చిత్రం: చినబాబు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు , యస్.జానకి
నటీనటులు: నాగార్జున, అమల
దర్శకత్వం: ఎ. మోహన్ గాంధీ
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 06.05.1988
దమ్ముంటె కాస్కో నీ సొమ్ము చేస్కో
దమ్ముంటె కాస్కో నీ సొమ్ము చేస్కో
కోరుకున్న కన్నె పిల్ల కొంగు పట్టుకో
ఆదుకున్న ఆడపిల్ల అందమందుకో
ఆపేదెవరు అడిగేదెవరూ అంతా దోచుకో
నా దమ్ము చూస్కో నీ కొమ్ము కాస్కో
అహ నా దమ్ము చూస్కో నీ కొమ్ము కాస్కో
దగ్గరొచ్చి బుగ్గలిచ్చి దండమెట్టుకో
సిగ్గులొచ్చి చీకటింట సున్నమెట్టుకో
ఆపేదెవరూ అడిగేదెవరూ బాగా రెచ్చిపో
తిమ్మిరి చేతిని తిట్టా నా తిమ్మిరి నీకే పెట్ట
కురుడీ కొబ్బరీ నీదేలే మరీ
బుగ్గకు యెంగిలి కొట్టా నే గిచ్చితె జాబిలి పుట్టా
వస్తా జోలికీ వలచే వేలకీ
చూసాలే నీ వైపూ నే చెప్పాసాలే రైటూ
ఎదలోనే చోటు పెట్టా నువు నాలోఉండిపో
నా దమ్ము చూస్కో నీ కొమ్ము కాస్కో
కోరుకున్న కన్నె పిల్ల కొంగు పట్టుకో
ఆదుకున్న ఆడపిల్ల అందమందుకో
ఆపేదెవరూ అడిగేదెవరూ బాగా రెచ్చిపో
నడుముకి నలుగే పెట్టా
గిలిగింతల తాలం పుట్టా
నడకె మార్చవా నా గొదవే తీర్చవా
కంటికి ఆకలి పుట్ట
కనుపాపలకే చలి పుట్టా
జోలే పాడవా నీ జోరే చూపవా
చూసావేమో హైటు తెగ కొట్టెసావు సైటూ
ఇంకేలా రూటు మార్చా మనసే నీదిలే
దమ్ముంటె కాస్కో నీ సొమ్ము చేస్కో
హెయ్ దమ్ముంటె కాస్కో నీ సొమ్ము చేస్కో
కోరుకున్న కన్నె పిల్ల కొంగు పట్టుకో
ఆదుకున్న ఆడపిల్ల అందమందుకో
ఆపేదెవరు అడిగేదెవరూ అంతా దోచుకో
నా దమ్ము చూస్కో నీ కొమ్ము కాస్కో
అహ నా దమ్ము చూస్కో నీ కొమ్ము కాస్కో
దగ్గరొచ్చి బుగ్గలిచ్చి దండమెట్టుకో
సిగ్గులొచ్చి చీకటింట సున్నమెట్టుకో
ఆపేదెవరూ అడిగేదెవరూ బాగా రెచ్చిపో
******** ****** *******
చిత్రం: చినబాబు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , యస్.జానకి
చిక్కింది కమ్మనిన కన్నె లేడి
దక్కింది దాచుకున్న గిన్నె కోడి
దొంగా దొరికెరా దోరగా తేరగా
నా లిప్పు నీ లిప్పు లాకుప్పు
నీ హిప్పు నా హిప్పు లింకప్పు
ముద్దుగుమ్మ లంచమేదొ ముట్టజెప్పూ
యెత్తలే చేతులింక చిన్న బాబు
వేసెయ్యి బేడిలింక ఆగమాకూ
కైదీ చేసుకో గుండెలో నిండుగా
నా లిప్పు నీ లిప్పు లాకుప్పు
