Chiru Navvuto (2000)

చిత్రం: చిరునవ్వుతో (2000)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: వేణు తొట్టెంపూడి , షాహీన్ ఖాన్
కథ, మాటలు ( డైలాగ్స్ ): త్రివిక్రమ్ శ్రీనివాస్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి. రాంప్రసాద్
సినిమాటోగ్రఫీ: కె.ప్రసాద్
బ్యానర్: యస్.పి.ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత: శ్యామ్ ప్రసాద్
విడుదల తేది: 10.11.2000

చిత్రం: చిరునవ్వుతో (2000)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:  సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మ
ఆ సంగీతం నీతోడై సాగవె గువ్వమ్మ
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
చుట్టమల్లె కష్టమొస్తె కళ్ళనీళ్ళు పెట్టుకుంటు
కాళ్ళు కడిగి స్వాగతించకు
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేనిపోని సేవ చెయ్యకు
మిణుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలుకద
ముసురుకునే నిసి విలవిలలాడుతు పరుగులు తీయద
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ
నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైన అందులోనె ఉంటూ
లేవకుండ ఉండగలమా
కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవె చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Aadu Magaadra Bujji (2013)
error: Content is protected !!