చిన్నారి చిన్నారి చిలుకా… లిరిక్స్
సంగీతం: రవి కళ్యాణ్
సాహిత్యం: సింధూరం రమేష్
గానం: అనిత నాగరాజు
నిర్మాణం : లలితా ఆడియోస్ & వీడియోస్
విడుదల తేది: 31.03.2016
చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె గుడి విడిపోకే..
నువ్వు వెళ్ళేదారి గోదారల్లే.. పొంగి నన్ను ముంచెనే..
కళ్ళల్లో కన్నీటి చినుకా.. నన్ను కాలదూసిపోకే..
నా గుండెల్లో నిండెను నువ్వేలేక కన్నీటి సంద్రమే..
ఈ లోకం, నిన్ను నన్ను చూసి రాముడు సీతంటే..
నాకు వనవాసముందని, అనుకోలేదే పక్కన నువ్వుంటే..
మన మూడేళ్ల ప్రేమను, మూనాళ్ల ముచ్చట చేసిన పరమేశుడే..
నా కన్నీటి గంగను, శిరమున నింపగ వరమల్లె నిన్ను పంపెనే..
ఎదలో నువ్వే… నా తొలి కథలో నువ్వే…
తనువే నువ్వే… నా అణుఅణువే నువ్వే…
చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె గుడి విడిపోకే..
నువ్వు వెళ్ళేదారి గోదారల్లే.. పొంగి నన్ను ముంచెనే..
కళ్ళల్లో కన్నీటి చినుకా.. నన్ను కాలదూసిపోకే..
నా గుండెల్లో నిండెను నువ్వేలేక కన్నీటి సంద్రమే..
ఏ ఆస్తి అంతస్థులందం, చందం ఉన్నా లేకున్నా..
రెండు మనసుల మధ్యన, వెలుగులు పంచిన గుడ్డిది నీ ప్రేమ..
నా కన్నీటి చుక్కలు, రక్తపు వరదల్లె నా గుండె కోస్తున్నా..
నువ్వు వెళ్ళేదారిలో, ముళ్లను పూలుగ మార్చింది నా ప్రేమ..
నిజమే మరిచి, నన్నే వెలివేయకే…
తీయని విషమా.. నన్నే ఉరితీయకే…
చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె గుడి విడిపోకే..
నువ్వు వెళ్ళేదారి గోదారల్లే.. పొంగి నన్ను ముంచెనే..
కళ్ళల్లో కన్నీటి చినుకా.. నన్ను కాలదూసిపోకే..
నా గుండెల్లో నిండెను నువ్వేలేక కన్నీటి సంద్రమే..
నే అమ్మ నాన్నల ప్రేమలు లేకే నే ఒంటరయ్యానే..
నీ కన్నావారిని దూరం చేసే పాపం నాకొద్దనే..
నీ కన్నుల్లో నవ్వుల వెన్నెల చిందే పౌర్ణమి ఉండాలనే..
నా కళ్ళను పొడిచేసి చీకట్లు నింపాను అమవాస్య రేయల్లే..
ఓ బంధమా.. నను భందిగ మార్చకే…
అనుబంధమా.. నన్నే చెరిపెయ్యకే…
చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె గుడి విడిపోకే..
నువ్వు వెళ్ళేదారి గోదారల్లే.. పొంగి నన్ను ముంచెనే..
కళ్ళల్లో కన్నీటి చినుకా.. నన్ను కాలదూసిపోకే..
నా గుండెల్లో నిండెను నువ్వేలేక కన్నీటి సంద్రమే..
హో..హో..హొహో.. ||3||
ఈ సింధూర గుండెల్లో మందారమై పూసే, సిరిమల్లె పువ్వు నువ్వనీ..
నీ పాదాలు ముద్దాడి మట్టల్లే నలిగాను, ఈ జన్మ నీదేననీ..
ఏ మంత్రం తంత్రం మాయలు మర్మాలు, నా ప్రేమకవి తెలియవే..
నిన్ను నాతోనే కలిపింది నా వైపు నడిపింది, ప్రేమన్న నమ్మకమే..
కదిలే గతమా.. నాలో ప్రాణం నువ్వే…
ఓ అంతమా.. నా తొలి మరణం నువ్వే…
చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె గుడి విడిపోకే..
నువ్వు వెళ్ళేదారి గోదారల్లే.. పొంగి నన్ను ముంచెనే..
కళ్ళల్లో కన్నీటి చినుకా.. నన్ను కాలదూసిపోకే..
నా గుండెల్లో నిండెను నువ్వేలేక కన్నీటి సంద్రమే..
ఆ.. ఆ.. అఅ ||3||
తన కాళ్ళను తడపక సంద్రాలెన్నో దాటే ఈ మనిషీ..
తన కళ్ళను తడపక జీవితమన్నది గెలవడని తెలిసీ..
నిన్ను ప్రేమించానే, నే పూజించే దేవతగా యెంచి
నువ్వు వెళ్ళొద్దే చెలి, కాదని నన్నే మొగ్గల్లే తుంచి
చితిలోనైనా.. నీ జత నే వీడనే…
మరణాన్నైనా.. నీకై ఎదిరిస్తానే…
చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె గుడి విడిపోకే..
నువ్వు వెళ్ళేదారి గోదారల్లే.. పొంగి నన్ను ముంచెనే..
కళ్ళల్లో కన్నీటి చినుకా.. నన్ను కాలదూసిపోకే..
నా గుండెల్లో నిండెను నువ్వేలేక కన్నీటి సంద్రమే..
నన్ను పెంచిన దైవం, నే చేరలేనంత దూరం వెళ్ళినా..
నా జీవిత లక్ష్యం చేర్చిన దేవత నువ్వనుకున్నానే..
నా ఒంటకి తగిలిన గాయాలెన్నైన గుర్తుకు రావస్సలే..
నువ్వు చేసిన మోసం, గాయమైన నేడు జన్మల్లో వెంటాడునే..
ఓ మౌనమా.. చావే విడదీయదే…
అందని వరమా.. నన్నే కాల్చేయకే…
చిన్నారి చిన్నారి చిలుకా.. గుండె గుడి విడిపోకే..
నువ్వు వెళ్ళేదారి గోదారల్లే.. పొంగి నన్ను ముంచెనే..
కళ్ళల్లో కన్నీటి చినుకా.. నన్ను కాలదూసిపోకే..
నా గుండెల్లో నిండెను నువ్వేలేక కన్నీటి సంద్రమే..
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
I want female version song lirics.
Thank you so much.
[email protected]