నీ హిప్పు నా హిప్పు లింకప్పు
ఇంతకంటె ఇవ్వమంటె తప్పు తప్పు
కన్నట్ట కొట్టంగానే చట్టం గారు పెట్టంటారు ముద్దెట్టు
ముద్దిట్ట పెట్టంగానే కాకి గారు పట్టేస్తారు ఓ పట్టు
అందం గా పుడితె నేరం
కౌగిలిలో కారగారం
సొగసులో కసిగా జరిగే సోదా
జరపనా మరి వెచ్చగ మత్తుగా
యెత్తలే చేతులింక చిన్న బాబు
వేసెయ్యి బేడిలింక ఆగమాకూ
నీడమ్మ ఇంటా బైటా కంటా తెచ్చి కోడై కూస్తే నా తప్పా
సోకమ్మ పైటె జారి పై పైకొచ్చి కైపెక్కిస్తే నా తప్పా
ఇకచాలూ ఈ సయ్యటా
సందిట్లో ఈ దొంగాట
తనువులే జతగా అతికే వేలా
కలిసిపో ఇక మెత్తగ మత్తుగ
చిక్కింది కమ్మనిన కన్నె లేడి
దక్కింది దాచుకున్న గిన్నె కోడి
కైదీ చేసుకో గుండెలో నిండుగా
నా లిప్పు నీ లిప్పు లాకుప్పు
నీ హిప్పు నా హిప్పు లింకప్పు
నా లిప్పు నీ లిప్పు లాకుప్పు
నీ హిప్పు నా హిప్పు లింకప్పు
******** ****** *******
చిత్రం: చినబాబు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
చూ మంతర్ చుగాలి మంతర్
చూ మంతర్ చుగాలి మంతర్
చూస్తుంటేనె జంతర్ మంతర్
మై డియర్ నేస్తం లా ల ల ల లా లా
అందుకో హస్తం లా ల ల ల లా లా
ఇది మాయ లోకం ఒక పద్మ వ్యూహం
గమ్యమొక స్వర్గం స్నేహమే మార్గం
చూ మంతర్ అహ చుగాలి మంత్ర
అహ చూస్తెంటేనె అరె జంతర్ మంతర్
ఆ పక్క పార్లమెంటూ ఈ పక్క పర్టి టెంటు
మన నోట కొబ్బ దంటూ మ రూటు పేవుమెంటూ
బాపు త్యాగం ప్రతి రూపం
రాజ ఘాటు ఒక మణి దీపం
పండిత నెహ్రు శ్మ్రుతి చిహ్నం
సుందర నిలయం శాంతి వనం
నమ్మక ద్రోహుల కిరాతకానికి
ఆత్మార్పన స్తలీ శక్తి స్తలం
ఆదర్సాలకు పోయమంటే గురూ
మిగిలేవన్ని సమాదులూ
ఆచరించితే ఆదర్షాలే పునోబి వ్రుద్దికి పునాదులూ
మై డియర్ నేస్తం లా ల ల ల లా లా
అందుకో హస్తం లా ల ల ల లా లా
విదేసాలలో రుణాలు స్వదేసాలలో రణాలు
నోరే మెదపని జనాలు మన బడా నాయకుల వరాలూ
మూడు వైపులా సముద్రమూ
నాలుగు వైపుల దరిద్రమూ
దేషం ద్యేయం శాంతి పదం
రక్త సిక్తమే ప్రతి ఉదయం
పట్ట తప్పి వెనక్కి వెల్లే
గూడ్స్ బండి రా మన ప్రగతీ
పడిపోకుండా కాపాడందని యువతరానికే నా వినతీ
చూ మంతర్ అహ చుగాలి మంత్ర
అహ చూస్తెంటేనె అరె జంతర్ జంతర్ మంతర్
మై డియర్ నేస్తం లా ల ల ల లా లా
అందుకో హస్తం లా ల ల ల లా లా
ఇది మాయ లోకం ఒక పద్మ వ్యూహం
గమ్యమొక స్వర్గం స్నేహమే మార్గం