Current Theega (2014)

చిత్రం: కరంట్ తీగ (2014)
సంగీతం: అచ్చు
సాహిత్యం: వరికుప్పల యాదగిరి గౌడ్
గానం: కార్తిక్
నటీనటులు: మంచు మనోజ్ , జగపతిబాబు, రకూల్ ప్రీత్ సింగ్, సన్నీలియోన్
దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 31.10.2014

కళ్ళల్లో ఉంది ప్రేమ
గుండెల్లో ఉంది ప్రేమ
మాటలే పెదవులు దాటవు
ఎందుకమ్మా బాపు బొమ్మ

సొగసులా రోజా కొమ్మ
ముల్లులా గుచ్చోద్దమ్మా
మనసుకే గాయం చేసే
మౌనం ఇంకా ఎన్నాళ్ళమ్మా

భూమ్మీదిలా నేనుండాలి
నీ ప్రేమను పొందేందుకే
నా ప్రేణమే చూస్తున్నది
నీ శ్వాసలో కలిసేందుకే
ఊరికే ఊరూరికే చెలియా
నా ప్రేమతో అటాడకే

కళ్ళల్లో ఉంది ప్రేమ
గుండెల్లో ఉంది ప్రేమ
మాటలే పెదవులు దాటవు
ఎందుకమ్మా బాపు బొమ్మ

error: Content is protected !!