చిత్రం: చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి (2013)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: శ్రావణి
నటీనటులు: తరుణ్ కుమార్, విమలా రామన్
దర్శకత్వం: కన్మణి
నిర్మాతలు: రాజ్ కుమార్ హీర్వాణి , గోగినేని శ్రీనివాస్
విడుదల తేది: 25.05.2013
కమ్మని ఒక కోరిక
తుమ్మెదై నను తాకగా
గుండెల్లోన విరహమాగేనా
వెచ్చని ఒక వేడుక వెల్లువై నను చేరగ
రెప్పల్లోన కలలు తీరే చిలిపి తరుణాన
ఇది ప్రేమా.. ఇది ప్రేమా..
ఇది ప్రేమా.. ఇది ప్రేమా..
నన్నొచ్చి తాకే శ్వాసతో
మంచల్లే నేనే మారిన
వయసనే ఋతువులో మెరిసాక
కవ్వింత రేపే చూపులో
పువ్వల్లే నేను పూసినా
మనసుతో ఋతువుగా తగిలాక
పెదవులదిరి మధువు కురిసే
ఎదల అలజడిలో
ఇది ప్రేమా.. ఇది ప్రేమా..
ఇది ప్రేమా.. ఇది ప్రేమా..
తప్పేది కాదే తాపమే
ఒప్పేసుకుంది ప్రాణమే
తమకమే జగముగా ఎగిసాక
వద్దంటు ఇంకా దూరమే
ఇచ్చేసి నీకు భారమే
సుఖమయే కడలిలో మునిగాక
తపన పెరిగే తనువు ఒదిగే
వలపు అలుపులలో
ఇది ప్రేమా.. ఇది ప్రేమా..
ఇది ప్రేమా..ఇది ప్రేమా..
కమ్మని ఒక కోరిక
తుమ్మెదై నను తాకగా
గుండెల్లోన విరహమాగేనా