చిత్రం: దళపతి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి (All Songs)
గానం: యస్. పి. బాలు, చిత్ర
నటీనటులు: రజినీకాంత్, ముమ్మట్టి, అరవింద్ స్వామి, శ్రీవిద్య, భానుప్రియ, శోభన, గీత
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: జి. వెంకటేశ్వరన్
విడుదల తేది: 05.11.1991
అరె చిలకమ్మా చిటికేయంటా నువు రాగాలే పాడాలంటా
ఇక సాగాలి మేళాలంటా ఈ సరదాలే రేగాలంటా
ఓ చిన్నోడా పందిర వేయరా ఓ రోజూపూవు మాలే తేరా
ఈ చినదాని మెడలో వేయరా నడిరేయంతా సందడిచేయరా
ఆ టక్కరిగాడే అహ ఈ బుల్లోడే నను కట్టివేసే మొనగాడే లేడే
చరణం: 1
చీకుచింత లేదు చిందులేసే ఊరు పాటా ఆటా ఇది ఏందంటా
అహ ఊరి లోనివారు ఒక్కటైనారు నీకు నాకు వరసేనంటా
పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే కలలూరేనే
వాడనిదంట ఈ వేడుకే అందరికింకా వెత తీరేనే
అహ ఈ పూట కానీరా ఆటా పాటా
బుల్లెమ్మా నవ్విందంటా మణిముత్యాలే రాలేనంటా
అరె మామయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట
నీ మాటే నాకు ఓ వెండి కోట
నువు నాదేనంటా నీతోనే ఉంటా
చరణం: 2
వేడుకైన వేళ వెన్నెలమ్మలాగ దీపం నీవై వెలగాలంట
అహ చీకటంతా పోయే పట్టపగలాయే ఏలా దీపం ఇక మనకంట
జాతికి నేడే మంచికాలమే నమ్మకముంటే వచ్చి తీరేనే
ఊరికి నీవే మేలుకోరితే కోరికలన్నీ రేపే తీరేనే
అరె ఆనందం నీ సొంతం అంతేకాదా
చిట్టెమ్మా నన్నే చూడు జత చేరమ్మా నాతో పాడు
మురిపాల పండగపూట మన ముచ్చట్లే సాగాలంట
అహ నువు సై అంటే నీ తోడై ఉంటా
నీ కళ్లల్లోన నే కాపురముంటా
********* ******** ********
చిత్రం: దళపతి
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, కె.జె.యేసుదాస్ & కోరస్
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
ఈనాడూ..ఊరంతటా..రాగాలా దీపాలటా
మీకొసం వెలిగేనట…ఉల్లాసం మీదేనటా.. హొయ్…
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
వద్దంటా నే పాతదనాన్ని ముద్దంటా నే కొత్తదనాన్ని
కొత్తగ ఇపుడే పుట్టావనీ అనుకో మంటారా… రేయ్..
బతుకే దారి పోతే ఎంటీ బాటేదైనా నీకది ఏంటి..
నారుని వేసే ఆ పై వాడే నీరే పోస్తాడే…హోయ్..
మూల బడి వున్న బుట్టా తట్టా తీసి
భోగి మంటల్లోన నీవే వెయ్యరా..హోయ్..
తెల్లవారగానే సంకురాత్రి కాదా
పొంగే పాలు అందరి పాలు హాయిగా
నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు
అంతకంటే సందడేది లేదే… హోయ్
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
ఈనాడూ..ఊరంతటా..రాగాలా దీపాలటా
మీకొసం వెలిగేనట…ఉల్లాసం మీదేనటా.. హొయ్
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
బంధాలేంటి భందువులేంటి.. పోతే ఎంటి వస్తే ఏంటీ
తిండే లేదని దిగులే పడని జన్మే నాదీరా..హ హ
మనసే ఇచ్చి చెయ్యందించి తోడూ నీడై మిత్రుడు కలిసే
ఆతనికంటే చుట్టాలెవరూ నాకే లేరంటా
హృదయం మాత్రం నాదే.. ఊపిరి కాదా తనదే
నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తాలే
నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నానీవేళ
తన మాటే నాకు వేదం అంటా ఏ వేళా
శోకం వీడే స్వర్గం చూసే..రాగం పాడే తాళం వేసే
పాటలు పాడే పువ్వుల జంటా మేమే
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
ఈనాడు..ఊరంతటా..రాగాల దీపాలట
మీకొసం వెలిగేనట…ఉల్లాసం మీదేనటా..హొయ్…
సింగారాలా పైరుల్లోనా బంగారాలే పండేనంట పాడాలి
నవ్వుల్లోనా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
********* ******** ********
చిత్రం: దళపతి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల
ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట
ఇది కాదా దేవుని ఆట
ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
చరణం: 1
మాటాడే నీ కన్నులే నాకవి పున్నమి వెన్నెలే
నీ చిరుబోసి నవ్వురా నాకది జాజి పువ్వురా
వీధినే పడి వాడిపోవునో
దైవ సన్నిధినే చేరునో ఇక ఏమౌనో
చరణం: 2
ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
సాగనీ నా పాట ఎటు సాగునో నీ బాట
ఇది కాదా దేవుని ఆట
ఆడ జన్మకు ఎన్ని శోకాలో
చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో
********* ******** ********
చిత్రం: దళపతి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర
పల్లవి:
సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంట జన్మకే తోడై నేనుంట
గుండెలో నిండమంటా నీడగా పాడమంట
నా సిరి నీవేనట
చరణం: 1
అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా
మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా
రేపవలు నిద్దురలోన ఎద నీ తోడే కోరును
యుద్దాన ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును
ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శోధన..
జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన
నాలో ప్రేమే మరిచావో ప్రేమే నన్నే గెలిచేనే
చరణం: 2
పూవులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే
ఊహలే పూలై పూచు నీ ఎద మాటున చేరితే
మాసాలు వారాలవును నీవు, నేను కుడితే
వారాలు మాసాలవును బాటే మారి సాగితే
పొంగునీ బంధాలే నీ దరి చేరితే
గాయాలు ఆరేను నీ దరి చేరితే
నీవే కదా నా ప్రాణం నీవే కదా నా లోకం
********* ******** ********
చిత్రం: దళపతి (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: స్వర్ణలత
యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా
రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే
రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే
చరణం: 1
యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలెనే రాధ గుండెలో
యదుకుమారుడే లేని వేళలో
వెతలు రగిలెనే రాధ గుండెలో
పాపం రాధా
యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా