అరెరే.. ఆకాశంలోన ఇల్లే కడుతున్నావా… లిరిక్స్
చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: అనురాగ్ కులకర్ణి, కాల భైరవ
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్
దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాణం: సాయి రాజేష్, బెన్నీ ముప్పనేని
విడుదల తేది: 2020
అరెరే.. ఆకాశంలో.. ఓ.. ఓ.. ఓన…
ఇల్లే కడుతున్నావా.. ఆ.. ఆ.. ఆ..
సూరీడు కూడా పడలేని సోట…
రంగేసినాడు తలదాసుకుంటా..
తనరూపు తానే తెగ సూసుకుంటా.. ఆ ఆ…
మా కిట్టిగాడు పడ్డాడు తంటా.. ఆ…
అరెరే.. ఆకాశంలో.. ఓ.. ఓ.. ఓన…
ఇల్లే కడుతున్నానా.. ఆ.. ఆ.. ఆ..
ఓ.. ఓ.. ఓఓ…
సిత్రలహరి పాటంట తాను..
రేడియోలో గోలంట నేను..
బొమ్మ కదిలేలా.. ఆ.. ఆఆ…
గొంతు కలిసేనా.. ఆ.. ఆఆ…
టూరింగ్ టాకీసు తెర నువ్వనీ…
నేనేమో కట్టైన టిక్కెట్టునీ…
మన జంట హిట్టైన సినిమా అనీ…
అభిమానులే ఒచ్చి సూత్తారనీ…
పగలు రేయంటూ.. లేదు..
కలలే కంటూ.. ఉన్నా.. ఆ.. ఆఆ…
తనతో నుంచుంటే.. చాలూ.. ఊఊ…
కలరు ఫోటోలోనా.. ఆ.. ఆఆ…
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
తరగతి గది దాటీ… లిరిక్స్
చిత్రం: కలర్ ఫోటో (2020)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: కాల భైరవ
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్
దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాణం: సాయి రాజేష్, బెన్నీ ముప్పనేని
విడుదల తేది: 2020
తొలి పలుకులతోనే..
కరిగిన మనసు
చిరు చినుకుల లాగే జారే..
గుసగుసలను వింటూ..
అలలుగ వయసు
పదపదమని తీరం చేరే…
ఏ పనీ పాట లేనీ..
ఈ చల్ల గాలి
ఓ సగం చోటే కోరి
మీ కథే విందా…
ఊరూ.. పేరూ..
లేని ఊహా లోకానా…
తారాతీరం దాటీ..
సాగిందా ప్రేమా…
తరగతి గది దాటీ..
తరలిన కథకీ..
తెలియని తెగువేదో చేరే…
అడుగులు పడలేనీ..
తొలి తపనలకీ..
ఇరువురి మొహమాటాలే..
దూరము పోయే… నేడే…
రాణే.. గీత దాటే.. విధే మారే..
తానే.. తోటమాలి దరే చేరే…
వెలుగూ నీడల్లే…
కలిసే సాయంత్రం
రంగే లేకుండా…
సాగే చదరంగం
సంద్రం లో నదిలా…
జంటవ్వాలంటూ…
రాసారో లేదో…
ఆ దేవుడుగారు…
తరగతి గది దాటీ..
తరలిన కథకీ..
తెలియని తెగువేదో చేరే…
అడుగులు పడలేనీ..
తొలి తపనలకీ..
ఇరువురి మొహమాటాలే..
దూరము పోయే… నేడే…
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
hello
super
nice
supar
saida vali
[email protected]
super