చిత్రం: దాగుడుమూతలు (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, బి.సరోజాదేవి
కథ: ముళ్ళపూడి వెంకటరమణ
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: డి.బి.నారాయణ
విడుదల తేది: 21.08.1964
పల్లవి:
దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం
దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం
దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం
చరణం: 1
మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడు
ఆ… దేవుడు కనపడలేదని మనిషి నాస్తికుడైనాడు
దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం
చరణం: 2
పశువులకన్నా పక్షులకన్నా మనిషిని మిన్నగ చేశాడు
బుద్ధిని ఇచ్చి హృదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు
బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధేరాక
బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధేరాక
నరుడే ఈ నరలోకం నరకం చేశాడు
దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం
చరణం: 3
తాము నవ్వుతూ నవ్విస్తారు… కొందరు అందరినీ
తాము నవ్వుతూ నవ్విస్తారు… కొందరు అందరినీ
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ
నేను నవ్వితే ఈ లోకం… చూడలేక ఏడ్చింది
నేనేడిస్తే ఈ లోకం… చూసి చూసి నవ్వింది
దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం
మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం
దేవుడనేవాడున్నాడా….
****** ****** ******
చిత్రం: దాగుడుమూతలు (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: పిఠాపురం, స్వర్ణలత
పల్లవి:
డివ్వి డివ్వి డివ్విట్టం… నువ్వంటేనే నాకిష్టం
డివ్వి డివ్వి డివ్విట్టం… నువ్వంటేనే నాకిష్టం
డీడిక్కంది అదృష్టం… గట్టెక్కింది మనకష్టం
డీడిక్కంది అదృష్టం… గట్టెక్కింది మనకష్టం
బాజాలతో బాకాలతో… పందిట్లో ఇద్దరం ఒకటౌదాం
బాజాలతో బాకాలతో… పందిట్లో ఇద్దరం ఒకటౌదాం…
డివ్వి డివ్వి డివ్విట్టం… నువ్వంటేనే నాకిష్టం
డీడిక్కంది అదృష్టం… గట్టెక్కింది మనకష్టం
చరణం: 1
అందరు చుట్టాలు వస్తారు… ఆనందమానందమంటారు
అందరు చుట్టాలు వస్తారు… ఆనందమానందమంటారు
అబ్బాయి తొందర చూస్తారు… తాము అటుతిరిగి పకపకా నవ్వేరు
అబ్బాయి తొందర చూస్తారు… తాము అటుతిరిగి పకపకా నవ్వేరు
ఒహో..డివ్వి డివ్వి డివ్విట్టం… నువ్వంటేనే నాకిష్టం
డీడిక్కంది అదృష్టం… గట్టెక్కింది మనకష్టం
చరణం: 2
కవ్వించి సిరులన్ని కలిసొచ్చినా… కాబోవు పెళ్ళామే కడు పచ్చన
కొండకు వేశాను ఒక నిచ్చెనా… నీ కొంగు తగిలితే ఒళ్ళు నులివెచ్చనా
డీడిక్కంది అదృష్టం… గట్టెక్కింది మనకష్టం
డివ్వి డివ్వి డివ్విట్టం… నువ్వంటేనే నాకిష్టం
చరణం: 3
బుక్కావసంతాలు జల్లుకొంటాం… ఎంచక్కా తలంబ్రాలు పోసుకొంటాం
బుక్కావసంతాలు జల్లుకొంటాం… ఎంచక్కా తలంబ్రాలు పోసుకొంటాం
దీవించివేస్తారు అక్షంతలూ… ఇక అవుతాయి సౌక్యాల లక్షంతలూ
దీవించివేస్తారు అక్షంతలూ… ఇక అవుతాయి సౌక్యాల లక్షంతలూ
డివ్వి డివ్వి డివ్విట్టం… నువ్వంటేనే నాకిష్టం
డీడిక్కంది అదృష్టం… గట్టెక్కింది మనకష్టం
****** ****** ******
చిత్రం: దాగుడుమూతలు (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: సుశీల
పల్లవి:
ఎంకొచ్చిందోయి మావా… ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం… ఏదో తెచ్చిందోయ్
ఎంకొచ్చిందోయి మావా… ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం… ఏదో తెచ్చిందోయ్
