్త పి.ఎం.ను నేనేనంటా
స్కాములెన్నో చేసి స్విస్‌బ్యాంకు కేసి
డాలర్లలో తేలుతా
సుడివుంటే హహ్హహ్హా ఎవడైనా హహ్హహ్హా
సూపర్‌స్టారే
సాహసమే చేయ్‌రా డింభకా
అన్నది కదరా జై పాతాళభైరవి
చొరవగా దూకకపోతే ఐ యామ్ వెరీ సారీ
నువ్వనుకున్నది
ధైర్యముంటే హహ్హహ్హా
దక్కుతుంది హహ్హహా రాకుమారి