చిత్రం: చిరుజల్లు (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్, విశాల
నటీనటులు: తరుణ్ కుమార్, రీచా
దర్శకత్వం: శ్రీరామ్
నిర్మాత: జి.వి.జి.రాజు
విడుదల తేది: 17.08.2001
పల్లవి:
కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా
విరిసింది హరివిల్లు నీ చిరునవ్వుల్లా
చినుకుల్ని స్వాగతించే ఈ మట్టి వాసనలా
చిగురుల్నే మేలుకొలిపే సరికొత్త సరిగమల
చిన్ననాటి అల్లర్ల తడి జ్ఞాపకంలా
కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా
చరణం: 1
నీ సరదాలన్నీ నా గుండెల్లో గువ్వలై వాలని
నీ కిలకిలలన్నీ నా కన్నుల్లో పువ్వులై విరియని
దివినుంచి తారకలన్ని దిగివచ్చేనా
మనకోసం వరములు ఎన్నో అందించేనా
ఆశలకే అవానమై నిను పిలిచా ఆషాడమై
పురివిరిసే మయూరమై బదులిచ్చా నీకోసమై
ఆ బదులే నా మదికి ముత్యాల జల్లు
కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా
చరణం: 2
నా ఏకాంతంలో వినిపించాయి ఘల్ అని మువ్వలు
నీ సావాసంలో చిగురించాయి ఝల్లనే ఊసులు
నువుమీటిన సంతోషాల శ్రావణవీణ
నిలువెల్లా కరిగిస్తుంది అనురాగాన
అడుగులలో నయాగర కనిపించే ఉత్సహమై
ఎద సడిలో సుధా స్వరం పలికించే సంగీతమై
మనసంత మురిపించె ఈ తేనె ముళ్ళు
కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా
చినుకుల్ని స్వాగతించే ఈ మట్టి వాసనలా
చిగురుల్నే మేలుకొలిపే సరికొత్త సరిగమల
చిన్ననాటి అల్లర్ల తడి జ్ఞాపకంలా
విరిసింది హరివిల్లు నీ చిరునవ్వుల్లా