చరణం: 1
గళ్ళకోక నువ్విస్తే… కట్టుకొన్నదోయ్
నువ్వు కళ్ళతోను కవ్విస్తే… నవ్వుకొన్నదోయ్
నవ్వులన్ని నాగమల్లి పూవులన్నదోయ్
నవ్వులన్ని నాగమల్లి పూవులన్నదోయ్
ఈ నచ్చినోడికే మనసు ఇచ్చుకొన్నదోయ్… మావా
ఎంకొచ్చిందోయి మావా… ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం… ఏదో తెచ్చిందోయ్
చరణం: 2
మావకూతురనుకొంటూ మనసుపడితివోయ్
నువ్వు మనసుపడ్డ ఏకమే తానుకట్టేనోయ్
మావకూతురనుకొంటూ మనసుపడితివోయ్
నువ్వు మనసుపడ్డ ఏకమే తానుకట్టేనోయ్
దోసలితో వలపు నువ్వు దోచుకొంటివోయ్
దోసలితో వలపు నువ్వు దోచుకొంటివోయ్
నీ ఆసికాలు నమ్ముకొని ఆశపడ్డదోయ్… మావోయ్
ఎంకొచ్చిందోయి మావా… ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం… ఏదో తెచ్చిందోయ్
చరణం: 3
తగువులాడినా చాలు… తనివితీరునోయ్
నీ వగలమారి మాటలన్నీ… నగలవంటివోయ్
తగువులాడినా చాలు… తనివితీరునోయ్
నీ వగలమారి మాటలన్నీ… నగలవంటివోయ్
తాళిబొట్టు మాత్రమే తక్కువన్నదోయ్
తాళిబొట్టు మాత్రమే తక్కువన్నదోయ్
నీ తల్లో నాలుకమల్లే తానుమెలుగునోయ్… మావా
ఎంకొచ్చిందోయి మావా… ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం… ఏదో తెచ్చిందోయ్… మావోయ్
ఎంకొచ్చిందోయి మావా… ఎదురొచ్చిందోయ్
ఎదురొచ్చి నీకోసం… ఏదో తెచ్చిందోయ్
****** ****** ******
చిత్రం: దాగుడుమూతలు (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెత్తగ అడిగితే లేదనేది లేదుగా
మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా
చరణం: 1
నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో
నీది కానిదేది లేదు నాలో నిజానికే నేనున్నది నీలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో
ఒక్కటే మనసున్నది ఇద్దరిలో
ఆ ఒక్కటీ చిక్కెనీ గుప్పిటిలో
హా…
చరణం: 2
నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను
నిన్ను చూచి నన్ను నేను మరచినాను
నన్ను దోచుకొమ్మనీ నిలిచినాను
దోచుకుందమనే నేను చూచినాను
దోచుకుందమనే నేను చూచినాను
చూచి చూచి నువ్వె నన్ను దోచినావు
చరణం: 3
కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు
కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు
కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు
దొరికినాము చివరకు తోడు దొంగలం
దొరికినాము చివరకు తోడు దొంగలం
దొరలమై ఏలుదాము వలపు సీమను
హా…
****** ****** ******
చిత్రం: దాగుడుమూతలు (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల
పల్లవి:
గోరొంకగూటికే చేరావు చిలకా
గోరొంకగూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారుమొలకా
గోరొంకగూటికే చేరావు చిలకా
చరణం: 1
ఏ సీమదానవో ఎగిరెగిరి వొచ్చావు
అలసివుంటావు మనసు చెదరివుంటావు
ఏ సీమదానవో ఎగిరెగిరి వొచ్చావు
అలసివుంటావు మనసు చెదరివుంటావు
మా మల్లెపూలు నీకు మంచికథలు చెప్పునే
మా మల్లెపూలు నీకు మంచికథలు చెప్పునే
ఆదమరిచి ఈ రేయి హాయిగా నిదురపో
చరణం: 2
నిలవలేని కళ్ళు నిదరపొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయీ… అబ్బ! ఉండన్నాయీ
నిలవలేని కళ్ళు నిదరపొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు వద్దన్నాయీ… అబ్బ! ఉండన్నాయీ
పైటచెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పైటచెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి
పలుకైనా పలుకవా బంగారు చిలకా
గోరొంకగూటికే చేరావు చిలకా
భయమెందుకే నీకు బంగారుమొలకా
గోరొంకగూటికే చేరావు చిలకా
