Choodalani Vundi (1998)

చిత్రం: చూడాలని ఉంది (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, సుజాత
నటీనటులు: చిరంజీవి, సౌందర్య, అంజలి జవేరి
దర్శకత్వం: గుణశేఖర్
నిర్మాత: సి.అశ్వనీ దత్
విడుదల తేది: 11.09.1998

అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు
అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు
చలిపులి పంజా విసిరితే
సలసల కాగే వయసులో
గిలగిలలాడే సొగసుకే జోలాలీ

అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు

చరణం: 1
వాటేసుకో వదలకు వలపుల వల విసిరి
వాయించు నీ మురళిని వయసుగాలి పోసి
దోచెయ్యనా దొరికితే దొరకని కోక సిరి
రాసేయ్యనా పాటలే పైటచాటు చూసి
ఎవరికి తెలియవు ఎద రస నసలు
పరువాలాటకు పానుపు పిలిచాకా
తనువు తాకిన తనివి తీరని వేళా

అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు

చరణం: 2
జాబిల్లితో జత కలు జగడపు రగడలతో
పొంకాలతో నిలు నిలు పొగడమాలలేసి
ఆకాశమే కులుకులు తొడిమెడు నడుమిదిగో
సూరీడునే పిలుపిలు చుక్కమంచు సోకి
అలకల చిలకలు చెలి రుసరుసలు
ఇక జాగెందుకు ఇరుకున పడిపోకా
మనసు తీరినా వయసులారని వేళా

అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు
చలిపులి పంజా విసిరితే
సలసల కాగే వయసులో
గిలగిలలాడే సొగసుకే జో లాలీ

అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు
అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు

**********   **********   **********

చిత్రం: చూడాలని ఉంది (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా
రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
ముక్కుమీద తీపి కోపాలా
మూగ కళ్ళ తేనె దీపాల
గంగూలి సందులో గజ్జలగోల
బెంగాలి చిందులో మిర్చిమసాలా
అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
మేడెక్కి దిగదురా మేఘమాలా

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా

చరణం: 1
గోపెమ్మో గువ్వలేని గూడు కాకమ్మో
క్రి ష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో
దొంగిలించుకున్న సొత్తు గోవిందా
ఆవులించకుంటే నిద్దరౌతుందా
ఉట్టి కొట్టే వేళా రైకమ్మో
చట్టి దాచి పెట్టు కోకమ్మో
క్రిష్ణా మురారి వాయిస్తావో
చలి కోలాటమేదో ఆడిస్తావో
అరె ఆరారే భయ్యా బన్షి బజావో
అరె ఆంధ్రాక నయ్యా హాత్ మిలావో

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా

చరణం: 2
ఓలమ్మో చోళీలోన సోకు గోలమ్మో
ఓయమ్మో ఖాళీ లేక వేసే ఈలమ్మో
వేణువంటే వెర్రి గాలి పాటేలే
అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే
జట్టే కడితే జంట రావమ్మో
పట్టు విడువు ఉంటే మేలమ్మో
ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టాలా
పెళ్లాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా
అరె ఆయారే బన్షికే ఆంధ్రావాలా
అరె గావోరె విందు చిందు డబ్లీ గోల

రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
ముక్కుమీద తీపి కోపాలా
మూగ కళ్ళ తేనె దీపాల
గంగూలి సందులో గజ్జలగోల
బెంగాలి చిందులో మిర్చిమసాలా
అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
మేడెక్కి దిగదురా మేఘమాలా

**********   **********   **********

చిత్రం: చూడాలని ఉంది (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్

సరిమామగారి సససనిదపసా
సరిమామగారి సససనిదపసా
రిమదానిదాప సాసనిదప మదపమరి

యమహానగరి కలకత్తా పురి
యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
యమహానగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి

యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి

చరణం: 1
నేతాజీ పుట్టిన చోట
గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో
ఆ హంస పాడిన పాటే
ఆనందుడు చూపిన బాట సాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకుతో వెయ్యి పందెం
కడకు చేరాలి గమ్యం కదిలిపోరా
ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజి బిజి ఉరుకుల పరుగులలో

యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి
యమహానగరి కలకత్తా పురి

చరణం: 2
బెంగాలీ కోకిల బాల
తెలుగింటి కోడలుపిల్ల మాలిని సరోజిని
రోజంతా సూర్యుడి కింద
రాత్రంతా రజనీగంధ సాగనీ
పదుగురు ప్రేమలే లేని లోకం
దేవతా మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కథలకు నెలవట కళలకు కొలువట
తిథులకు సెలవట అతిథుల గొడవట
కలకట నగర పు కిటకిటలో

యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి
యమహానగరి కలకత్తా పురి

చరణం: 3
వందేమాతరమే అన్న
వంగ భూతలమే మిన్న జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ
చోరంగి రంగుల దునియా నీదిరా
విను గురు సత్యజిత్‌రే సితార
యస్ డి బర్మన్ కీ ధారా
థెరీసా కీ కుమారా కదలిరారా
జనగణమనముల స్వరపద వనముల
హృదయపు లయలను శ్రుతి పరిచిన
ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో

యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
యమహానగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి

యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి

**********   **********   **********

చిత్రం: చూడాలని ఉంది (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు , సుజాత

మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం
వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవ్వాళ చెప్పడం
నువ్వను కోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా
నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా
ఇది అందమైన వింత ఆత్మ కథ

మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం
వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవ్వాళ చెప్పడం
నువ్వను కోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా
నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా
ఇది అందమైన వింత ఆత్మ కథ

చరణం: 1
హంస గీతమే వినరాద హింస మానరా మధన
తెల్లవారిన తరువాత తెల్లబోకుమా లలనా
ఇపుడే విన్నాను చెలి వేణువేదో
నిదరే ఇక రాదు లేవమ్మా
చెవులే కొరికింది చెలిమింటి మాట
ఎదలో ఇక దాచలేవమ్మా
పూల గాలికే పులకరం
గాలి ఊసుకే కలవరం
కంటి చూపులో కనికరం
కన్నె వయసుకే  తొలివరం
మొదలాయె ప్రేమ క్లాసు రాగసుధా

మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం
వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవ్వాళ చెప్పడం

చరణం: 2
రాయలేనిది ప్రియలేఖ రాయభారమే వినవా
వేదమంటివి శుభలేఖ  వెన్నెలంటని కలువ
పురులే విరిసింది నీలో వయ్యారం
కనులే తెరిచిందిలే పించం
వెలిగే నీలోన గుడిలేని దీపం
ఒడిలో తీరింది ఆ లోపం
ఎంకి పాటలో తెలుగులా
తెలుగు పాటలో  తేనెలా
కలవనీ హాల మమతల
తరగనీ ప్రియ కవితలా
బహుశా ఇదేమొ భామా ప్లస్ కదా

మనస్సా ఎక్కడున్నావ్ ఇదేనా రావడం
వయస్సా ఎప్పుడొచ్చావ్ ఇవ్వాళ చెప్పడం
నువ్వను కోలేదు గుసగుసలు ఎన్నో వింటున్నా
నేననుకోలేదు మిసమిసలు నాలో పుడుతున్నా
ఇది అందమైన వింత ఆత్మ కథ

**********   **********   **********

చిత్రం: చూడాలని ఉంది (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, కవితా క్రిష్ణమూర్తి

ఓ మారియా ఓ మారియా
ఓ మారియా ఓ మారియా
రేపన్నది మాపన్నది
పనికి రాదులే ఓ మారియా
ప్రతి రోజు విలువైంది కాదా
ప్రయత్నిస్తే గెలుపేదో రాదా
చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు
అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు

ఓ మారియా ఓ మారియా
ఓ మారియా ఓ మారియా
రేపన్నది మాపన్నది
పనికి రాదులే ఓ మారియా
ప్రతి రోజు విలువైంది కాదా
ప్రయత్నిస్తే గెలుపేదో రాదా
చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు
అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు

