చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్
నటీనటులు: బాలకృష్ణ , టబు , శ్రేయ శరన్
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 25.09.2002
Don’t Care…..
నవ్వేవాళ్ళు నవ్వనీ…. ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ
పొగిడేవాళ్ళు పొగడనీ… తిట్టేవాళ్ళు తిట్టని Don’t Care….Don’t Care
పూలే నీపై జల్లని… రాళ్ళే నీపైరువ్వనీ
ఎత్తుకు నిన్నెగరెయ్యనీ…. గోతులునీకే తియ్యని Don’t Care…Don’t Care
అనుకున్నది నువ్వే చెయ్…
అనుమానం మానిచెయ్….
నీమనసే పెట్టిచెయ్…. నీదేరా పైచెయ్…
చరణం: 1
ఎదిగేకొద్దీ ఒదగాలన్నది చెట్టును చూసినేర్చుకో
క్రమశిక్షణతో మెలగాలన్నది చీమను చూసినేర్చుకో
చిరునవ్వులతో బతకాలన్నది పువ్వును చూసినేర్చుకో
ఓర్పు సహనం ఉండాలన్నది పుడమిని చూసినేర్చుకో
ఎంత తొక్కినా… నిన్నెంత తొక్కినా…..
అంత పైకి రావాలన్నది బంతిని చూసినేర్చుకో
నేర్చుకున్నది పాటించెయ్…
ఓర్చుకుంటు పనులేచెయ్… నీదేరా పైచెయ్…
చరణం: 2
ఉన్నదున్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసినేర్చుకో
పరులకు సాయం చెయ్యాలన్నది సూర్యుణ్ణి చూసినేర్చుకో
సోమరితనాన్ని వదలాలని గడియారాన్ని చూసినేర్చుకో
ప్రేమనందరికి పంచాలన్నది భగవంతుణ్ణి చూసినేర్చుకో
ఎంత చెప్పినా… నేనెంత చెప్పినా…..
ఇంకెంతో మిగిలున్నది అది నీకునువ్వు నేర్చుకో…
నేర్చుకున్నది పాఠం చెయ్…
నలుగురికి అది నేర్పించెయ్… నీదేరా పైచెయ్…