చిత్రం: చంద్రముఖి (2005)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువన చంద్ర
గానం: యస్. పి. బాలు
నటీనటులు: రజినీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార
దర్శకత్వం: పి.వాసు
నిర్మాతలు: పి.కరుణాకర్ రెడ్డి, గవర పార్థసారథి
విడుదల తేది: 14.04.2005
అరె అరె అరె అరె అరె…
దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
ఓయ్ దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువు కొంచెం సానపెట్టరా…
రిపీటు…
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువు కొంచెం సానపెట్టరా…
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే… ఓ ఓ ఓ…
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే… ఓ ఓ ఓ…
దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
చరణం: 1
ఆరె ఆరే ఆరె ఆరే… అరెరే ఆరే అరెరే ఆరే
ఆలోచించు కొంచెం రైతుబిడ్డ కష్టం
అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం
వాడలోని మలినం శుభ్రం చేసేవారు
నాలుగు రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు
మాసిన జుట్టు పనీ పట్టె వాడంటూ లేకుంటే
తగ్గుతుందా తల బరువూ
నీళ్లలోనే నిలిచి ఉతికే వాడంటూ లేకుంటే
నిలుచునా మన పరువూ
ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు
దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారోయ్…
రిపీటు…
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే… ఓ ఓ ఓ…
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే… ఓ ఓ ఓ…
ఆ… దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
చరణం: 2
నీ గురించి ఎవరో అరె ఏమనుకుంటే ఏమి
ఈ చెవితోటి విన్నాగాని ఆ చెవిలోంచి వదిలేయ్
మేఘం సాగుతున్నా కాకులు మూగుతున్నా
ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పి
పూలబంతి పట్టి నీటి మధ్యలో ఉంచినా
తేలుతుందోయ్ పైకి సోదరా
అరె నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా
తేలిరారా పూలబంతిలా
మిణుగురు పురుగులు ఎన్నెన్నున్నా
పున్నమినాటి జాబిలి చల్లే పండు వెన్నెలనాపగలదా…
రిపీటు…
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే…. ఓ ఓ ఓ…
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే… ఓ ఓ ఓ…
దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
స్వామి నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువు కొంచెం సానపెట్టరా…
రిపీటు…
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువు కొంచెం సానపెట్టరా…
శభాషు….
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే… ఓ ఓ ఓ…
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే… ఓ ఓ ఓ…
******** ******* ********
చిత్రం: చంద్రముఖి (2005)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: సుజాత
కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి
నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి
కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి
నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి
ఎంత కాలంమెంత కాలం హద్దు మీరకుండాలి
అంత కాలమంత కాలం ఈడు నిద్దరాపాలి
కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి
నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి
చరణం: 1
గుండె విరహములో మండే వేసవిలో నువ్వే శీతకాలం
కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం
మదనుడికి పిలుపు మల్లె కాలం
మదిలోనె నిలుపు ఎల్లకాలం
చెలరేగు వలపు చెలి కాలం
కలనైన తెలుపు కలకాలం
తొలి గిలి కాలం కౌగిలికాలం మన కాలం ఇది… ఆ…
కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి
నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి
చరణం: 2
కన్నె మోజులకు సన్నజాజులకు కరిగే జాము కాలం
గుచ్చే చూపులకు గిచ్చే కైపులకు వచ్చే ప్రేమకాలం
తమి తీరకుండు తడి కాలం
క్షణమాగనంది ఒడి కాలం
కడిగింది సిగ్గు తొలికాలం
మరిగింది మనసు మలి కాలం
మరి సిరికాలం మగసిరి కాలం మన కాలం పదా… ఆ…
కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి
నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి
ఎంత కాలంమెంత కాలం హద్దు మీరకుండాలి
అంత కాలమంత కాలం ఈడు నిద్దరాపాలి
******** ******* ********
చిత్రం: చంద్రముఖి (2005)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: భువనచంద్ర
రారా సరసకు రారా
రారా చెంతకు చేరా
ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా
శ్వాసలో శ్వాసవై రారా.. తోం తోం తోం
చరణం: 1
నీ పొందు నే కోరి అభిసారికై నేను వేచాను సుమనోహరా
కాలాన మరుగైన ఆనంద రాగాలు వినిపించ నిలిచానురా
తననన ధీం త ధీం త ధీంత తన
వయసు జాలవోపలేదుర
మరులుగొన్న చిన్నదాన్నిరా
తనువు బాధ తీర్చ రావేరా రావేరా
సల సల సల రగిలిన పరువపు పొదయిది
తడిపొడి తడిపొడి తపనల స్వరమిది రా రా రా
చరణం: 2
ఏ బంధవో ఇది ఏ బంధవో
ఏ జన్మబంధాల సుమగంధవో
ఏ స్వప్నవో ఇది ఏ స్వప్నవో
నయనాల నడయాడు తొలి స్వప్నవో
విరహపు వ్యధలను వినవా
ఈ తడబడు తనువును కనవా
మగువల మనసుల తెలిసి
నీ వలపును మరచుట సులువా
ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక
సరసకు పిలిచితి విరసము తగదిక
జిగిబిగి సొగసుల మొరవిని
మిలమిల మగసిరి మెరుపుల మెరయగా రా రా రా