చిట్టికూన చిట్టికూన… లిరిక్స్
చిత్రం: మా ఆయన బంగారం (1997)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఎస్.పి.బాలు, ఎస్. జానకి
నటీనటులు: రాజశేఖర్, సౌందర్య, కస్తూరి
దర్శకత్వం: ఎ.మోహన్ గాంధీ
నిర్మాణం: పోకూరి బాబూరావు
విడుదల తేది: 30.05.1997
చిట్టికూన చిట్టికూన
ఊరుకో రా చిన్ని నాన్న
కొడుకో బంగారు మా రాజా…
చిట్టికూన చిట్టికూన
ఊరుకో రా చిన్ని నాన్న
కొడుకో బంగారు మా రాజా…
నాకంటి తళుకా నా ఇంటి ఎలుగా
ఎన్నెల్లో మొలక ఎందుకో అలక
బంగారు కనికా బావురు మనక
బజ్జో రా బుజ్జి నాయనా…
జో జో కన్నయ్య జోలాలి కన్నయ్యా..
జో జో కన్నయ్య జోలాలి కన్నయ్యా..
చిట్టికూన చిట్టికూన
ఊరుకో రా చిన్ని నాన్న
కొడుకో బంగారు మా రాజా…
సిరిమల్లె సిరిమల్లె వెన్నెలమ్మ
సీమంతమాడెను చూడరమ్మ
గంగమ్మ గౌరమ్మ రా రండమ్మ
సింధూర గంధాలు పూయండమ్మ
పట్టు చీరె గట్టి పట్టెడు పూలే పెట్టి
చల్లగ దీవించ రా రండమ్మా
మా.. ఆఆ.. ముద్దు తీరేలా
రా.. మువ్వ గోపాలా..
బంగారు బొమ్మంటి ఈ తల్లి చేతుల్లో
బొమ్మవి కావాలీ…
అమ్మకు మరో జన్మను ఇచ్చే బ్రహ్మవి కావాలి
తెలుసా.. ఆఆ.. నలుసా.. ఆఆ..
ఆరారు నీకు బువ్వెట్టుకుంటా
నీ ఊసులింటూ ఊ కొట్టుకుంటా
జోలాలి అంటూ జో కొట్టుకుంటా
కదలకు రా కడుపులో అలా..
పొద్దింక పోలేదా? నిద్దర పోవెరా?
ఒద్దింక ఈ గోలా.. ఒద్దిగ్గ బజ్జో రా..
చిట్టికూన చిట్టికూన
ఊరుకో రా చిన్ని నాన్న
కొడుకో బంగారు మా రాజా…
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలీ పరమానంద రామ గోవిందా
నీ… బోసి నవ్వుల్లో…
మా సిరులు చిందేలా
చిల్లకల్లు కోయిళ్ళు శిరసొంచుకోవాలి
నీ ముద్దు మాటవిని
నూరేళ్లు ఈ ఇల్లు శిరసెత్తుకోవాలి
నీలాంటి దొరని గని…
అవునా.. ఆ ఆ.. కూనా.. ఆ ఆ..
అయ్యను బాగా అల్లరి చేద్దాం
ఏనుగు తెమ్మని ఏడిపిద్దాం
కాదంటే ఊరంతా గోల చేద్దాం
నువ్వు నా జట్టు కట్టరా.. ఆ..
అల్లో నేరెల్లో.. అల్లారు ముద్దుల్లో..
కేరింత నవ్వుల్లో.. ఓ మాగుండె సవ్వల్లో..
చిట్టికూన చిట్టికూన
ఊరుకో రా చిన్ని నాన్న
కొడుకో బంగారు మా రాజా…
నాకన్న కొడుకో కళ్ళల్లో ఎలుగో
ఎలిగించు లైటో ఎండి గలాస్సో
లాంపు తీగో లవంగి మొగ్గో
హైలో బంగారు మారాజా…
జో జో కన్నయ్య జోలాలి కన్నయ్యా..
జో జో కన్నయ్య జోలాలి కన్నయ్యా..
హ్మ్ మ్ హ్మ్ మ్ మ్ మ్
హ్మ్ మ్ హ్మ్ మ్ హ్మ్ మ్
ఆహా.. ఆ ఆ..
ఆహా.. ఆ ఆ..
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
song not showing
Dear Shiva, Its only audio in video format. If you need video song we will update or just visit youtube original source and Other Original sources. Thanks 🙂
I like you
seetha ramuni kosam songs lo laali laali song upload cheyandi
👍