చిత్రం: డాడీ (2001)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, చిత్ర
నటీనటులు: చిరంజీవి, సిమ్రాన్, ఆషిమా బల్లా, రాజేంద్రప్రసాద్
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 04.10.2001
వానా వానా తేనెల వానా
వానా వానా వెన్నెల వానా
కురవని కురవని నే నిలువునా కరగని
పాపకంటి చూపులలో పాలపంటి నవ్వులలో
బాలమేఘ మాలికలో జాలువారు తొలకరిలో
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ
తడిసి తడిసిపోనీ ముడి బిగిసి బిగిసిపోనీ
చిరు చిరు పలుకుల చినుకులలో
బిర బిర పరుగుల వరదలలో
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ
వానా వానా తేనెల వానా
వానా వానా వెన్నెల వానా
ముంగిట్లో మబ్బే వచ్చే మనసులోన మెరుపొచ్చే
పన్నీటి చినుకేవచ్చే ప్రాణంలోన చిగురొచ్చే
బుల్లి బుజ్జి వానదేవతొచ్చే
గుండెపైన నీళ్ళుచల్లి లాలపోసె నేడే
ఘల్లు ఘల్లు గాలిదేవతొచ్చే
జీవితాన ప్రేమచల్లి లాలిపాటపాడే
ఓహో… శ్రావణాల రాణి వచ్చే
ఉన్న చీకుచింతా చీకట్లన్ని కడిగే
ఇంకా ఇంకా ఏంకావాలో అడిగే
మధురంగా కథే సాగుతుంటే
మనబెంగ ఇలా కరుగుతుంటే
వేగంగా కలే తీరుతుంటే
ఆ గంగ ఇలకు జారుతుంటే
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ
వానా వానా తేనెల వానా
వానా వానా వెన్నెల వానా
చిన్నతనం ముందరికొచ్చే పెద్దరికం మరుపొచ్చే
ఏటిగట్లు ఎదురుగవచ్చే ఇసకగూళ్ళు గురుతొచ్చే
కారుమబ్బు నీరు చిమ్ముతుంటే
కాగితాల పడవలెన్నో కంటిముందుకొచ్చే
నీటిలోన ఆటలాడుతుంటె
అమ్మ నోటి తీపితిట్లు జ్ఞాపకానికొచ్చె
ఓహో… పైటకొంగే గొడుగుకాగా
ఈ చాటు చోటు ఎంతో ఎంతో ఇరుకే
ఏమైందంటే నీకు నాకు ఎరుకే
ఒక్కటిగా ఇలా పక్కనుంటు ఇద్దరమై సదా సర్దుకుంటు
ముగ్గురిది ఒకే ప్రాణమంటు ముద్దులతో కథే రాసుకుంటు
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ
వానా వానా తేనెల వానా
వానా వానా వెన్నెల వానా
కురవని కురవని నే నిలువునా కరగని
పాపకంటి చూపులలో పాలపంటి నవ్వులలో
బాలమేఘ మాలికలో జాలువారు తొలకరిలో
తడిసి తడిసిపోనీ మది మురిసి మురిసిపోనీ
తడిసి తడిసిపోనీ ముడి బిగిసి బిగిసిపోనీ
********* ********* *********
చిత్రం: డాడీ (2001)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి
మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే
సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా
మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే
సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా
మాదాపూర్ గుట్టల్లోకి వాకింకొస్తుంటే
గోరింకా గిచ్చేసిందమ్మా
నీ టెక్కేమొ హైటేక్కంతుందే బుల్లెమ్మా
నీ పట్టేమో నా పైట పాకిందెట్టమ్మా
నీ యవ్వారం ఎందాక వచ్చెరో
మ్మ మ్మ మ్మ మ్మ
మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే
సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా
ఓ మాదాపూర్ గుట్టల్లోకి వాకింకొస్తుంటే
గోరింకా గిచ్చేసిందమ్మా
ఎల్లారెడ్డి తోట కాడ నారింజుందమ్మో
రంగు తీపి పులుపు చూస్తే నీ రేంజుందమ్మో
సింగం లాంటి చూపులు పెట్టి చురకలు వేస్తాడే
చీరా రైక కలవని చోట సర్వే చేస్తాడే
చిలిపిగ చినుకై చెంతకొస్తా గడుసుగ తాకి వణుకులిస్తా
నీ చూపే సోకిందంటే పచ్చ గడ్డే బగ్గేరో
నీ చెయ్యి తాకిందంటే ఏమైపోతారో
మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే
సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా
మాదాపూర్ గుట్టల్లోకి వాకింకొస్తుంటే
గోరింకా గిచ్చేసిందమ్మా
సిమ్లా పండు సిమ్రానంటూ బిరుదిస్తాడమ్మో
ఓ దొంగాపండూ దొంగని అంటూ కొరికేస్తాడమ్మో
నడుమే చూస్తే నర్సాపూరు ట్రైనంతుందమ్మో
జడనే వేస్తే నల్ల త్రాచు గుర్తొస్తుందమ్మో…అమ్మో
బిగి కౌగిలిలో బిడియమంతా
బిత్తర చూపులు చూస్తు ఉంటే
తెల్లారి పోయే దాకా పేచీ పెట్టి చంపొద్దే
చల్లారి రాతిరిదంతా వేస్టైపోతుందే
మందారం బుగ్గల్లోకి మచ్చెట్టొచ్చిందే
సీక్రెట్టు చెవిలో చెప్పమ్మా
మాదాపూర్ గుట్టల్లోకి వాకింకొస్తుంటే
గోరింకా గిచ్చేసిందమ్మా
నీ టెక్కేమొ హైటేక్కంతుందే బుల్లెమ్మా
నీ పట్టేమో నా పైట పాకిందెట్టమ్మా
నీ యవ్వారం ఎందాక వచ్చెరో
********* ********* *********
చిత్రం: డాడీ (2001)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి
చిందాడీ చిందాడి తుళ్ళిందంటే చిన్నారి
మమ్మీ చూపుల్లొ చూడు ఎంత వేడి
వద్దంటే వినదే పగలంత ఆడిపాడీ
ముద్దైన తినదె పరిగెత్తె పైడి లేడీ
చిలకల్లె చెవిలో ఎన్నో ఊసులాడీ
పడుకోదె పన్నెండైనా ఏంచేయాలీ
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడికు ఊపిరిలొ మురిసే కూచిపూడి
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో
నువ్వే నా కలలన్నీ పెంచావే నీ కన్నుల్లో
నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేనో
ఎవరినెవరు లాలిస్తున్నారో
చిత్రంగ చూస్తుంటేనే కన్నతల్లి
పొంగిందె ఆ చూపుల్లో పాలవెల్లి
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడికు ఊపిరిలో మురిసే కూచిపూడి
వర్షంలో తడిసొచ్చీ హాయ్ రె హాయ్ అనుకుందామ
వర్షంలో తడిసొచ్చీ హాయ్ రె హాయ్ అనుకుందామ
రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా
ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతునే మీ మమ్మి
హై పిచ్‌లో మ్యూజిక్ కల్లె తిడుతుంటుందే
మన తుమ్ములు డ్యూయట్టల్లే వినపడుతుంటే
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడికు ఊపిరిలో మురిసే కూచిపూడి
వద్దంటే వినదే పగలంత ఆడిపాడీ
ముద్దైన తినదె పరిగెత్తె పైడి లేడీ
చిలకల్లె చెవిలో ఎన్నో ఊసులాడీ
పడుకోదె పన్నెండైనా ఏంచేయాలీ