Chitram (2000)

చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: నిహాల్, సందీప్, ఆర్ పి పట్నాయక్, రవి వర్మ, గాయత్రి, ఉత్తేజ్
నటీనటులు: ఉదయ్ కిరణ్, రీమా సేన్
దర్శకత్వం: తేజ
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 24.05.2000

అన్నయ్యా కుక్క కావాలి కుక్క కావాలి
వినరా బ్రదరూ అయోధ్యనేలే రాముని స్టోరీ
దశరధ రాజుకు వారసుడు
సకల శాస్త్రాల కోవిదుడు
అస్త్రవిద్యలో ఫస్టతడు
మంచి గుణాల లిస్టతడు
ఎట్లుంటడో ఎరికెనా
బ్లూకలర్ల మస్తుగుంటడు
లక్ష్మణుడని బ్రదరున్నాడు
అన్నకి అండగ నిలిచాడు
సెల్ఫిష్ నెస్సుని విడిచాడు
సేవే గొప్పని తలచాడు

ఈనా బ్లూకలరేనా
బ్రదర్సు ఒకటేగాని కలర్సు వేర్రా నాని
దమాక్ ఖరాబైందా ఏం సార్ నీకు
అన్నదమ్ములేమో ఒకటంటావ్
రంగులేమో అలగలగ్ అంటావ్
కత మంచిగ చెప్పుర్రి సార్ నీకు దండం పెడ్త

సీతాదేవను వైఫు ఉన్నది
రామునితోనే లైఫు అన్నది
హానెస్టి తన వైనమన్నది
ఫారెస్టునకే పయనమైనది
రాముని సేవకు తొలిబంటు
అతిబలవంతుడు హనుమంతు
నమ్మిన బంటుగ రాముని పదముల చెంతే ఉంటాడు
పదముల చెంతే ఉంటాడు
సూన్నీకి కోతి లెక్కుంటడు గానీ రామసామిని ఎవ్వడన్నా ఎమన్నా అన్నాడనుకో
కుక్కని కొట్టినట్టు కొడతాడు
ఆ… కుక్క కుక్క కావాలి కుక్క కావాలి

అసలు నిన్నెవడ్రా ఆమాటనమంది
వీడ్ని నోరు మూసి పక్కకి లాక్కెళ్ళండ్రా నోరిప్పనీయద్దసలు

అతల వితల సుతల తలాతల
రసాతల పాతాళ లోకములయందు
అవిక్రమ పరాక్రమవంతుడు
కురువంశొద్భవుండు సుయోధనుండు
రారాజు సోదరులు హండ్రెడు తకతకిట
ఆ పాండవులతో ఉండరు తకతకిట
వాటాలలోన వాదమొచ్చిందీ
బిగ్ వారు దాకా తీసుకొచ్చిందీ

ద్రౌపది వస్త్రాపహరణం ఆపలేదెవరూ దారుణం
పులిలాగ భీమన్న లంఘించినాడు
బలశాలి కోపంతొ కంపించినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినా
రారాజు గుండెల్ని చీల్చుతానంటూ
నిండు సభలో తాను ప్రతిన పూనాడు

క్లైమాక్స్ల ఫైటింగ్ షురు ఐంది
భీముడు గద తీసిండు పిసికిండు
దుర్యొధనుడు భీ గద తీసిండు పిసికిండు
ఎవ్వరి తొడలు ఆల్లాల్లు కొట్టుకున్నరు
ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు
ఈడు తలకాయ మీద కొడ్తె
ఆడు కాల్ మీద కొట్టిండు
ఈడు కాల్ మీద కొడ్తె
ఆడు తలకాయ మీద కొట్టిండు
కొట్టిండు కొట్టిండు
అరె ఎంతైనా భీముడు హీరొ కదబై
దుర్యొధనుడు ఖాళీ విలన్
ఎమైతది భీముని చేత్ల కుక్క సావు సచ్చిండు
ఆ…కుక్క కుక్క కావాలి కుక్క కావాలి