సిరిమువ్వ రేపంటు వెనుదీస్తుందా
ఘల్ ఘల్ ఘల్ మోగించగా
సిరిమల్లె మాకంటు ముసుగేస్తుందా
ఘుం ఘుం ఘుం పంచివ్వగా
ప్రతీదినం ప్రభాతమై వరాలు తెచ్చే సూర్యుడు
ప్రకాశమే తగ్గించునా నావల్ల కాదంటూ
ప్రతీక్షణం హుషారుగా శ్రమించి సాగే వాగులు
ప్రయణమే చాలించునా మాకింక సెలవంటూ
హే ఉల్లాసంగ ఉత్సహంగ బ్రతుకే సాగని
అంతేలేని సంతోషాలు ఒళ్ళో వాలని

ఓ మారియా ఓ మారియా
ఓ మారియా ఓ మారియా
హే రేపన్నది మాపన్నది
పనికి రాదులే ఓ మారియా

చిరుగాలి చిత్రంగ రానంటుందా
ఝం ఝం ఝం పయనించగా
కొమ్మల్లో కోకిల్ల కాదంటుందా
కు కు కు వినిపించగా
నిరంతరం దినం దినం
అలాగే సహనం చూపుతూ
విరామమే లేకుండా ఈ నేల తిరుగునుగా
ఆకాశమే అందాలని చిన్నారి రెక్కల గువ్వలు
అనుక్షణం అదే పనై ఆరాట పడిపోవా
హే మనసే ఉంటె మరణం తానే ఎదురొస్తుందిలే
సత్తా ఉంటె స్వర్గం కూడా దిగి వస్తుందిలే

ఓ మారియా ఓ మారియా
ఓ మారియా ఓ మారియా
హే రేపన్నది మాపన్నది
పనికి రాదులే ఓ మారియా
ప్రతి రోజు విలువైంది కాదా
ప్రయత్నిస్తే గెలుపేదో రాదా
చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు
అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు

**********   **********   **********

చిత్రం: చూడాలని ఉంది (1998)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు , చిత్ర

సింబలే హల్లెలే సింబలే (4)
సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే
సింబలే హల్లెలే సింబలే
బల్బలే  బల్బలే చేతికందే మాకు వెండి మబ్బులే
సింబలే హల్లెలే సింబలే
వెన్నెలమ్మా వేటకొచ్చే ఏనుగమ్మా అంబారీలో
తేనెలమ్మా తేనుపొచ్చే మల్లె జాజి మందారీలో
సింబలే హల్లెలే సింబలే
సింబలే హల్లెలే సింబలే

సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే
సింబలే హల్లెలే సింబలే
బల్బలే  బల్బలే చేతికందే మాకు వెండి మబ్బులే
సింబలే హల్లెలే సింబలే

చందమామ చేతికొచ్చే సబ్బు బిళ్ళ నేను లెమ్మని
చంద్రవంక వాగు పొంగే స్నానమాడ నిన్ను రమ్మని
పిల్ల నెమలి సంబరం సింబలే సింబలే
పించమెంత సుందరం సింబలే సింబలే
పట్నమన్న పంజరం పట్టు వీడే పావురం
ఈ గూటికొచ్చే కాపురం హొయ్ లాలో
హొయ్ లాలో హొయ్

సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే
సింబలే హల్లెలే సింబలే
బల్బలే  బల్బలే చేతికందే మాకు వెండి మబ్బులే
సింబలే హల్లెలే సింబలే

ఆకాశాలే నేలకొచ్చే మేడ కన్న నీడ మేలని
ఆనందాల వెల్లువచ్చే లాలపోసే కంటి పాపకి
చూడ చూడ వింతలూ సింబలే సింబలే
చుక్కలేడి గంతులు సింబలే సింబలే
ఆకు పచ్చ పొద్దులు మాకు లేవు హద్దులు
ఈ కొండ కోన సీమలో

హొయ్ లాలో హొయ్ (2)

సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే
సింబలే హల్లెలే సింబలే
బల్బలే  బల్బలే చేతికందే మాకు వెండి మబ్బులే
సింబలే హల్లెలే సింబలే
వెన్నెలమ్మా వేటకొచ్చే ఏనుగమ్మా అంబారీలో
తేనెలమ్మా తేనుపొచ్చే మల్లె జాజి మందారీలో

సింబలే హల్లెలే సింబలే (4)

error: Content is protected !!