Chillara Mogudu Allari Koduku (1992)

chillara mogudu allari koduku 1992

చిత్రం: చిల్లర మొగుడు అల్లరి కొడుకు (1992)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ
నటీనటులు: చంద్రమోహన్, జయసుధ,
మాటలు: శంకరమంచి పార్థసారథి (తొలిపిరిచయం)
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రేలంగి నరసింహారావు
నిర్మాత: అల్లాడ సత్యనారాయణ
బ్యానర్: శ్రీ సాయిలక్ష్మీ ప్రొడక్షన్స్
విడుదల తేది: 1992

ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార
నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా
ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార
నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా

దొరికారు లేడిలా దొరగారు దొంగలా
పోలీసు ఫోజులే చాలుగా

ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార
నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా

తప్పో వప్పో పుచ్చుకున్నా అరువు
తియ్యొద్దమ్మో పరువు
అప్పో సప్పోవంటి కథలే పడవు
పద్దే వద్దు బరువు
అయ్యయ్యో అట్టాగంటే ఎట్టా మేడం
తమరు ఇస్తాలెండి షుగరు
అహ ఇట్టా చెప్పే మాటకేది కుదురు
ఇంటా బయటా వినరు
బాకీలే బంధాలు కావా నూరేళ్లు గుర్తుండి పోవా
ఆ మాట రైటండి సారు అహ ఇవ్వండి ఓ వెయ్యి  మీరు
అరె నాకే నామం గీసే తెగువ తగదు మగువ

ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార – అబ్బా ఇస్తానండి
నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా – తీర్చక చస్తానా
దొరికారు లేడిలా దొరగారు దొంగలా
పోలీసు ఫోజులే చాలుగా

ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార – ఇస్తాను
నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా – పోతానండి

అయ్యోపాపం ఎందుకండి అలుపు
చేస్తాలెండి హెల్ప్
ఆబ్బె వద్దు అలవాటే మాకు రోజు చేసే వర్కు
ఇట్టా సాయం చేయబోతే ఇరుగు
పొందాలండి పొరుగు
అహ కాకా పట్టి చెక్కరెగ్గొట్టారో ఖాకీ లాఠీ విరుగు
కోపాలదేముంది లెండి ఆ తీపి గుర్తుండనిండి
ఈ మాటకే వళ్ళు మండు
హస్బెండ్ తీస్తాడు బెండు
అబ్బ ఏదో ఊర్కె అంటే తెగని తగవు తగునా

ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార – అయ్యో
నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా – అమ్మో
దొరికారు లేడిలా దొరగారు దొంగలా
పోలీసు ఫోజులే చాలుగా…

ఏవండోయ్ వచ్చారా ఏదీ పంచదార – ఇస్తానండి
నేడైనా తెచ్చారా బాకీ తీర్చిపోరా
పరువు తీయకండి ఇస్తానండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top