****** ****** ******
చిత్రం: దాగుడుమూతలు (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాశరథి
గానం: సుశీల
పల్లవి:
గోరంకకెందుకో కొండంత అలక
అలకలో యేముందో తెలుసుకో చిలకాగోరంకకెందుకో కొండంత అలక
అలకలో యేముందో తెలుసుకో చిలకా
గోరంకకెందుకో కొండంత అలక
చరణం: 1
కోపాలలో ఏదో కొత్త అర్ధం ఉంది
గల్లంతులో ఏదో గమ్మత్తు ఉంది
కోపాలలో ఏదో కొత్త అర్ధం ఉంది
గల్లంతులో ఏదో గమ్మత్తు ఉంది
ఉరుములు మెరుపులు ఊరికే రావులే
ఉరుములు మెరుపులు ఊరికే రావులే
వాన జల్లు పడునులే మనసు చల్ల పడునులే
వాన జల్లు పడునులే మనసు చల్ల పడునులే
చరణం: 2
మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది
మాటకు మనసుకు మధ్యన తగవుంది
మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది
మాటకు మనసుకు మధ్యన తగవుంది
తగవు తీరేదాక తలుపు తీయెద్దులే
తగవు తీరేదాక తలుపు తీయెద్దులే
ఆదమరచి అక్కడే హాయిగా నిదరపో
****** ****** ******
చిత్రం: దాగుడుమూతలు (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
అడగక ఇచ్చిన మనసే ముద్దు .. అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు .. తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు .. అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు .. తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు
చరణం: 1
నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు
నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు
చరణం: 2
చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు
చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు
చరణం: 3
పచ్చని చేలే కంటికి ముద్దు ..నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు
పచ్చని చేలే కంటికి ముద్దు ..నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు
చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ఊహుహు.హూహు
చెట్టు చేమా జగతికి ముద్దు .. నువ్వు నేను ముద్దుకు ముద్దు
****** ****** ******
చిత్రం: దాగుడుమూతలు (1964)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
అందలం ఎక్కాడమ్మ అందకుండా పోయాడమ్మ
ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎదిగిపోయాడమ్మ
అందలం ఎక్కాడమ్మ అందకుండా పోయాడమ్మ
ఇంతవాడు ఇంతకు ఇంతై ఎంతో ఎదిగిపోయాడమ్మ
చరణం: 1
నిన్న రేతిరి తానూ పొన్నచెట్టు నీడా
నిన్న రేతిరి తానూ పొన్నచెట్టు నీడా
ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి
ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి
ఒడిలోనా ఒదిగినాడమ్మా ఆ ఆ
నా ఎదనిండా నిండినాడమ్మా ఆ ఆ ఆ ఆ
చరణం: 2
ఆ మాటలకు నేనూ మైమరచిపోయానూ
ఆ మత్తులో కాస్త కనుమూసి ఒరిగానూ
ఆ మాటలకు నేనూ మైమరచిపోయానూ
ఆ మత్తులో కాస్త కనుమూసి ఒరిగానూ
భళ్లునా తెల్లారిపోయెనమ్మా ఆ ఓ ఓ ఓ..
ఒళ్లు ఝళ్లునా చల్లారిపోయెనమ్మా
అందాన్ని చూశానమ్మ అందలం ఎక్కానమ్మా
ఎంతవాణ్ణి ఎంతనైనా నే నీలో ఇమిడిపోతానమ్మా
అందాన్ని చూశానమ్మ అందలం ఎక్కానమ్మా
ఎంతవాణ్ణి ఎంతనైనా నే నీలో ఇమిడిపోతానమ్మా
చరణం: 3
వెన్నెపూసవంటీ కన్నెపిల్ల ఉంటే
వెన్నెపూసవంటీ కన్నెపిల్ల ఉంటే
సన్నజాజులే సిరులూ మల్లెపువ్వులే మణులు
సన్నజాజులే సిరులూ మల్లెపువ్వులే మణులు
నువు లేక కలిమిలేదమ్మా ఆ ఆ
నీకన్నా కలిమి ఏదమ్మా
అందాన్ని చూశానమ్మ అందలం ఎక్కానమ్మా
ఎంతవాణ్ణి ఎంతనైనా నే నీలో ఇమిడిపోతానమ్మా