చిన్నారి చిన్నారి చిలుకా… లిరిక్స్
సంగీతం: రవి కళ్యాణ్
సాహిత్యం: సింధూరం రమేష్
గానం: శ్వేతా నాగరాజు
నిర్మాణం : లలితా ఆడియోస్ & వీడియోస్
విడుదల తేది: 19.03.2017
చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె ఎండమావి కాగా..
నేను మిగిలున్నాను, నువ్వే లేక ప్రాణం లేని రాయిలా..
కళ్ళల్లో కన్నీరు లేదురా.. నా ఊపిరాగిపోగా..
నేను బ్రతికున్నాను, సూర్యుడు లేని నీలాల ఆ నింగిలా..
ఆ.. ఆ.. అ ఆ.. అ ఆ.. ఆ.. అ అ అఅఆ.. అ అఅఆ.. అ
నువ్వు నా ప్రేమలో ఓడి, నన్ను గెలిచేందుకే వనవాసం చేస్తుంటే..
ఎన్ని తలలైన నరికేసి, యుద్ధాన్ని నువ్వు గెలిచి తిరిగొస్తావనుకున్నా..
మన మూడేళ్ల ప్రేమను, మూనాళ్ల ముచ్చట చేసిన పరమేశున్నే..
నా కన్నీటి రక్తంతొ, కాళ్ళను కడుగుతూ నే వేడుకుంటున్నా..
ఏ జన్మమైన, నీలో సగమే నేనూ…
మరణాన్నైనా.. నీ చెయ్యి నే వీడనూ…
చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె ఎండమావి కాగా..
నేను మిగిలున్నాను, నువ్వే లేక ప్రాణం లేని రాయిలా..
కళ్ళల్లో కన్నీరు లేదురా.. నా ఊపిరాగిపోగా..
నేను బ్రతికున్నాను, సూర్యుడు లేని నీలాల ఆ నింగిలా..
ఆ.. ఆ.. అ ఆ.. అ ఆ.. ఆ.. అ అ అఅఆ.. అ అఅఆ.. అ
నీ ఆస్తి అంతస్థులందం, చందం నాకంటు ఏమొద్దురా..
చెట్టు నీడైన నేనుంట, నీ గుండెపై నాకు చోటింత ఇవ్వరా..
నీకు అమ్మ నాన్నల ప్రేమలు లేవని, అమ్మల్లే నే మారినా..
ఎన్ని ముళ్ళుల చుట్టున్న నీకోసమే నడిచి రక్తపు వరదై ఇలా..
అయినా.. నేను, నీకిక ఇంకేం కానూ…
చితిలో మంటై, కాలుతు మిగిలున్నానూ…
చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె ఎండమావి కాగా..
నేను మిగిలున్నాను, నువ్వే లేక ప్రాణం లేని రాయిలా..
కళ్ళల్లో కన్నీరు లేదురా.. నా ఊపిరాగిపోగా..
నేను బ్రతికున్నాను, సూర్యుడు లేని నీలాల ఆ నింగిలా..
మ్.. మ్.. మ్.. ఆ..ఆ..అ ||2||
ఏ మంత్రం తంత్రం మాయలు మర్మాలు, నే నమ్మబోనురా..
ఆ దేవుళ్ళ చుట్టూనే తిరిగి మొక్కింది, నీ ప్రేమ కోసంరా..
నిన్ను నా గుండెపై నుండి చెరిపేందుకే, కన్నవాళ్ళు ఏ మాటన్నా..
నా కన్నీటితో ఆ నిందల్ని చెరిపాను, పాల కడలి నువ్వనీ..
గతమే నువ్వు, నా కుల మతమే నువ్వూ…
కథవే నువ్వు, నా అణుఅణువే నువ్వూ…
చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె ఎండమావి కాగా..
నేను మిగిలున్నాను, నువ్వే లేక ప్రాణం లేని రాయిలా..
కళ్ళల్లో కన్నీరు లేదురా.. నా ఊపిరాగిపోగా..
నేను బ్రతికున్నాను, సూర్యుడు లేని నీలాల ఆ నింగిలా..
ఆ.. ఆ.. అ ఆ.. అహ ఆ.. ఆ.. అహ అ అఅఆ.. అ అఅఆ.. అ
నా పదహారేళ్ల వయసు ప్రేమలో, ఆనాడు లోతింత లేకున్నా..
నువ్వు దూరమైన ప్రతిరోజుని, శూన్యంలో గాయమై మిగిలున్నా..
ఆ నింగి నేలా, వాగు వంక రంగులు శాశ్వతం
నా కన్నులు చూసే, ఏడేడు జన్మల్లో నువ్వే శాశ్వతం
ఏ దేవుడితో, నా మరణం పంపనూ…
మళ్ళీ నీతో, ఏ జననం చేర్చునో…
చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె ఎండమావి కాగా..
నేను మిగిలున్నాను, నువ్వే లేక ప్రాణం లేని రాయిలా..
కళ్ళల్లో కన్నీరు లేదురా.. నా ఊపిరాగిపోగా..
నేను బ్రతికున్నాను, సూర్యుడు లేని నీలాల ఆ నింగిలా..
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****