అయ్యొ మళ్ళి గుర్తుచేసాడ్రా
నువ్వు చెప్పు నువ్వు చెప్పు
ఒరే శ్రీశైలం మద్యలో వచ్చుడు కాదుగాని
నువ్వు చెప్పురా

అరెరె చిన్న పోరన్కి కతచెప్పనీకొస్తల్లేదు
ఎం చదువుకున్నార్ వయ్యా మీరు
ఇస్టోరి నే చెప్తా చెవులు పెట్టి ఇనుండ్రి

ఏడేడు లోకాల యాడుంది అంతటి అందం ఓయమ్మ
పుత్తడి బొమ్మల్లె ఉంటుంది బ్రదరూ బాలనాగమ్మ

జంతరు మంతరు మోళీ చేసే మరాఠ మాంత్రికుడు మాయల ఫకీరు వంచకుడు
అందరిలోన సుందరికోసం దుర్భిణి వేసాడు
ఎన్నో ప్లానులు గీసాడు
దుర్భిణిలోన బాలనాగమ్మ రూపం కనిపించి ఆమెను ఇట్టే మోహించీ
బెగ్గరు వేషం వేసుకొచ్చాడు జిత్తుల మాంత్రికుడు మాయల పకీరు వంచకుడు

గప్పుడేమైందో ఎరికెనా
మాయల ఫకీరుగాడు తన చేతిలో ఉన్న మంత్రం కట్టెతోని
బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసిండు
గంతే బాలనాగమ్మ మారిపోయింది
ఎలా మారిపోయింది అరె చెప్తున్నాగ మారిపోయింది
అదే ఎలా మారింది అరె చెప్తున్నాగ టాప్ టు బాటం మారిపోయింది
చెప్తావా లేదా నే చెప్ప
చెప్తావా లేదా  ఏంది కొడ్తరా
ఆ అందరు కొడ్తారా
ఎం డౌటా అబ్బె డౌటేంలె చెప్పినా చెప్పకున్న కొడ్తారు
మాటర్ అసుంటిది
మీ చెతులల్ల నే చావనీకి కుక్క లెక్క మారిందిబై
కుక్క కావాలి కుక్క కావాలి కుక్క కావాలి

*********   **********   ***********

చిత్రం: చిత్రం (2000)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: నిహాల్, ఉష

ఊహల పల్లకీలో ఊరేగించన
ఆశల వెల్లువై రాగం పలికించనా
ఊహల పల్లకీలో ఊరేగించన
ఆశల వెల్లువై రాగం పలికించనా
కలహంసై కబురులు నింపనా
రాచిలకై కిలకిల నవ్వనా
నా పెదవుల మధువులె ఇవ్వనా
సయ్యాటలోనా…

ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా

ప్రేమలో తీపి చూసే వయసే నీదిరా
బ్రతుకులో చేదులున్నా భయమే వద్దురా
సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా
పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా
సిరి తానుగానే వచ్చి నిన్ను చేరునురా…

ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా

మేఘాలకు నిచ్చెనె వేయన
ఆకాశపుటంచులే వంచన
ఆ జాబిలి కిందకే దించనా…
నా కన్నెకూనా…

ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా

ఆశగా పల్లవించే పాటే నీవులే
జీవితం తోడులేని మోడే కాదులే
కలిసుండె వేళలో కలతంటు రాదులే
అమవాసై పోదులే అడియాసే కాదులే
చిరు దివ్వె గొంతు ఇంక దారి చూపునులే

ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా

మేఘాలకు నిచ్చెనె వేయన
ఆకాశపుటంచులే వంచన
ఆ జాబిలి కిందకే దించనా
నా కన్నెకూనా…

ఊహల పల్లకీలో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Naalo Unna Prema (2001)
error: Content is protected !!